కుటుంబ క్షేమాన్ని కాంక్షించే 'కర్వా చౌత్'!
పండగలంటే మన సంస్కృతీ సంప్రదాయాల్ని ప్రతిబింబించడంతో పాటు బోలెడన్ని సరదాల్నీ మనకందిస్తాయి. అయితే వీటిలో అందరూ కలిసి జరుపుకొనే పండగలు కొన్నైతే.. కేవలం మహిళలు మాత్రమే మమేకమై జరుపుకొనేవి మరికొన్ని. అందులో 'కర్వా చౌత్' కూడా ఒకటి. శ్రావణం, కార్తీకం.. వంటి పలు మాసాల్లో ఆడవారు ప్రత్యేకంగా పూజలు, వ్రతాలు నిర్వహించి ఉపవాస దీక్ష చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇదేవిధంగా కర్వా చౌత్ రోజున కూడా ఆడవారు పార్వతీ దేవికి భక్తిశ్రద్ధలతో పూజించి, నిష్టతో ఉపవాసం ఉంటారు. ఆశ్వయుజ పౌర్ణమి తర్వాత నాలుగో రోజు లేదా దీపావళికి పదకొండు రోజులు ముందుగా వచ్చే ఈ పండగను ఉత్తర భారతదేశం వారు ఎక్కువగా జరుపుకొంటారు. మరి, మహిళలంతా ఎంతో ఉత్సాహంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించే ఈ పండగ వైశిష్ట్యం, నేపథ్యం తదితర అంశాల గురించి మనమూ తెలుసుకుందాం రండి..
Know More