చర్మ సంరక్షణ కోసం నేను ఈ చిట్కాలు పాటిస్తున్నా!
ఆపాదమస్తకం అందంగా మెరిసిపోవాలని సినీతారలు అనుకోవడం సహజం. ఈ నేపథ్యంలో సిల్వర్ స్ర్కీన్‌పైనే కాదు నిజ జీవితంలోనూ ఎంతో అందంగా కనిపించేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు మన ముద్దుగుమ్మలు. ప్రత్యేకించి చర్మ సంరక్షణ విషయంలో మరింత శ్రద్ధ వహిస్తుంటారు. ఈ క్రమంలో ఇంట్లో లభించే సహజసిద్ధమైన చిట్కాల్ని పాటించడమే కాకుండా.. తమ శరీరతత్వానికి సరిపడే ఆహారాన్ని మాత్రమే తీసుకుంటుంటారు. ఎంత రుచిగా ఉన్నా సరే.. శరీరానికి అలర్జీ కలిగించే ఆహారాన్ని పక్కన పెడుతుంటారు. ఈ క్రమంలో తాను కూడా గతంలో ఫుడ్ అలర్జీతో బాధ పడ్డానంటోంది రష్మిక మందన. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ఈ అందాల తార సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ సందర్భంగా ఇన్‌స్టా వేదికగా తన స్కిన్ కేర్ టిప్స్‌ని అందరితో షేర్ చేసుకుందీ ముద్దుగుమ్మ.
Know More