సమంత బ్యూటీ సీక్రెట్ ఇదేనట!
వెండితెరపై అందాల తారల్ని చూసినప్పుడల్లా ‘అబ్బ.. వీళ్లెంత అందంగా ఉన్నారో.. ఇదంతా మేకప్ మాయాజాలమేమో..’ అని మనలో చాలామంది అనుకోవడం సహజమే. అయితే మేకప్ వేసుకున్నప్పుడే కాదు.. మామూలుగానూ అపురూప సౌందర్య రాశుల్లా మెరిసిపోతుంటారు కొంతమంది ముద్దుగుమ్మలు. మరి, దీనికంతటికీ కారణమేంటో తెలుసా..? వారు రోజూ పాటించే సహజసిద్ధమైన సౌందర్య పద్ధతులే. ఇలా తాము పాటించే న్యాచురల్ బ్యూటీ టిప్స్‌ని సోషల్ మీడియా వేదికగా తమ ఫ్యాన్స్‌తో పంచుకుంటుంటారు కొందరు తారలు. అలాంటి వారిలో నేనూ ఉన్నానంటూ మన ముందుకొచ్చేసింది అందాల సమంత. తన వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలే కాదు.. తాను చేసే వ్యాయామాలు, పాటించే ఆహార నియమాలు.. వంటివన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది సామ్. ఇక ఇప్పుడు తాను పాటించే ఓ న్యాచురల్ బ్యూటీ టిప్‌ని పంచుకుంటూ బ్యూటీ పాఠాలు నేర్పుతోందీ తెలుగందం.
Know More