హీనాను ఫాలో అయిపోదాం.. ఇంట్లోనే మాస్క్ తయారుచేద్దాం..!
కరోనా ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందే వ్యాధి కావడం వల్ల బయటకు వెళ్లిన ప్రతిసారీ ముఖానికి మాస్క్‌లు ధరించడం తప్పనిసరిగా మారింది. ఇలా అందరికీ మాస్క్‌లు అవసరం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం వాటికి కొరత ఏర్పడింది. దీని వల్ల డాక్టర్లకు, నర్సులకు, చికిత్స పొందుతున్న వారికి మాస్క్‌లు సరిపడక ఇబ్బంది పడుతున్నారు. దీనిని పరిష్కరించడానికి సామాన్యుల దగ్గర్నుంచి సెలబ్రిటీల వరకు అందరూ మాస్క్‌లను సొంతంగా ఇంటిలో తయారుచేసుకోమంటూ ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇంట్లోనే మాస్కుల్ని ఎలా తయారుచేసుకోవాలో తెలియజేసే వీడియోల్ని సైతం పోస్ట్ చేస్తున్నారు కొందరు సెలబ్రిటీలు. తాజాగా బుల్లితెర స్టార్ హీనా ఖాన్ కూడా అదే పనిచేసింది. ఇంట్లో తానే స్వయంగా మాస్క్‌ను తయారుచేసిన వీడియోను తన అభిమానులతో పంచుకుంది. మరి, హీనా మాస్క్ తయారీ గురించి ఏం చెబుతుందో తెలుసుకుందాం రండి..
Know More