ఐవీఎఫ్ ఫెయిలైనా.. ఆరోగ్యకరమైన జీవనశైలితో సహజంగానే తల్లయ్యా!
పెళ్లయిన ప్రతి మహిళా అమ్మతనం కోసం ఆరాటపడుతుంది.. ఎప్పుడెప్పుడు తల్లినవుతానా అని తపిస్తుంది. ఐర్లాండ్‌లోని డబ్లిన్‌కు చెందిన ఓ మహిళ కూడా అమ్మతనం కోసం ఎంతగానో పరితపించింది.. ఎన్నో ఆస్పత్రులు తిరిగింది.. ఎందరో డాక్టర్లను కలిసింది. అయినా తన కల నెరవేరకపోయేసరికి తల్లడిల్లింది. ఆఖరి ప్రయత్నంగా ఐవీఎఫ్ చికిత్స కూడా తీసుకుంది. అక్కడా ఆమెకు నిరాశే ఎదురైంది. ‘ఇక ఈ జీవితంలో నాకు అమ్మయ్యే యోగం లేదేమో’ అనుకుంటోన్న తరుణంలోనే దేవుడు వరమిచ్చినట్లు సహజంగానే గర్భం ధరించిందామె. పండంటి కూతురు పుట్టడంతో పట్టరానంత సంతోషంలో మునిగిపోయింది. ప్రస్తుతం తన కూతురితో, భర్తతో సంతోషంగా జీవిస్తోన్న ఆమె.. తనలాంటి వారి గురించి నాకెందుకులే అనుకోలేదు. అమ్మయ్యే క్రమంలో తనకు ఎదురైన సమస్యలు, సవాళ్లను నలుగురితో పంచుకోవాలనుకుంది.. తద్వారా అమ్మతనం కోసం ఆరాటపడుతోన్న మహిళల్లో స్ఫూర్తి నింపాలనుకుంది. ఇందుకోసం ఆన్లైన్ వేదికగా.. మహిళలకు ఉపయోగపడే ఎన్నో చిట్కాలను అందిస్తోన్న ఆమె అమ్మయ్యే క్రమంలో తనకెదురైన అనుభవాలను, సవాళ్లను ఇలా పంచుకుంది.
Know More