పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే ఈ పోషకాలు తప్పనిసరి!
కాబోయే అమ్మలు ‘నాకు పుట్టబోయే బిడ్డ ముద్దుగా, ఆరోగ్యంగా, చురుగ్గా ఉండాలి’ అనుకుంటుంటారు. ఇందుకోసమే నవమాసాలు చక్కటి ఆహారనియమాలు పాటిస్తుంటారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకుంటూ పోషకాహారం తీసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. అయితే గర్భం ధరించినప్పటికీ వృత్తి, ఉద్యోగాలు, ఇంటి పనుల బిజీలో పడిపోయి చాలామంది మహిళలు ఆహారం విషయంలో అశ్రద్ధ చూపుతున్నారు. ‘ఈ పూటకి ఏదో ఒకటి తిన్నామా.. కడుపు నిండిందా..’ అన్న ధోరణితో వ్యవహరిస్తుంటారు. అయితే ఈ నిర్లక్ష్యమే క్రమంగా పోషకాహార లోపానికి దారి తీస్తుందని, దీని ప్రభావం ప్రత్యుత్పత్తి వ్యవస్థపై పడుతుందని, అంతిమంగా ఇది పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి నష్టం కలిగిస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకే ఈ పోషకాహార లోపాన్ని అధిగమించడానికి చక్కటి ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు.
Know More