కరోనాకు భయపడకుండా అంబులెన్స్ స్టీరింగ్ పట్టింది!
‘పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో వృద్ధి సాధించడం అంత సులభం కాదు’...ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు ఏ రంగంలోనైనా స్త్రీలు పురుషులతో సమానంగా పని చేసేందుకు పోటీ పడుతున్నారు. ఎంత కష్టమైనా సరే.. సవాలుగా తీసుకుని మరీ ఆ రంగంలోకి అడుగు పెడుతున్నారు. వైద్యం, విద్య, రాజకీయాలు, జర్నలిజం, ఇంజినీరింగ్, ఆర్మీ, వ్యాపారం, నేవీ, పరిశోధన... వంటి రంగాలతో పాటు ఫుడ్ డెలివరింగ్, క్యాబ్ డ్రైవింగ్, లోకోపైలట్... లాంటి శారీరక శ్రమతో కూడిన రంగాల్లో సైతం సమర్థంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారీ తరం మహిళలు. తాజాగా స్ర్తీ శక్తిని మరోసారి చాటుతూ ‘108’ అంబులెన్స్ స్టీరింగ్ పట్టుకుంది ఓ మహిళ. తద్వారా దేశంలో తొలిసారిగా అంబులెన్స్ డ్రైవర్‌గా నియమితురాలైన తొలి మహిళగా అరుదైన గుర్తింపు సొంతం చేసుకుంది.
Know More