సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ ఆమె ఆలోచనలే.. నాలో తప్పులు వెతుకుతాడు.. ఏం చేయాలి?

హాయ్‌ మేడమ్‌.. మాకు పెళ్లై ఐదు సంవత్సరాలవుతోంది. నా భర్త పెళ్లికి ముందు ఒకరిని ప్రేమించారు. కులాలు వేరు కావడంతో పెద్దవాళ్లు పెళ్లికి ఒప్పుకోలేదు. ఎప్పుడూ ఆ అమ్మాయి గురించే ఆలోచిస్తుంటారు.. ఒక్కోసారి ఏడుస్తారు కూడా. ఇదిలా ఉంటే దీనికి తోడు తనకు పరిచయమున్న ఇతర అమ్మాయిలను రెస్టారంట్లకు తీసుకువెళ్తుంటారు. నన్ను మాత్రం కనీసం పుట్టినరోజు, పెళ్లి రోజు వంటి సందర్భాల్లో కూడా బయటకు తీసుకెళ్లరు. దూరం ఎక్కువని ఆఫీస్ దగ్గరే రూమ్‌ తీసుకుని ఉంటున్నారు. మమ్మల్ని కూడా తీసుకెళ్లమంటే ‘మా అమ్మ ఇక్కడ వాతావరణానికి అలవాటు పడింది.. మీరు ఇక్కడే ఉండండి’ అంటున్నారు. ఇంట్లో ఖర్చులకు ఎలాంటి లోటూ చేయడు. కానీ, ఇంటికి వచ్చినప్పుడు నాతో సంతోషంగా ఉండడు. ఎప్పుడూ ఏదో ఒక తప్పు చూపిస్తాడు. ఒకవేళ ఎలాంటి తప్పు చేయకపోయినా కావాలని గొడవ పడతాడు. అమ్మాయిలతో గంటల కొద్దీ మాట్లాడతాడు. ఉదయం అయిదింటికి లేచి పనంతా చేయాలని తిడతారు. ఒకవేళ చేయకపోతే నీళ్లు మీద పోస్తారు. మా పుట్టింటికి వెళ్లి నాలుగు రోజులు ఉండాలనిపిస్తుంటుంది. కానీ పంపడు. ఒకవేళ పంపినా ఉదయం వెళ్లి సాయంత్రానికి వచ్చేయమంటారు. తను మాత్రం స్నేహితులతో ట్రిప్‌లకి వెళ్తారు. నాకు ఒక బాబు ఉన్నాడు. అందుకే ఏం చేయలన్నా ఆలోచిస్తున్నా.. దయచేసి సలహా ఇవ్వగరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

ఈ ప్యాక్స్‌తో చలికాలంలోనూ కురులు ఆరోగ్యంగా..

వెంట్రుకలు బలంగా, ఒత్తుగా పెరగాలంటే అందుకు ప్రొటీన్ ఎంతో అవసరం అన్న విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. మరి, అది పుష్కలంగా లభించే కోడిగుడ్డును ఆహారంలో భాగం చేసుకోవడంతోపాటు దాంతో కొన్ని హెయిర్‌ప్యాక్స్ తయారుచేసుకొని ఉపయోగిస్తే జుట్టు మరింత ఆరోగ్యంగా, దృఢంగా మారుతుంది. ముఖ్యంగా ఈ చలికాలంలో జుట్టు విషయంలో ఎదురయ్యే చుండ్రు, నిర్జీవంగా మారడం.. వంటి సమస్యలకూ గుడ్లు చక్కటి పరిష్కారాన్ని చూపుతాయి. ఇంతకీ కోడిగుడ్డుతో ఇంట్లోనే లభించే పదార్థాలను కలిపి తయారుచేసుకునే ఈ హెయిర్‌ప్యాక్స్ ఏంటి? అవి జుట్టు ఆరోగ్యానికి ఏవిధంగా దోహదం చేస్తాయి.. వంటి విషయాలన్నీ మీకోసం..

Know More

women icon @teamvasundhara

ముఖం పైన అలా కనిపించకూడదంటే ఏం చేయాలి?

