దేవుడి ఆశీర్వాదమే నా దీర్ఘాయుష్షుకు కారణమనుకుంటా!
‘మీ కుటుంబ సభ్యుల్లో వయసులో అందరికంటే పెద్దవాళ్లు ఎవరు?’ అని అడిగితే.. సాధారణంగా అమ్మమ్మ, నాన్నమ్మ, తాత అంటూ సమాధానమిస్తారు. చిన్నపిల్లలైతే తాతమ్మలు, ముత్తాతలు అని చెబుతారు. అదేవిధంగా చాలామందికి అప్పుడప్పుడు ‘ప్రపంచంలోనే వయసులో అందరికంటే పెద్దవారు ఎవరు?’ అన్న సందేహం వస్తుంటుంది. అందుకు సమాధానమే జపాన్‌కు చెందిన బామ్మ ‘కానె తనక’. 117 ఏళ్ల వయసుతో ప్రపంచంలోనే బతికున్న వారిలో అత్యధిక వయస్కురాలిగా తన రికార్డును తానే బద్దలు కొట్టారీ గ్రాండ్ ఓల్డ్ వుమన్. తాజాగా 117వ ఏటలోకి అడుగుపెట్టిన ఈ బామ్మ..తన పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. మరి అత్యధిక వయసుతో ప్రపంచంలో అందరికీ అమ్మమ్మగా మారిన ‘కానె’ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి.
Know More