'స్వరూపక్క' సైకిల్ యాత్ర ఎందుకో తెలుసా?
మంచులక్ష్మి... తెలుగు సినిమా ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసురాలిగా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆమె ఆ తర్వాత తన ప్రతిభతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. వెండితెరతో పాటు బుల్లితెర పైనా మెరుస్తూ నటిగా, నిర్మాతగా, గాయనిగా, యాంకర్‌గా బహుముఖ ప్రజ్ఞ కనబరుస్తోంది. ఇక సినిమాల సంగతి పక్కన పెడితే... మంచు లక్ష్మికి సామాజిక దృక్పథం కాస్త ఎక్కువే. అందుకే సందర్భమొచ్చినప్పుడల్లా మహిళల సమస్యలు, సామాజిక అంశాలపై సోషల్ మీడియా వేదికగా తనదైన శైలిలో స్పందిస్తుంటుంది. తాజాగా ఆమె మరో మంచి పనికి శ్రీకారం చుట్టింది.
Know More