ఈ టిప్స్‌తో వారానికి అరకిలో చొప్పున తగ్గుతున్నా!
మనసు పెట్టి ఉత్సాహంగా ముందుకు సాగాలే గానీ ఏ పనైనా సులభంగా పూర్తి చేయగలం. ఫిట్నెస్ సాధించడం కూడా అంతే! ఈ విషయం చెబుతోంది మరెవరో కాదు.. బాలీవుడ్ అందాల తార సమీరా రెడ్డి. కెరీర్ ఆరంభంలో నటిగా తనను తాను నిరూపించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం అమ్మతనానికి, కుటుంబ బాధ్యతలకే అధిక ప్రాధాన్యమిస్తోంది. అలాగని అందరి నుంచి దూరం కాకుండా.. సోషల్ మీడియా ద్వారా మనందరికీ చేరువలోనే ఉంటోందీ అందాల అమ్మ. ఈ క్రమంలో ఇద్దరు పిల్లల తల్లిగా తాను ఆస్వాదిస్తోన్న అమ్మతనంలోని అనుభూతులు, పేరెంటింగ్ పాఠాలు, ఫిట్నెస్ మెలకువలు, బాడీ పాజిటివిటీ.. తదితర అంశాల్లో తన మనసులోని మాటల్ని నిర్మొహమాటంగా పంచుకుంటుంటుందీ బ్యూటిఫుల్ మామ్. బరువు తగ్గడమనేది చిటికెలో పూర్తయ్యే పని కాదని, అందుకు చాలా రోజులు పడుతుందని చెబుతూనే.. ఫిట్నెస్ కోసం తాను పాటిస్తోన్న కొన్ని నియమాలను ఇన్‌స్టా పోస్ట్ రూపంలో మన ముందుంచిందీ చక్కనమ్మ.
Know More