మీ ప్రేమ విషయం తెలుసు.. నా భర్తకు ఫోన్ చేయద్దు అంటోంది!
నమస్తే మేడమ్.. నాకు సరిత, తనీష్ అనే ఇద్దరు స్నేహితులున్నారు. మేం ముగ్గురం అన్ని విషయాలు పంచుకునేవాళ్లం. నేను, తనీష్ ప్రేమించుకున్నాం. కానీ, కొన్ని కారణాల వల్ల పెళ్లి చేసుకోలేదు. ఆ తర్వాత నాకు వేరే అబ్బాయితో పెళ్లి జరిగింది. తనీష్‌కి కూడా కొన్ని రోజులకు పెళ్లైంది. మా పెళ్లిళ్ల తర్వాత కూడా మేము మంచి స్నేహితుల్లాగానే ఉన్నాం. మొదట్లో మా ఇరు కుటుంబాల వాళ్లం తరచూ కలుసుకునేవాళ్లం. ఒకరి ఇంటికి ఒకళ్లు వెళ్లేవాళ్లం.. ఫోన్లో మాట్లాడుకునేవాళ్లం. కొన్ని రోజులు గడిచాక తనీష్ భార్యకు మేము గతంలో ప్రేమించుకున్న విషయం తెలిసింది. అప్పటి నుంచి తనీష్‌ని నాతో మాట్లాడొద్దని చెప్పింది. తనీష్ ఏం చెప్పినా తను వినడం లేదు. ఒకరోజు తనే ఫోన్ చేసి ‘మీ ప్రేమ విషయం నాకు తెలుసు.. నువ్వు, సరిత ఇంకెప్పుడూ నా భర్తకు ఫోన్ చేయకండి’ అని తిట్టి పెట్టేసింది. ‘అది గతంలో జరిగిన విషయం. నాకు పెళ్లి కూడా అయింది. ఇంకా సమస్యేంటి?’ అని చెప్పినా ఆమె వినలేదు.
Know More