అందుకే రోజూ నెయ్యి తీసుకోవాల్సిందే !
వేడివేడి అన్నం, పప్పు లేదా ఆవకాయ.. దాంట్లో కాస్త నెయ్యి.. చెబుతుంటేనే నోరూరిపోతోంది కదూ! మరి తింటేనో.. రుచి అదిరిపోవాల్సిందే! బహుశా దీని రుచి తెలియని తెలుగు వారు దాదాపు ఎవరూ ఉండరేమో! మరి దీనికి అంతటి రుచి దేనివల్ల వచ్చిందంటారు..? సందేహమేముంది? అక్షరాలా నెయ్యి వల్లే అంటారా..? అవును మీరన్నది నిజమే. అందుకే భారతీయ సంప్రదాయ వంటకాల్లో, పండగలకు, ప్రత్యేక సందర్భాలకు తయారుచేసే పిండివంటల్లో, వివిధ రకాల స్వీట్ల తయారీలో నెయ్యిని తప్పనిసరిగా వాడతారు. అయితే దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో అనవసర కొవ్వులు పెరిగి లావవుతామేమోనని కొందరు, గుండెకు మంచిది కాదని మరికొందరు, ఇతర ఆరోగ్య సమస్యలు వేధిస్తాయని ఇంకొందరు.. ఇలా నెయ్యిని ఆహారంలో భాగంగా తీసుకోవడానికి చాలామంది వెనకాడుతూ ఉంటారు. కానీ ఎన్నో విటమిన్లు, మరెన్నో ఖనిజాలతో మిళితమైన నెయ్యి వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలున్నాయంటున్నారు వైద్యనిపుణులు. అవేంటో తెలుసుకుంటే మనం కూడా నెయ్యిని నిస్సంకోచంగా రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవచ్చు.
Know More