అందుకే ఇలా సముద్రగర్భంలో పెళ్లి చేసుకున్నాం!
వివాహం... ఒక అబ్బాయి... అమ్మాయి... జీవితాంతం కలిసి జీవిస్తామని, కష్ట సుఖాలను కలిసి పంచుకుంటామని బంధుమిత్రుల సమక్షంలో ప్రమాణం చేస్తూ ఒక్కటయ్యే అపురూప వేడుక. ప్రతి ఒక్కరి జీవితంలో మధురమైన ఘట్టాల్లో ఇదీ ఒకటి. అందుకే రెండు జీవితాలు ఒక్కటయ్యే ఈ వేడుకను ఎంతో ఆనందంగా, అట్టహాసంగా, అందరికీ గుర్తుండిపోయేలా జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దీంతో ఈ మధ్య అందరూ డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కు ఎక్కువగా ఓటేస్తున్నారు. ఈక్రమంలో చెన్నైకి చెందిన ఓ జంట అందరినీ ఆశ్చర్యపరుస్తూ సముద్ర గర్భంలో పెళ్లి చేసుకుంది. అక్కడ ఏర్పాటుచేసిన అరటి తోరణాల మధ్య పూల దండలు మార్చుకుంది. మరి కుటుంబీకులు, బంధువులు, బాజా భజంత్రీల నడుమ కల్యాణ మండపంలో పెళ్లి చేసుకోవాల్సిన ఆ జంట వినూత్నంగా కడలి గర్భంలో ఎందుకు పెళ్లి చేసుకుందో తెలుసుకుందాం రండి.
Know More