వయసుతో సంబంధం లేకుండా ఈ రోజుల్లో అతివల్ని ఎన్నో సౌందర్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. అలాంటి వాటిలో చర్మ రంధ్రాలు పెద్దవిగా కనిపించడం కూడా ఒకటి. మనం ఉపయోగించే మేకప్‌లో ఉండే రసాయన పదార్థాలు, జిడ్డుదనం, సూర్యరశ్మి ప్రభావం, మొటిమలు.. వంటివి ఈ సమస్యకు ప్రధాన కారణాలు. అయితే ఇలా చర్మ రంధ్రాలు పెద్దవవడం వల్ల ముఖ చర్మం పైన చిన్న చిన్న గుంతల్లాగా కనిపించడం, వయసు పైబడిన ఛాయలు కొట్టొచ్చినట్లు కనిపించడం జరుగుతుంది. ఇలాంటి సమస్యలన్నీ కొందరికి కంటి మీద కునుకు లేకుండా చేస్తాయి. అయితే వీటి పరిమాణాన్ని తగ్గించడం అసాధ్యమని, కాకపోతే వీటిని కనిపించకుండా చేసి నవయవ్వనంగా మెరిసిపోయేందుకు పలు సహజసిద్ధమైన సౌందర్య చిట్కాలు అందుబాటులో ఉన్నాయంటున్నారు సౌందర్య నిపుణులు. మరి, అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

ఈ లాక్‌డౌన్‌లో వయసును ‘లాక్‌’ చేయండిలా!

ఆఫీసుకు వెళ్లేటప్పుడు మన కోసం మనం కాస్త సమయం కేటాయించుకుందామన్నా సమయం దొరికేది కాదు. ఇంటి పని, వంట పనికి తోడు భర్తను ఆఫీస్‌కి పంపడం, పిల్లల్ని రడీ చేసి స్కూల్‌కి పంపడం.. ఇలా వీటితోనే సరిపోయేది. ఇక సాయంత్రం ఇంటికొచ్చాక మళ్లీ ఇంటి పని షరా మామూలే. అంతటి బిజీ లైఫ్‌స్టైల్లో అందాన్ని సంరక్షించుకోవడానికి ఓ అరగంటైనా సమయం ఉండేది కాదు. కానీ లాక్‌డౌన్‌ మొదలైనప్పట్నుంచి ఇంట్లో పని పెరిగినా, ఇంటి నుంచి పనిచేసినా కొంతమందికి కాస్తో కూస్తో ఖాళీ సమయం దొరికే అవకాశం ఉండచ్చు. అలాంటి అవకాశం ఉన్నవారు ఇలా దొరక్క దొరక్క దొరికిన ఆ సమయంలో మనం చేయాలనుకున్న పనులు చేసుకోవచ్చు. అందులో అందాన్ని సంరక్షించుకోవడం కూడా ఒకటి. చాలామంది చిన్న వయసులోనే ముఖంపై ముడతలు, గీతలు ఏర్పడుతున్నాయని దిగులు పడుతుంటారు. అలాంటి వారు ఈ వంటింటి ఔషధాలను ఉపయోగించుకొని నవ యవ్వనంగా మెరిసిపోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

Know More

women icon @teamvasundhara

¨ ®¾«Õ-®¾uÂ¹× ƒ¢šðx¯ä ‡¯îo X¾J-³Äˆ-ªÃ©Õ..!

