ఓ తల్లిగా వారి బాధను అర్థం చేసుకున్నా.. సహాయం చేశా!
నెలల పసిగుడ్డును చంకనేసుకొని ఎండనక, వాననక.. రాత్రనక, పగలనక బయట ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర యాచిస్తూ జీవనం కొనసాగించే మహిళల్ని చూస్తే మనసు చివుక్కుమంటుంది.. వారి కష్టాన్ని చూడలేక ఓ పదో, ఇరవయ్యో దానం చేస్తుంటాం. కానీ అంతకుమించి మంచి మనసున్న కొందరు వ్యక్తులు ఇలాంటి అభాగ్యులను, ఇల్లు లేక వీధిన పడ్డ వారిని చేరదీసి కడుపునిండా అన్నం పెడుతుంటారు.. తమకు తోచిన నగదు సహాయం చేస్తుంటారు.. మానవత్వం ఎక్కడో లేదు.. తమలోనే ఉందని నిరూపించుకుంటారు.
Know More