సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

ఇదే నా ఇమ్యూనిటీ డ్రింక్‌.. మీరూ ట్రై చేయండి!

కరోనా వచ్చిన దగ్గర్నుంచి అందరికీ వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యంపై ఎక్కడ లేని శ్రద్ధ పెరిగిపోతోంది. ఈ మహమ్మారి బారిన పడకూడదని ప్రతి ఒక్కరూ రోగనిరోధక శక్తిని పెంచుకునే పనిలో పడ్డారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఉదయాన్నే ఏదో ఒక ఇమ్యూనిటీ డ్రింక్‌ తీసుకోనిదే బయట అడుగు పెట్టట్లేదు. మన ముద్దుగుమ్మలు సైతం తాము తీసుకునే ఇమ్యూనిటీ షాట్స్‌ గురించి సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటూ అందరిలో ఆరోగ్యం పట్ల స్పృహను మరింత రెట్టింపు చేస్తున్నారు. ఆ జాబితాలో తానూ ఉన్నానంటూ తాజాగా మన ముందుకొచ్చేసింది బాలీవుడ్‌ అందాల తార మలైకా అరోరా. వయసు పైబడుతున్నా వన్నె తరగని అందానికి, ఫిట్‌నెస్‌కు చిరునామాగా నిలుస్తోన్న ఈ ఫిట్టెస్ట్‌ బ్యూటీ.. తన ఆరోగ్య, ఫిట్‌నెస్‌ రహస్యాలను, తాను చేసే వ్యాయామాలకు సంబంధించిన వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాను ఉదయాన్నే తీసుకునే ఇమ్యూనిటీ డ్రింక్‌ గురించి వివరిస్తూ ఇన్‌స్టాలో తాజాగా ఓ వీడియో పోస్ట్‌ చేసిందీ యమ్మీ మమ్మీ.

Know More

women icon @teamvasundhara

ఇలా చేస్తే కిచెన్‌లో పని ఎంతో ఈజీ!

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌.. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో చాలామందికి ఈ ఆప్షన్‌ ఎంతో సౌకర్యవంతంగా ఉందని చెప్పచ్చు. అయితే ఇలా ఎన్ని సౌకర్యాలున్నా ఆడవారికి ఇంటి పని నుంచి మాత్రం విముక్తి కలగట్లేదు. ఓవైపు ఇంటి నుంచి చేసే ఆఫీస్‌ పని, మరోవైపు ఇంటి పని చేసుకోవడం, ఇంకోవైపు పిల్లల్ని చూసుకోవడం.. ఇవన్నీ బ్యాలన్స్‌ చేయాలంటే కత్తి మీద సామే! అలాగని మరీ ఒత్తిడిగా ఫీలవ్వాల్సిన పనిలేదు. చిన్నపాటి చిట్కాలు పాటిస్తే.. అటు వంటింట్లో పనిని త్వరగా పూర్తి చేసుకోవచ్చు.. ఇటు ఇంటి నుంచి చేసే పనిని సమర్థంగా నిర్వర్తించవచ్చు.. ఇంతకీ ఆ చిట్కాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

ఇంటి నుంచి పనిచేసినా ప్రొఫెషనల్‌గా తయారవ్వాల్సిందే!

లాక్‌డౌన్‌ పుణ్యమాని అప్పటిదాకా అలవాటు లేని కంపెనీలు సైతం ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’ని అలవాటు చేసుకున్నాయి. దీంతో ఇంటి నుంచే ఉద్యోగులు సౌకర్యవంతంగా తమ విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఎలాగూ ఇంటి నుంచే పని చేయడం కదా అని చాలామంది బద్ధకిస్తూ ఆలస్యంగా నిద్ర లేవడం, లాగిన్‌ అవ్వాల్సిన టైమ్‌ దాటిపోతుందని గబగబా బ్రష్‌ చేసుకొని ల్యాప్‌టాప్‌ ముందు కూర్చోవడం, కొంతమందైతే ఏదో ఒకటిలే అన్నట్లు ఇంట్లో వేసుకునే నైట్‌ సూట్స్‌ ధరించి పని మొదలుపెట్టేయడం.. వంటివి చేస్తుంటారు. అయితే నీట్‌గా డ్రస్‌ వేసుకోకపోయినా పనిపై ఏకాగ్రత కోల్పోయే అవకాశం ఉందని అంటున్నారు ఆర్గనైజేషనల్‌ నిపుణులు. మనం ఎలాగైతే ఆఫీసుకెళ్లేటప్పుడు ప్రొఫెషనల్‌గా తయారవుతామో.. ఇంటి నుంచి పనిచేసినా అలాగే తయారవ్వాలంటున్నారు వారు. తద్వారా ఇంటి నుంచి పనిచేసినా నీరసించిపోకుండా.. మన పూర్తి దృష్టంతా పనిపైనే నిలిపి మంచి అవుట్‌పుట్‌ అందించచ్చంటున్నారు. మరి, ఇంతకీ ఇంటి నుంచి పనిచేసినా నీట్‌గా, ప్రొఫెషనల్‌గా ఎలా తయారుకావాలి? ఫలితంగా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

ఆన్‌లైన్‌ క్లాసులు... ఈ అయిదు పదార్ధాలూ మీ డైట్ లో ఉన్నాయా?

కరోనా మనకు శారీరకంగా, మానసికంగా ఎంతో కీడు చేస్తున్నా.. టెక్నాలజీ విషయంలో మాత్రం మనల్ని ఓ మెట్టు ఎక్కించిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే అప్పటిదాకా ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’ ఆప్షన్‌ లేని సంస్థలు సైతం తమ ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసే వెసులుబాటు కల్పించాయి. అలాగే రోజూ స్కూలుకెళ్లి పాఠాలు నేర్చుకునే పిల్లలు కూడా ఇప్పుడు ఇంటిపట్టునే ఉంటూ ఆన్‌లైన్‌లోనే క్లాసులు వింటున్నారు. అయితే ఎలాగూ ఇంటి నుంచే క్లాసులు వింటున్నాం కదా అని బద్ధకిస్తూ, చదువు విషయంలో అశ్రద్ధ వహిస్తే.. పాఠాలు బుర్రకెక్కవు సరికదా తోటి పిల్లల కంటే వెనకబడే అవకాశం ఉంటుంది. అందుకే పిల్లలు ఆన్‌లైన్‌ క్లాసులపై శ్రద్ధ వహించాలంటే వారికి అందించే ఆహారం పట్ల కూడా తల్లులు జాగ్రత్త వహించాలంటున్నారు ప్రముఖ సెలబ్రిటీ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్‌. ఈ క్రమంలోనే ఆన్‌లైన్‌ పాఠాలు వింటోన్న పిల్లలు, యువత ఐదు రకాల పదార్థాలను రోజూ తప్పకుండా తీసుకోవాలంటూ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టారామె. మరి, ఏంటా పదార్థాలు? వాటి వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేంటి? రండి తెలుసుకుందాం..!

Know More

women icon @teamvasundhara

ఇలా చేస్తే తెల్లజుట్టు నల్లబడుతుంది..!

కొంతమందిలో వయసు తక్కువే అయినా.. జుట్టు మాత్రం తెల్లగా మారిపోయి.. వారిని ముసలివాళ్లలా కనిపించేలా చేస్తుంది. సాధారణంగా ఇలాంటి సమస్య ముప్ఫై సంవత్సరాలు నిండిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇలాంటి వారిలో శరీరంలో ఉండే మెలనిన్ అనే వర్ణద్రవ్యం(హార్మోన్) తగ్గిపోవడమే కారణంగా చెప్పుకోవచ్చు. ఈ హార్మోన్ సాధారణంగా వయసు పైబడిన వారిలో కొద్దికొద్దిగా తగ్గుతూ వస్తుంది. కానీ కొంతమందిలో శరీరంలోని మార్పుల వల్ల ఇది ముందుగానే తగ్గే అవకాశం ఉంటుంది. చాలామంది నలుపురంగు డైలు వేసుకుంటూ ఈ సమస్యను కవర్ చేయడానికి ప్రయత్నిస్తారు కానీ.. ఇవి మన కేశాలపై ఉండే సహజమైన నూనెలను పీల్చేస్తాయి. ఫలితంగా జుట్టు జీవం లేకుండా తయారవుతుంది. మరెలా? అని ఆలోచిస్తున్నారా? కొన్ని సహజసిద్ధమైన పదార్థాలను ఉపయోగించి కూడా జుట్టును నల్లబర్చుకోవచ్చని మీకు తెలుసా? మరింకెందుకాలస్యం.. అవేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

కరోనా వేళ.. బెడ్‌షీట్లను శుభ్రం చేస్తున్నారా..?

కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి చేతులను శుభ్రంగా కడుక్కుంటున్నాం.. నోరు, ముక్కు కవరయ్యేలా మాస్కులు ధరిస్తున్నాం.. భౌతిక దూరం పాటిస్తున్నాం.. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ.. మరి ఇంట్లో బెడ్‌షీట్ల సంగతేంటి? కరోనాకు, బెడ్‌షీట్లకు సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా? అవును.. కచ్చితంగా సంబంధం ఉంది. ఎందుకంటే చాలా వరకు శ్వాస సంబంధిత వ్యాధులకు శుభ్రంగా లేని బెడ్‌షీట్లే కారణమని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోతే వాటిపై దుమ్ము-ధూళి పేరుకుపోవడంతో పాటు బ్యాక్టీరియా, వైరస్‌లకూ అవి ఆలవాలమవుతాయి. కాబట్టి బెడ్‌షీట్లను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనదే. మరి, ఇంతకీ బెడ్‌షీట్లను ఎన్ని రోజులకోసారి శుభ్రం చేయాలి? ఎలా శుభ్రం చేయాలి? ఒకవేళ మాసిన బెడ్‌షీట్లనే వాడడం వల్ల ఎలాంటి అనారోగ్యాలు తలెత్తుతాయి? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి.

Know More

women icon @teamvasundhara

యోగా చేద్దాం.. మన జీవితాల్లో సంతోషాన్ని నింపుకొందాం !

శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవాలన్నా, మనసును ప్రశాంతంగా మార్చుకోవాలన్నా మనం జపించే మంత్రం ‘యోగా’. అంతేనా.. ఎలాంటి అనారోగ్యాన్నైనా నయం చేసే శక్తి యోగా సొంతం. అందుకే యోగాను మన లైఫ్‌స్టైల్‌లో భాగం చేసుకోవడమే కాదు.. దాని గొప్పతనాన్ని ప్రపంచానికి చాటేందుకు ఏటా జూన్‌ 21న ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ జరుపుకోవడం గత కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. అయితే ఇలాంటి పవర్‌ఫుల్‌ యోగాతో ప్రస్తుతం మన చుట్టూ ఉన్న ప్రతికూలతలను తొలగించుకొని మన జీవితాల్లో పాజిటివిటీని నింపుకుందాం అని పిలుపునిస్తోంది బాలీవుడ్‌ ఫిట్టెస్ట్‌ బ్యూటీ శిల్పాశెట్టి. కరోనా నేపథ్యంలో ఈసారి ఎవరింట్లో వాళ్లే యోగా చేయాలని ప్రభుత్వం సూచించిన సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగానే ఈ ఏడాది ‘ఇంట్లోనే యోగా, కుటుంబంతో యోగా’ అనే థీమ్‌ని రూపొందించింది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ ఇంట్లోనే తమ కుటుంబంతో కలిసి యోగా సాధన చేయాలని, తమ జీవితంలో సంతోషాన్ని నింపుకోవాలని తాజా పోస్ట్‌ ద్వారా తన ఫ్యాన్స్‌ను కోరుతోందీ బాలీవుడ్‌ యోగిని.

Know More

women icon @teamvasundhara

సింపుల్‌గా ఇలా ఇంట్లోనే వర్కవుట్స్‌ చేసేద్దాం..!

వ్యాయామం అనగానే జిమ్‌, అందులో చేసే కఠినమైన వ్యాయామాలే మన కళ్ల ముందు కదలాడతాయి. కానీ వాటి అవసరం లేకుండా ఇంట్లోనే సులభమైన వర్కవుట్స్‌ చేస్తూ మన ఫిట్‌నెస్‌ లక్ష్యాన్ని చేరుకోవచ్చని ఇదివరకే చాలామంది ముద్దుగుమ్మలు నిరూపించారు. అంతేనా.. వారు చేసే ఆ వర్కవుట్‌ వీడియోలను, ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో పంచుకుంటూ తమ అభిమానులకు ఫిట్‌నెస్‌ పాఠాలు నేర్పుతుంటారు కూడా! అలాంటి ఫిట్టెస్ట్‌ బ్యూటీస్‌ జాబితాలో ఫిట్‌నెస్‌ గురూ, బాలీవుడ్‌ హీరో మిలింద్‌ సోమన్‌ భార్య అంకితా కొన్వర్‌ తప్పకుండా ఉంటుంది. తాను చేసిన వర్కవుట్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసే ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల మరో వీడియోను పోస్ట్‌ చేసింది. ఇందులో భాగంగా ఇంట్లోనే ఈజీగా చేసే కొన్ని వర్కవుట్లను తాను చేస్తూనే.. తన ఫ్యాన్స్‌కి నేర్పుతోందీ ఫిట్టెస్ట్‌ బేబ్‌. మరి, అంకిత చేసిన ఆ వర్కవుట్లేంటో తెలుసుకొని, ఈ లాక్‌డౌన్‌ సమయంలో ఇంట్లోనే ఫిట్‌గా మారిపోదాం రండి..

