సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

చర్మానికి చల్లదనాన్నిచ్చే ప్యాక్స్ ఇవే..!

వేసవికాలం వచ్చిందంటే చాలు.. ఎండ వేడికి చర్మం మండిపోతూ, ఎర్రగా కమిలిపోయినట్లుగా కనిపిస్తుంది. ఇక బయటకు వెళ్లి వస్తే ముఖంలో కళ పోయి నిర్జీవంగా మారిపోతుంది. మరి, అలసిపోయిన చర్మానికి తిరిగి జీవం పోసి, వేసవి వేడిమి నుంచి చల్లదనాన్ని అందించే ప్యాక్స్ ఏమైనా ఉన్నాయా అంటే.. ఎందుకు లేవూ..! ఇంట్లో లభించే సహజసిద్ధమైన పదార్థాలతోనే కొన్ని ప్యాక్స్ తయారుచేసుకొని వాటి ద్వారా వేసవిలో చర్మాన్ని సంరక్షించుకోవచ్చంటున్నారు సౌందర్య నిపుణులు. ఇంతకీ ఆ ప్యాక్స్ ఏంటి? అందులో ఉపయోగించే పదార్థాలేంటో.. మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

ఈ లాక్‌డౌన్‌లో వయసును ‘లాక్‌’ చేయండిలా!

ఆఫీసుకు వెళ్లేటప్పుడు మన కోసం మనం కాస్త సమయం కేటాయించుకుందామన్నా సమయం దొరికేది కాదు. ఇంటి పని, వంట పనికి తోడు భర్తను ఆఫీస్‌కి పంపడం, పిల్లల్ని రడీ చేసి స్కూల్‌కి పంపడం.. ఇలా వీటితోనే సరిపోయేది. ఇక సాయంత్రం ఇంటికొచ్చాక మళ్లీ ఇంటి పని షరా మామూలే. అంతటి బిజీ లైఫ్‌స్టైల్లో అందాన్ని సంరక్షించుకోవడానికి ఓ అరగంటైనా సమయం ఉండేది కాదు. కానీ లాక్‌డౌన్‌ మొదలైనప్పట్నుంచి ఇంట్లో పని పెరిగినా, ఇంటి నుంచి పనిచేసినా కొంతమందికి కాస్తో కూస్తో ఖాళీ సమయం దొరికే అవకాశం ఉండచ్చు. అలాంటి అవకాశం ఉన్నవారు ఇలా దొరక్క దొరక్క దొరికిన ఆ సమయంలో మనం చేయాలనుకున్న పనులు చేసుకోవచ్చు. అందులో అందాన్ని సంరక్షించుకోవడం కూడా ఒకటి. చాలామంది చిన్న వయసులోనే ముఖంపై ముడతలు, గీతలు ఏర్పడుతున్నాయని దిగులు పడుతుంటారు. అలాంటి వారు ఈ వంటింటి ఔషధాలను ఉపయోగించుకొని నవ యవ్వనంగా మెరిసిపోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

Know More

women icon @teamvasundhara

ఈ జ్యూస్‌లతో ఇమ్యూనిటీ పెంచుకుందాం!

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ దండయాత్ర కొనసాగుతోంది. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమై బతుకు జీవుడా అంటూ సమయాన్ని గడుపుతున్నారు. ఇక కరోనా వైరస్ వ్యాప్తి మాత్రం రోజురోజుకీ పెరిగిపోతూనే ఉంది. ఇదిలా ఉంటే ఇప్పటికీ మందు దొరకని ఈ వ్యాధిని కేవలం నివారణ చర్యల ద్వారానే అడ్డుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే వ్యక్తిగత శుభ్రత పాటించడంతో పాటు, రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ద్వారా కరోనాను దరిచేరనివ్వకుండా జాగ్రత్తపడచ్చని వారు సూచిస్తున్నారు. ఈ క్రమంలో మనం తీసుకునే కొన్ని రకాల పదార్థాలతో పాటు పలు పండ్లు, కాయగూరల రసాలు కూడా మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో దోహదం చేస్తాయి. మరి, అలాంటి కొన్ని రసాల గురించి ఇప్పుడు తెలుసుకుందామా..!!

Know More

women icon @teamvasundhara

కరోనాను కట్టడి చేసే ‘సూపర్‌’ఫుడ్‌!

