ఈ టాప్ 10 దేశాలు మహిళల కోసం ఏం చేస్తున్నాయో తెలుసా?
సమానత్వం అంటే స్వేచ్ఛ. అందరికీ అన్ని విషయాల్లో అనుకున్నది సానుకూలంగా చేయగలిగిన స్వేచ్ఛ. అయితే చాలామంది లింగ భేదం లేని సమాజం అంటే స్త్రీల హక్కుగా భావిస్తుంటారు. అనాదిగా పురుషాధిక్యం నీడలో స్త్రీల హక్కులు అణచివేయడం వల్ల స్త్రీలు పురుషులతో సమానంగా నడవాలనేది సమసమాజ ఉద్దేశంగా మారిపోయింది. అందుకే ఇప్పుడు ఈ సమసమాజ పోరాటం ‘హ్యూమన్ ఫైట్‌గా కాకుండా... ఫీమేల్ ఫైట్’ అయిపోయింది. వాస్తవానికి ఇది అందరి బాధ్యత. అందరూ కలిసి ఉద్యమిస్తేనే సమసమాజ స్థాపన సాధ్యపడుతుంది. లేదంటే ఇంకా వందేళ్లైనా ఈ లింగభేదం లేని సమాజం కష్టం. ఇలా అంటోంది ఎవరో కాదు ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్) చేసిన సర్వేనే ! ప్రపంచవ్యాప్తంగా 99.5 సంవత్సరాలైతే కానీ లింగ సమానత్వం రాదట. అంతేకాదు, మన భారతదేశం లింగ సమానత్వంలో ఏడాదికేడాది దిగజారుతోందట. మన తరం, మన పిల్లల తరం, ఆ తర్వాతి తరానికి కూడా లింగ భేదం లేని సమాజం సాధ్యం కాకపోవచ్చు అంటోంది ! మరి అందుకు కారణం ఏంటో చూద్దాం పదండి !
Know More