‘బుజ్జీమా’కు నిశ్చితార్థమైంది!
అందం, అంతకుమించిన ఆత్మవిశ్వాసం కలగలిసిన చెన్నై బ్యూటీ విద్యుల్లేఖా రామన్. తమిళ సినిమాతోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా తన చలాకీ నటనతో, మాస్ మాటతీరుతో తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర వేసిందీ బబ్లీ గర్ల్. ‘రాజు గారి గది’, ‘సరైనోడు’, ‘ధృవ’, ‘దువ్వాడ జగన్నాథం’, ‘రాజా ది గ్రేట్’, ‘వెంకీ మామ’.. వంటి ఎన్నో తెలుగు సినిమాల్లో తన డైలాగ్స్‌తో సినీ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించిందీ లేడీ కమెడియన్. తమిళమ్మాయే అయినా.. తెలుగులో గలగలా మాట్లాడుతూ ఈ చక్కనమ్మ చెప్పే డైలాగ్స్‌కి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతారనడంలో సందేహం లేదు. అలా రీల్ లైఫ్‌లో తన అందం, అభినయంతో సినీ ప్రేమికుల్ని కట్టిపడేసిన ఈ క్యూట్ బ్యూటీ.. రియల్ లైఫ్‌లోనూ ఓ హ్యాండ్సమ్ను తన మాయలో పడేసుకుంది. అయినా ఇన్ని రోజులు తన ప్రేమ విషయాన్ని రహస్యంగా దాచిన విద్యుల్లేఖ.. తాజాగా తనకు నిశ్చితార్థం అయిందంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
Know More