కొన్ని నెలల క్రితం చైనాలో పుట్టిన కొవిడ్‌-19 (కరోనా వైరస్‌) ఇప్పుడు ప్రపంచాన్నే కలవరపెడుతోంది. ఇప్పటికే పలు దేశాలను అతలాకుతలం చేస్తోన్న ఈ మహమ్మారి భారతదేశంలోనూ కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకూ మనదేశంలో కరోనా వైరస్‌ కేసులు పెరుగుతుండడమే దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే ఇది ప్రాణాంతక వ్యాధి కాదని, వ్యక్తిగత శుభ్రత పాటిస్తే దీనిని అరికట్టవచ్చని కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా వ్యక్తిగత పరిశుభ్రతపై పలువురు సెలబ్రిటీలు కూడా పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నారు. అయితే దీంతో పాటు కరోనా వైరస్‌ సోకకుండా ఉండాలన్నా, సోకినా త్వరితగతిన కోలుకోవాలన్నా రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండాలని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.

Know More

women icon @teamvasundhara

పాలుగారే చెక్కిళ్లు.. తేనెలూరే అధరాల వెనకున్న రహస్యాలివే!

‘జగాన అతిశయాలు ఏడైనా... ఓ మాట్లాడే పువ్వా... నువ్వు ఎనిమిదో అతిశయమే.. నింగి లాంటి నీ కళ్లు.. పాలుగారే చెక్కిళ్లు.. తేనెలూరే అధరాలు అతిశయమే..’ అంటూ మగువల సౌందర్యాన్ని వర్ణించడానికి మాటలు చాలక పాట రూపంలో వర్ణించాడో సినీ కవి. ఇంతటి అపురూప లావణ్యానికి తామేమీ తీసిపోమని, అందుకు పూర్వీకుల నుంచి తరతరాలుగా పాటిస్తూ వస్తోన్న సహజసిద్ధమైన సౌందర్య ఉత్పత్తులే కారణమంటున్నారు ‘స్పెయిన్‌ అతివలు’. బామ్మల సౌందర్య చిట్కాలను క్రమం తప్పకుండా అనుసరిస్తూ తమ అందానికి మెరుగులు దిద్దుతున్నారు. మరి, స్పెయిన్‌ ముద్దుగుమ్మల ఆ న్యాచురల్‌ బ్యూటీ సీక్రెట్సేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

ఇలా చేస్తే యాపిల్‌ ముక్కలు రంగు మారవు!

సాధారణంగా, మనమేదైనా పండుని కట్‌ చేశాక లేదంటే ఒలిచాక.. ఆ మొత్తం పండుని ఒక్కసారిగా తినలేకపోతే.. మిగిలిన ముక్కలను ఫ్రిజ్‌లో నిల్వచేసుకొని తర్వాత తినడం చాలామందికి అలవాటే. ఎందుకంటే.. ఫ్రిజ్‌లో అవి కొన్ని గంటల వరకు తాజాగా ఉంటాయి కాబట్టి..! కానీ.. యాపిల్‌ విషయంలో మాత్రం ఇది అసాధ్యమనే చెప్పుకోవాలి. ఎందుకంటే.. యాపిల్‌ పండును ఒక్కసారి కట్‌ చేశాక, దాన్ని వెంటనే తినేయాలి.. లేదంటే.. యాపిల్‌ గుజ్జులోని పాలీఫినోల్‌ ఆక్సిడేస్‌ అనే ఎంజైమ్‌ గాలిలోని ఆక్సిజన్‌తో చర్య జరిపి గుజ్జును బ్రౌన్‌ కలర్‌లోకి మారుస్తుంది. ఇలా ఎరుపెక్కిన యాపిల్‌ ముక్కల్ని చూస్తే అస్సలు తినాలనిపించదు. మరి, యాపిల్‌ ముక్కలు కట్‌ చేశాక కూడా రంగు మారకుండా అలాగే ఉంటే ఎంత బావుంటుందో అనుకుంటున్నారా? అయితే అందుకు కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే సరి. ఫలితంగా కొన్ని గంటల పాటు యాపిల్‌ ముక్కలు తాజాగా ఉంటాయి. మరి, యాపిల్‌ ముక్కల్ని రంగు మారకుండా తాజాగా ఉంచే ఆ సింపుల్‌ టిప్స్‌ ఏంటో మనమూ చూసేద్దాం రండి..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala