సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

రుచికరమైన ఈ అటుకుల లడ్డూ మనమూ ట్రై చేద్దామా?!

శిల్పాశెట్టి... బాలీవుడ్‌కు సంబంధించి ఫిట్‌నెస్‌పై శ్రద్ధ వహించే నటీమణుల జాబితాలో ముందుంటుందీ ముద్దుగుమ్మ. నిత్యం వ్యాయామాలు, యోగాసనాలతో పాటు ఆరోగ్యకరమైన వంటకాల వీడియోలను సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో ఆరోగ్య స్పృహ పెంచడం శిల్పకు అలవాటు. ఈ క్రమంలో ఇప్పటికే రాగి దోసె, ఓట్స్‌ ఇడ్లీ, ఓట్స్‌ ఉప్మా, బేసన్‌ కొకోనట్‌ బర్ఫీ, బనానా బ్రెడ్‌.. వంటి ఎన్నో రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకాలను తన ఫ్యాన్స్‌కు పరిచయం చేసిందీ అందాల తార. ఇక ఇప్పుడు పోహా (అటుకులు)తో లడ్డూ తయారుచేసి మన ముందుకు తెచ్చింది. మరి, ఈ టేస్టీ లడ్డూను శిల్ప ఎలా తయారుచేసిందో ఆమె పోస్ట్‌ చేసిన వీడియోలో చూసి మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

బుజ్జి గణపయ్య బొజ్జను ఈ స్పెషల్ స్వీట్‌తో నింపేయండి!

బొజ్జ గణపయ్యను మనసారా కొలుచుకొని, రుచికరమైన వంటకాలతో ఆ దేవదేవుడిని సంతృప్తి పరిచే ‘వినాయక చవితి’ పండగ రానే వచ్చింది. అయితే ఈసారి పండగ అన్నింటికంటే భిన్నం. ఎందుకంటే కరోనా ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో మండపాల్లో పూజలకు బదులు అందరూ ఇంట్లోనే బుజ్జి గణపయ్యను ప్రతిష్టించుకొని పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే అందరూ ఆరోగ్యకరమైన పిండి వంటలు, స్వీట్స్‌ తయారుచేసి ఆ పార్వతీ నందనుడికి నైవేద్యంగా సమర్పించడానికి రడీ అయిపోయారు. అలాంటి వారికి ఓ హెల్దీ రెసిపీని పరిచయం చేసింది బాలీవుడ్‌ అందాల అమ్మ శిల్పా శెట్టి. విభిన్న ఆరోగ్యకరమైన వంటకాలతో మనల్ని అలరించే ఈ ముద్దుగుమ్మ.. పండగ సందర్భంగా ఓ సూపర్బ్ స్వీట్‌ రెసిపీ చేసి చూపించింది. ఈ వంటకం వీడియోను సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరికీ ముందుగానే పండగ శుభాకాంక్షలు తెలిపింది శిల్ప.

Know More

women icon @teamvasundhara

ఈ ‘తియ్యటి ఆవకాయ’ మీరూ ట్రై చేస్తారా?

వేసవి కాలం అనగానే మనకు గుర్తొచ్చే విషయాల్లో మామిడి కాయలు/పండ్లు కూడా ఒకటి. ఈ సీజన్‌లో వచ్చే పుల్లని మామిడి కాయలతో చేసే ఆవకాయ అంటే ఇష్టం లేని వారుంటారా చెప్పండి.. వేడివేడి అన్నం, మామిడికాయ పచ్చడి, మీగడ వేసుకొని తింటే.. ఆ రుచికి మరేదీ సాటిరాదని చెప్పడం అతిశయోక్తి కాదు. అందుకే ఓ సినిమాలో త్రివిక్రమ్‌ కూడా ‘అమ్మ, ఆవకాయ.. ఎప్పటికీ బోర్‌ కొట్టవు’ అంటాడు. మన పూర్వీకులు కనిపెట్టిన ఈ సంప్రదాయ రెసిపీ రుచికరమైందే కాదు.. ఎంతో ఆరోగ్యకరమైంది కూడా..! ఈ క్రమంలో కొణిదెల వారి కోడలు ఉపాసన ఇటీవలే తియ్యటి ఆవకాయ పచ్చడి తయారు చేసింది. ఈ విషయాన్ని తను ఇటీవలే సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ తను ఆవకాయ పెట్టడం జీవితంలో ఇదే మొదటిసారి అని చెప్పుకొచ్చింది. అంతేకాదు, ఆవకాయ వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి కూడా వివరంగా తన బ్లాగ్‌లో వివరించింది మిస్సెస్‌ సి. మరి ఆ విశేషాలేంటో మనమూ తెలుసుకుందామా..!

Know More

women icon @teamvasundhara

¯äÊÕ Íä®ÏÊ XÏèÇ Æ¢˜ä ÅŒÊ-ˆ¾d¢!

ÅŒÊ Æ¢Ÿ¿¢, ÆGµ-Ê-§ŒÕ¢Åî ‡¢Åî-«Õ¢C ÆGµ-«Ö-ÊÕ-©Â¹× Ÿ¿’¹_-éªj¢C ƒL-§ŒÖ¯Ã. '¤òÂËJÑ, 'Ÿä«-ŸÄ®¾ÕÑ.. «¢šË *“ÅÃ-©Åî Åç©Õ’¹Õ Å窽åXj „çÕJ-®ÏÊ ¨ ®Ïx„þÕ ¦ÖušÌ.. ¨ \œÄC '«á¦Ç-ª½-¹¯þÑ, '¦ÇŸþ-³Ä£¾ÇôÑ *“ÅÃ-©Åî ‚Â¹-{Õd-¹עC. ƒ©Ç ê«©¢ Ê{-ÊÅî ‚Â¹-{Õd-Âî-«-œ¿„äÕ Âß¿Õ.. Ōʩð «Õ¢* ÍçX¶ý Â¹ØœÄ ŸÄ’¹Õ¢Ÿ¿E Íç¦ÕÅî¢C ƒ©Öx ¦äH. ÅÃÊÕ ÅŒ§ŒÖ-ª½Õ-Íä-®ÏÊ ÂíEo «¢{-ÂÃLo ÆX¾Ûp-œ¿-X¾Ûpœ¿Ö ÆGµ-«Ö-ÊÕ-©Åî ƒ¯þ-²Äd-“’ÄþÕ ŸÄyªÃ X¾¢ÍŒÕ¹ע{Ö …¢{Õ¢C ¹؜Ä..! '¯ÃÂ¹× «¢{ Í䧌՜¿«Õ¢˜ä ÍÃ©Ç ƒ†¾d¢. ¯äÊÕ Íä®ÏÊ «¢{-ÂÃLo Æ¢Ÿ¿-JÂÌ ª½Õ* ÍŒÖXϲÄh ¹؜Ä..! ¯ä¯î åXŸ¿l ¦µð•-Ê-“XÏ-§Œá-ªÃ-LE. ƒ¢ÅŒÂÌ «¢{ X¾{x ¯ÃÂ¹× ƒ¢ÅŒ ‚®¾ÂËh ‡©Ç åXJ-T¢-Ÿ¿-¯ä’à OÕ ®¾¢Ÿä£¾Ç¢..? ÆC Æ«ÕtÊÕ ÍŒÖæ®..! «¢{ ’¹ÕJ¢* ÍÃ©Ç N†¾-§ŒÖ©Õ Æ«Õt ¯ÃÂ¹× Íç¦Õ-Ōբ-{Õ¢C. ŸÄ¢Åî ¤Ä{Õ Â¹×ÂË¢’û ³ò®ý ÍŒÖ®Ï ÂíÅŒh ÂíÅŒh 骮Ï-XÔ©Õ, «¢{Â¹× ®¾¢¦¢-Cµ¢-*Ê *šÇˆ©Õ ¯äª½Õa-¹עšÇ. ƒÂ¹ ¯äÊÕ ÅŒ§ŒÖ-ª½Õ-Íä-®ÏÊ XÏèÇb Æ¢˜ä ‚¢“œ¿Ö (ƒL-§ŒÖ¯Ã ¦Ç§ýÕ-“åX¶¢-œþ)ÂË ÍÃ©Ç ƒ†¾d¢. “é„þÕ“¦ÖM Æ¢˜ä Â¹ØœÄ ÅŒÊ-ˆ¾d¢. Æ¢Ÿ¿Õê D¢Åî ÅŒÊÂË “ÂË®¾t®ý “šÌšü ƒÍÃa. ‚¢“œ¿Ö Â¹ØœÄ ¦Ç’à «¢{ Íä²Ähœ¿Õ. ƪáÅä ÅŒÊŸî œËX¶¾-骢šü ¹×ÂË¢’û å®kd©ü..Ñ Æ¢{Ö «¢{ X¾{x ÅŒÊ-¹×Êo ÆGµ-ª½Õ-*E ¦§ŒÕ-{-åX-šËd¢D «áŸ¿Õl-’¹Õ«Õt. Æ¢Åä-Âß¿Õ.. ƒ¢šðx¯ä «¢œ¿Õ-Âî-«œ¿¢ «©x ‚ªî-’¹u¢Åî ¤Ä{Õ X¶Ïšü-’ÃÊÖ …¢œ¿-ÍŒaE ÅŒÊ ÆGµ-«Ö-ÊÕ-©Â¹× *šÇˆ-L-²òh¢C. '«¢{ Í䧌Õ-œÄ-EÂË ®¾¢¦¢-Cµ¢-*Ê X¾©Õ N†¾-§ŒÖ©Õ Åç©Õ-®¾Õ-Âî-«œ¿¢ «©x «ÕÊÂ¹× «ÕÊ„äÕ ®¾y§ŒÕ¢’à ƒ¢šðx¯ä ‚ªî-’¹u-¹-ª½-„çÕiÊ ‚£¾Éª½¢ ÅŒ§ŒÖ-ª½Õ-Íä-®¾Õ-Âî-«ÍŒÕa. åXj’à „Ú˩ð „Ãœä X¾ŸÄ-ªÃn©Õ «ÕÊÂ¹× Åç©Õ-²Ähªá ÂæšËd ‚ªî-’¹u-¹-ª½¢’à ‚£¾É-ªÃEo «¢œ¿Õ-Âî-«ÍŒÕa. ƒ©Ç ƒ¢šðx ÅŒ§ŒÖ-ª½Õ-Íä-®ÏÊ éª®Ï-XÔ©ðx ¯ÃÂ¹× ƒ†¾d-„çÕi¢C §ŒÖXÏ©ü *Xýq..Ñ Æ¢D Æ«Õtœ¿Õ. “X¾®¾ÕhÅŒ¢ ƒ©Öx ¦äH '骪áœþÑ *“ÅŒ¢©ð ÊšË-²òh¢C.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala