పాప పుట్టినా ఆయనలో మార్పు రాలేదు.. ఏం చేయమంటారు?
నమస్తే మేడమ్.. నాకు పెళ్లై ఏడు సంవత్సరాలు అవుతోంది. మా ఆయనకు నలుగురు అక్కలు, ఆయన ఒక్కరే. పెళ్లైన తర్వాత మొదటి నాలుగు సంవత్సరాలు వాళ్ల అక్కల డెలివరీలు.. ఆ పిల్లల మొదటి పుట్టిన రోజు వేడుకలు.. ఇలాగే గడిచిపోయింది. మా ఆయన అక్కలకు, అత్తమామలకు రోజూ సేవ చేయాలి. లేకుంటే నన్ను బెదిరించేవారు. మా అమ్మ వాళ్ల ఇంట్లో వదిలేసేవారు. పంచాయతీ పెట్టి మా అత్తగారు ఎలా చెప్తే అలా వింటే తీసుకెళ్లడం చేశారు. ఇదంతా భరించలేక షీటీమ్స్ని కలిశాను. వారు మమ్మల్ని కౌన్సెలింగ్ చేసి ఒక సంవత్సరం వరకు మా ఇద్దరినీ ఎవరూ డిస్టర్బ్ చేయొద్దని చెప్పారు. నన్ను తిరిగి తీసుకెళ్లాక అత్తమామలు మా ఆయనతో మాట్లాడడం మానేశారు. దాంతో ఆయన కూడా నాతో కొన్ని రోజులు మాట్లాడడం మానేశాడు.
Know More