Know More

women icon @teamvasundhara

రెండు నిమిషాలు ఇలా చేస్తే ఫిట్‌నెస్‌ మీ సొంతం !

సాధారణంగా వర్కవుట్‌ చేయడానికి రోజూ కనీసం అరగంట సమయమైనా వెచ్చించాలి.. అప్పుడే చక్కటి ఫిట్‌నెస్‌ను మన సొంతం చేసుకోవచ్చనేది చాలామంది భావన. అయితే ఇటు ఇంటి పనులు, అటు ఆఫీస్‌ హడావిడితో మహిళలకు ఆ కాస్త సమయం కూడా దొరకదు. దాంతో వ్యాయామాలకు బ్రేక్‌ ఇచ్చేస్తుంటారు. కానీ మీ చేతిలో రెండంటే రెండే నిమిషాల సమయముంటే చాలు.. సింపుల్‌ వర్కవుట్స్‌తో చక్కటి ఫిట్‌నెస్‌ను మీ సొంతం చేసుకోవచ్చంటున్నారు ప్రముఖ సెలబ్రిటీ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్‌. ఆరోగ్యకరమైన ఆహార నియమాలతో పాటు, వర్కవుట్లకు సంబంధించి తరచూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతూ హెల్దీ లైఫ్‌స్టైల్‌ని అందరికీ చేరువ చేసే రుజుత.. రెండు నిమిషాల్లో చేయగలిగే వ్యాయామాల గురించి ఇటీవల ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ పెట్టారు. ఇంట్లో ఉన్నా ఆఫీస్‌లో ఉన్నా ఈ సింపుల్‌ వ్యాయామాల కోసం కేవలం రెండు నిమిషాలు కేటాయిస్తే ఫిట్‌గా మారిపోవచ్చంటున్నారీ ఫిట్టెస్ట్‌ లేడీ. మరి, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

కాఫీ పిప్పిని ఇలా కూడా వాడచ్చు..!

ఉదయాన్నే లేచి కాఫీ తాగుతూ బద్ధకాన్ని వదిలించుకొనే అలవాటున్న వారు చాలామందే ఉంటారు. పని ఒత్తిడి తగ్గించుకోవడానికి.. తలనొప్పి నుంచి ఉపశమనం పొందడానికి కూడా కాఫీని ఆశ్రయించేవారు బోలెడంతమందే..! కాఫీ తాగడం వరకు బాగానే ఉంది.. కానీ వాడేసిన కాఫీ పొడిని వృథాగా పడేస్తూ ఉంటారు చాలామంది. అయితే ఈసారి మాత్రం అలా చేయకండి.. ఎందుకంటే కాఫీ వడకట్టగా మిగిలిన పిప్పిని పెరటి మొక్కలకు ఎరువుగా, కీటకనాశనిగా ఉపయోగించుకోవచ్చు. ఇటీవలి కాలంలో టెర్రస్, బాల్కనీలతో పాటు ఇంట్లోనూ మొక్కలను పెంచుతున్నారు. ఇలాంటి మొక్కలకు రసాయనిక ఎరువులు ఉపయోగిస్తే వాటి ప్రభావం వల్ల ఆరోగ్యానికి హాని కలిగే అవకాశం ఉంటుంది. అందుకే వాటికి సహజసిద్ధమైన ఎరువులు ఉపయోగించడం మంచిది. దీనికోసం ఒకసారి వాడిన కాఫీ పొడి బాగా ఉపయోగపడుతుంది. అదెలాగో తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

ఇంట్లోనే కరోనా వైద్యం.. కేంద్రం ఏం చెబుతోంది..?

కరోనా లక్షణాలు కనిపించిన బాధితులు ఇళ్లలోనే చికిత్స తీసుకునేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేకుండా 17 రోజుల పాటు ఇంట్లోనే ఉంటూ వైద్యుల సూచనలు, జాగ్రత్తలతో వైరస్‌ నుంచి బయటపడవచ్చని తెలిపింది. లక్షణాలు తీవ్రమైతే వైద్యుని సలహా తీసుకోవాలని.. చిన్నపిల్లలు, వృద్ధులు, ఇతర జబ్బులతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండాలని సూచించింది. అలాగే పోషకాహారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించింది. కరోనా ఉన్నట్లు అనుమానించినా, నిర్ధారించినా ఆందోళన చెందవద్దని, వైద్యుల సూచనలు పాటించాలంది. అత్యవసరమైతే టోల్‌ఫ్రీ నంబరు 18005994455ను సంప్రదించాలని కోరింది.

