ఈ వయసులో మరో మహిళతో సంబంధం... ఆయన్ని మార్చేదెలా?
హాయ్ మేడమ్.. మా ఇంట్లో నేను, అమ్మ, నాన్న, అన్నయ్య ఉంటాం. మా నాన్న వయసు 59 సంవత్సరాలు. తను చాలా మంచివారు. అయితే గత 5 సంవత్సరాల నుండి ఆయన ఒక మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. ఆమె వయసు 30 సంవత్సరాలు. మేము ఉద్యోగరీత్యా వేరే ప్రాంతంలో ఉంటున్నాం. దానివల్ల ఇంటి విషయాలు మాకు సరిగా తెలియవు. మా అమ్మ ఎప్పుడూ నాన్న గురించే ఆలోచిస్తుంటుంది. ఆ విషయంపై ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయి. దాంతో అదే విషయం గురించి మా అన్నయ్య నాన్నతో మాట్లాడారు. దానికి ఆయన అదంతా ఒక రూమర్.. అని కొట్టిపడేశాడు. మా నాన్న మీద కంప్త్లెంటు చేద్దామంటే, అప్పటికే ఈ విషయం గురించి అమ్మ.. నాన్నను అడిగే ప్రశ్నలకు నాన్న కొన్నిసార్లు ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేశారు. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో అర్థం కావట్లేదు. సలహా ఇవ్వండి. - ఓ సోదరి
Know More