మా బుల్లి అంబానీ పేరు ఏంటంటే...!
బుల్లి అంబానీ రాకతో ఆనందోత్సాహాలలో మునిగితేలుతోంది అంబానీ కుటుంబం. ఆ చిన్నారిని చూస్తూ తాతయ్య, నానమ్మలయ్యామని ముఖేశ్ అంబానీ -నీతా అంబానీ దంపతులు, అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందామని ఆకాశ్-శ్లోకా తెగ సంబరపడిపోతున్నారు. అయితే అంబానీ వారసుడికి ఏం పేరు పెడతారా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ ఎదురుచూపులకు తెరపడింది. ఈ క్రమంలో ఈ బుల్లి అంబానీకి ‘పృథ్వీ ఆకాశ్ అంబానీ’ అని నామకరణం చేశారు. ఈ మేరకు అంబానీ-మెహతా కుటుంబాలు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.
Know More