Know More

women icon @teamvasundhara

వీటితో చేతుల్ని కోమలంగా మార్చుకోండి!

కరోనా మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బయటి నుంచి వచ్చిన ప్రతిసారీ లేదా ఇంట్లో ఉన్నా సరే... పదే పదే హ్యాండ్‌వాష్‌ లేదా సబ్బుతో చేతుల్ని రుద్ది మరీ కడుగుతున్నాం. అయితే ఇలా పదే పదే చేతుల్ని కడగడం వల్ల చేతులు తేమను కోల్పోయి పొడిబారిపోతున్నాయి.. నిర్జీవంగా మారిపోతున్నాయి. ఇక దీనికి తోడు మహిళలకు అదనంగా ఇంటి పని, వంట పని, గిన్నెలు తోమడం, బట్టలుతకడం.. వంటి రోజువారీ పనుల కారణంగా పదే పదే చేతులు నీళ్లలో నాని మరింత పొడిగా తయారవుతున్నాయి. ఫలితంగా దురద రావడం, మంట పుట్టడం, అలర్జీలు.. వంటి సమస్యలొచ్చే అవకాశమే ఎక్కువ. మరి, వీటి నుంచి బయటపడాలంటే ఇంట్లో లభించే కొన్ని పదార్థాలతోనే స్క్రబ్స్‌ తయారుచేసుకొని వాడితే ఫలితం ఉంటుందంటున్నారు సౌందర్య నిపుణులు. మరి, చేతుల్ని తేమగా, కోమలంగా మార్చే ఆ న్యాచురల్‌ స్క్రబ్స్‌ ఏంటో తెలుసుకొని, మనమూ ట్రై చేసేద్దామా..!

Know More

women icon @teamvasundhara

అమ్మను ఆప్యాయంగా హత్తుకునేందుకు ఈ మహిళ ఏం చేసిందంటే!

కరోనా... అటు శారీరకంగా, ఇటు మానసికంగా ప్రతి ఒక్కరినీ ఇబ్బంది పెడుతోన్న వైరస్‌. మనుషుల మధ్య సామాజిక దూరాన్ని తీసుకొచ్చిన ఈ మహమ్మారి కారణంగా కనీసం కుటుంబ సభ్యులతో కూడా దగ్గరగా ఉండలేని దీన పరిస్థితి. ఎప్పుడు, ఎక్కడ, ఎలా దాడి చేస్తుందో తెలియని ఈ వైరస్‌ భయంతో సన్నిహితులు, స్నేహితులు, శ్రేయోభిలాషులకు దూరంగా ఉంటున్నాం. ఈ విపత్కర పరిస్థితుల్లో దూరంగా ఉన్న తన తల్లిని కలుసుకునేందుకు ఓ వినూత్న ప్రయత్నం చేసింది అమెరికాకు చెందిన ఓ మహిళ. ఇందులో భాగంగా హిప్పోపొటామస్‌ (నీటి గుర్రం) కాస్ట్యూమ్‌ ధరించిన ఆమె సామాజిక దూరం నిబంధనలు పాటిస్తూ తన తల్లిని ఆప్యాయంగా హత్తుకుంది.

Know More

women icon @teamvasundhara

కంటి అందాన్ని పెంచే ఉత్పత్తులు ఇంట్లోనే ఇలా..

ముఖంలో ఇతరుల దృష్టిని తొలుత ఆకర్షించేవి కళ్లే. అందుకే వాటిని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకోవడానికి ప్రాధాన్యమిస్తారు అతివలు. దీనికోసం ఐలైనర్, మస్కారా వంటి ఉత్పత్తులను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే మార్కెట్లో లభించే వీటిలో రసాయనాల వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా దీర్ఘకాలంలో వాటి ప్రభావం కళ్లపైనా.. వాటి సౌందర్యంపైనా పడే అవకాశం ఉంటుంది. అందుకే సహజసిద్ధమైన పదార్థాలతో ఇంట్లోనే తయారుచేసుకొన్న వాటిని ఉపయోగించడం మంచిది. అయితే వీటిని తయారుచేసుకోవడానికి పెద్దగా సమయం పట్టదు. ఖర్చు కూడా తక్కువే. పైగా కంటి ఆరోగ్యం దెబ్బతినకుండా కూడా ఉంటుంది. మరి ఎలాంటి రసాయనాలు ఉపయోగించకుండా.. ప్రకృతి అందించిన ఉత్పత్తులతో ఇంట్లోనే మస్కారా, ఐలైనర్ సులభంగా ఎలా తయారుచేసుకోవచ్చో తెలుసుకొందామా..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala