అందుకే వీళ్ళిద్దరూ మోదీ మన్ననలందుకున్నారు!
కరోనా.. కంటికి కనిపించదు కానీ చెట్టంత మనిషిని ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తోంది. ఈ వైరస్ ధాటికి ప్రపంచ దేశాలన్నీ విలవిల్లాడుతున్నాయి. అలాంటిది ఈ మహమ్మారి బారిన పడిన బాధితులను కాపాడేందుకు వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది ప్రత్యక్షంగా వైరస్‌తో పోరాడుతున్నారు.. మరోవైపు క్షేత్రస్థాయుల్లో కరోనాపై ప్రజల్లో అవగాహన పెంచుతూ కొవిడ్ వారియర్లుగా పేరు తెచ్చుకుంటోన్న వారు ఎందరో! అలాంటి ఇద్దరు మహిళా సర్పంచ్ల సేవల్ని గుర్తించిన ప్రధాని మోదీ తాజాగా నిర్వహించిన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో వారిని ప్రశంసల్లో ముంచెత్తారు. వారి గురించి, వారు చేసిన సేవల గురించి అందరికీ తెలియజేసి దేశమంతా వారిని కొనియాడేలా చేశారు. మరి, ఇంతకీ ఎవరా మహిళా సర్పంచ్‌లు? కరోనా నివారణ చర్యల్లో భాగంగా వారేం చేశారు? రండి.. తెలుసుకుందాం..!
Know More