అలా నేనూ కరోనా బారిన పడ్డా!
కంటికి కనిపించని కరోనా ఎవ్వరినీ కనికరించడం లేదు. పేద-ధనిక, ఆడ-మగ, చిన్నా-పెద్దా... ఈ తేడాలేవీ లేవంటూ అందరినీ వణికిస్తోంది. అందుకే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే సామాన్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు కూడా ఈ మహమ్మారి బాధితుల జాబితాలో చేరిపోతున్నారు. తాజాగా సినీ నటి, మహారాష్ట్రలోని అమరావతి పార్లమెంట్ సభ్యురాలు నవనీత్ కౌర్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ సందర్భంగా ఆమెతో పాటు భర్త, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులకు కరోనా సోకినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారామె.
Know More