Æ¢Ÿ¿¢ N†¾-§ŒÕ¢©ð ‡Eo èÇ“’¹-ÅŒh©Õ B®¾Õ-¹ׯÃo ÆX¾Ûp-œ¿-X¾Ûpœ¿Ö ÂíEo ÍŒª½t ®¾«Õ-®¾u©Õ X¾©-¹-J-®¾Öh¯ä …¢šÇªá. ®Ô•-¯þÊÕ ¦šËd „ÃÅÃ-«-ª½-º¢©ð «Íäa «Öª½Õp©Õ, ²ù¢Ÿ¿-ª½u-X¾-ª½¢’à «ÕÊ¢ Íäæ® ÂíEo ÂíEo ¤ñª½-¤Ä{Õx ƒ¢Ÿ¿ÕÂ¹× “X¾ŸµÄÊ Âê½-ºÇ-©Õ’à ÍçX¾Ûp-Âî-«ÍŒÕa. \Ÿä-„çÕi¯Ã ƒ©Ç¢šË ÍŒª½t ®¾«Õ-®¾u©ðx ÍŒª½t ª½¢“ŸµÄ©Õ «â®¾Õ-¹×-¤ò-«œ¿¢ Â¹ØœÄ ŠÂ¹šË. „ÃÅÃ-«-ª½-º¢-©ðE Ÿ¿Õ«át, Ÿµ¿ÖR «¢šËN ÍŒª½t ª½¢“ŸµÄ-©ðxÂË Í䪽œ¿¢, ÍŒª½t¢ ÊÕ¢* NX¾-K-ÅŒ-„çÕiÊ ÊÖ¯ç©Õ Nœ¿ÕŸ¿©ãj ÆN ª½¢“ŸµÄ-©ðx¯ä æXª½Õ-¹×-¤ò-«œ¿¢ «©x ÍŒª½t ª½¢“ŸµÄ©Õ «â®¾Õ-¹פòÅêá. ÅŒŸÄyªÃ «áÈ¢åXj „çášË-«Õ©Õ, Ê©x-«Õ-ÍŒa©Õ \ª½pœË Æ¢Ÿ¿¢ Ÿç¦s-A¢-{Õ¢C. «ÕJ, ƒ©Ç •ª½-’¹-¹עœÄ …¢œÄ-©¢˜ä NNŸµ¿ Âê½-ºÇ© «©x «â®¾Õ-¹×-¤ò-ªáÊ ÍŒª½t ª½¢“ŸµÄ-©ÊÕ Å窽Õ-ÍŒÕ-¹×-¯ä©Ç Íä®Ï „Ú˩ð æXª½Õ-¹×Êo «áJ-ÂËE Åí©-T¢-ÍŒœ¿¢ «áÈu¢. Æ¢Ÿ¿ÕÂ¹× ÂíEo ®¾£¾Ç-•-®Ï-Ÿ¿l´-„çÕiÊ X¾ŸÄ-ªÃn©Õ …X¾-§çÖ-’¹-X¾-œ¿-Åêá. Ƅ䢚ð Åç©Õ-®¾Õ-ÂíE „ÚËÅî ¨ ®¾«Õ-®¾uÊÕ ‡©Ç Ÿ¿Öª½¢ Í䮾Õ-Âî-«Íîa ͌֟Äl¢ ª½¢œË..

Know More

women icon @teamvasundhara

\œÄC «ª½Â¹Ø XÏ©x-©Â¹× ¨ ‚£¾Éª½¢ «Ÿ¿Õl!

¦ð®Ï Ê«Ûy-©Åî, *LXÏ Í䆾d-©Åî, «áŸ¿Õl «áŸ¿Õl «Ö{-©Åî «á{Õd-¹ע˜ä ¹¢C-¤ò-§äÕ©Ç …¢{Ö «ÕÊ¢-Ÿ¿J «ÕÊ®¾Õ©ÊÕ ŸîÍä-²Ähª½Õ \œÄ-C-©ðX¾Û «§ŒÕ-®¾ÕÊo ¦ÕèÇb-ªá©Õ. ê«©¢ ¹E-XÏ¢-ÍŒ-œÄ-Eê Âß¿Õ.. „ê½Õ …¢œ¿-œ¿«â ÍÃ©Ç ®¾ÕEo-ÅŒ„äÕ.. Æ¢Ÿ¿Õê *¯Ãoª½Õ© ÍŒª½t¢, ‚ªî’¹u¢.. «¢šË ƒÅŒª½ N†¾-§ŒÖ©ðx ÍÃ©Ç èÇ“’¹-ÅŒh©Õ B®¾Õ-Âî-„ÃLq …¢{Õ¢C. ¨ “¹«Õ¢©ð „ÃJ ‚£¾Éª½¢ N†¾-§ŒÕ¢-©ðÊÖ ‚*-ÅŒÖ* «u«-£¾Ç-J¢-ÍŒœ¿¢ ÍÃ©Ç «áÈu¢. „ç៿šË ‚ª½Õ-¯ç-©© «ª½Â¹Ø „ÃJÂË ê«©¢ ÅŒLx-¤Ä©Õ «Ö“ÅŒ„äÕ X¾šËd¢-*¯Ã.. ‚ ÅŒªÃyÅŒ ¯ç«Õt-C’à X¶¾Õ¯Ã-£¾Éª½¢ Æ©-„Ã{Õ Í䧌ÖL. ƒ©Ç Æ©-„Ã{Õ Íäæ® ®¾«Õ-§ŒÕ¢©ð ÂíÅŒh’à \ X¾ŸÄª½n¢ AE-XÏ¢-*¯Ã.. «âœ¿Õ ªîV© «ª½Â¹Ø ŸÄE “X¾¦µÇ«¢ ‡©Ç …¢Ÿî ’¹«Õ-E¢* \ “X¾«Ö-Ÿ¿«â ©äŸ¿-ÊÕ-¹ע-˜ä¯ä „ÃJÂË ÆC ‚£¾É-ª½¢’à ƢC¢ÍÃL. Æ¢Åä-Âß¿Õ.. XÏ©x-©Â¹×\œÄC «§ŒÕ®¾Õ E¢œä «ª½Â¹Ø X¾ÜJh’à ƒ«y-¹Ø-œ¿E X¾ŸÄ-ªÃn©Õ Â¹ØœÄ ÂíEo …¯Ãoªá. Ƅ䢚ð Åç©Õ-®¾Õ-¹ע-ŸÄ«Ö?

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

హాయ్‌ మేడమ్‌.. మాకు పెళ్లై ఐదు సంవత్సరాలవుతోంది. నా భర్త పెళ్లికి ముందు ఒకరిని ప్రేమించారు. కులాలు వేరు కావడంతో పెద్దవాళ్లు పెళ్లికి ఒప్పుకోలేదు. ఎప్పుడూ ఆ అమ్మాయి గురించే ఆలోచిస్తుంటారు.. ఒక్కోసారి ఏడుస్తారు కూడా. ఇదిలా ఉంటే దీనికి తోడు తనకు పరిచయమున్న ఇతర అమ్మాయిలను రెస్టారంట్లకు తీసుకువెళ్తుంటారు. నన్ను మాత్రం కనీసం పుట్టినరోజు, పెళ్లి రోజు వంటి సందర్భాల్లో కూడా బయటకు తీసుకెళ్లరు. దూరం ఎక్కువని ఆఫీస్ దగ్గరే రూమ్‌ తీసుకుని ఉంటున్నారు. మమ్మల్ని కూడా తీసుకెళ్లమంటే ‘మా అమ్మ ఇక్కడ వాతావరణానికి అలవాటు పడింది.. మీరు ఇక్కడే ఉండండి’ అంటున్నారు. ఇంట్లో ఖర్చులకు ఎలాంటి లోటూ చేయడు. కానీ, ఇంటికి వచ్చినప్పుడు నాతో సంతోషంగా ఉండడు. ఎప్పుడూ ఏదో ఒక తప్పు చూపిస్తాడు. ఒకవేళ ఎలాంటి తప్పు చేయకపోయినా కావాలని గొడవ పడతాడు. అమ్మాయిలతో గంటల కొద్దీ మాట్లాడతాడు. ఉదయం అయిదింటికి లేచి పనంతా చేయాలని తిడతారు. ఒకవేళ చేయకపోతే నీళ్లు మీద పోస్తారు. మా పుట్టింటికి వెళ్లి నాలుగు రోజులు ఉండాలనిపిస్తుంటుంది. కానీ పంపడు. ఒకవేళ పంపినా ఉదయం వెళ్లి సాయంత్రానికి వచ్చేయమంటారు. తను మాత్రం స్నేహితులతో ట్రిప్‌లకి వెళ్తారు. నాకు ఒక బాబు ఉన్నాడు. అందుకే ఏం చేయలన్నా ఆలోచిస్తున్నా.. దయచేసి సలహా ఇవ్వగరు. - ఓ సోదరి

మీ
భర్త మనసులో మరొక వ్యక్తి ఉన్నా.. అది సాధ్యం కాకపోవడంతో మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాడన్న విషయం మీకు తెలుసు. అతను తన పాత స్నేహితురాలిని మర్చిపోవడం సంగతి అటుంచితే.. తనకు మహిళల పట్ల బలహీనత ఉందనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. అమ్మాయిలతో గంటల కొద్దీ మాట్లాడడం, వారిని బయటకు తీసుకెళ్లడం, ఆఫీస్ దగ్గరే ఒంటరిగా రూం తీసుకుని ఉండడం వంటి విషయాలను ప్రస్తావించారు. ఇవన్నీ మీకు అతనిపై నమ్మకం ఉన్నట్లుగా సూచించడం లేదు. ఒకవైపు ఇంటి అవసరాలకు ఎలాంటి లోటూ చేయడం లేదని చెబుతూనే మరోవైపు మిమ్మల్ని వేధిస్తున్నాడని చెబుతున్నారు. అలాగే బాబు ఉన్నాడు కాబట్టి అతని మీద ఆధారపడక తప్పదన్న ఆలోచనతో మీరు ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తోంది.
ఈ క్రమంలో మీకు మీరు స్వయంశక్తిని పెంపొందించుకునే ప్రయత్నం చేయండి. మీ ఉత్తరంలో మీ విద్యార్హతల గురించి ప్రస్తావించలేదు. అయితే ఈ రోజుల్లో ఇంట్లోనే ఉండి విద్యార్హతలను పెంచుకునే అవకాశాలెన్నో ఉన్నాయి. కాబట్టి, ఉద్యోగానికి తగ్గ విద్యార్హతలను పెంచుకునే ప్రయత్నం చేయండి. దీనివల్ల మీ కాళ్ల మీద మీరు నిలబడడమే కాకుండా మీ బాబుని మీరు చూసుకోగలరన్న ధైర్యం కూడా మీకు కలుగుతుంది. ఒక్కసారి ఉద్యోగం/వ్యాపారం అంటూ మొదలుపెట్టిన తర్వాత మీరు ప్రపంచాన్ని చూసే కోణంలో కూడా మార్పు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫలితంగా మీపై మీకు ఆత్మవిశ్వాసం పెరగడమే కాకుండా.. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం కూడా వచ్చే అవకాశాలుంటాయి.
ఇక, మీరు చేసే పనుల్లో లోపాలు వెతకడం, మీద నీళ్లు పోయడం వంటి పనుల వల్ల ఇబ్బంది పడుతున్నారని చెబుతున్నారు. అయితే అతని ప్రవర్తన వల్ల మీరు ఎంతగా బాధపడుతున్నారో అతనికి మీరు స్వయంగా ఎప్పుడైనా చెప్పారో లేదో మీరు స్పష్టం చేయలేదు.. ఒకవేళ దాని గురించి అతనితో ఇప్పటివరకు డైరెక్ట్ గా మాట్లాడకపోయుంటే - అతని అనుచిత ప్రవర్తన మీకు ఎంత బాధ కలిగిస్తోందో ఓసారి వివరంగా చెప్పి చూడండి.
అప్పటికీ మార్పు లేకపోతే మీ పరిస్థితుల గురించి పెద్దవాళ్లతో చర్చించడం ద్వారా సమస్యను పరిష్కరించే అవకాశం ఉండచ్చు. ఆ దిశగా కూడా ఓసారి ప్రయత్నించి చూడండి. అదేవిధంగా సాధ్యమైనంత త్వరగా మీ కాళ్ల పైన మీరు నిలబడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు ఏ పరిస్థితి ఎలా వచ్చినా అతని పైన ఆర్ధికంగా ఆధారపడే అవసరం ఉండదు. మీ భవిష్యత్తు గురించి ధైర్యంగా నిర్ణయం తీసుకోగలుగుతారు.
0 Likes
Know More

Movie Masala