అమ్మలూ.. ఇలా చేస్తే ఇంటినీ, పనినీ బ్యాలన్స్ చేసుకోవడం ఎంతో ఈజీ!
కరోనా నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రస్తుతం మన ముందున్న ఏకైక మార్గం ‘లాక్డౌన్’ మాత్రమే. అందువల్ల దేశంలో విద్యాసంస్థలతో పాటు.. కార్యాలయాలు, వ్యాపార సంస్థలు సకలం మూతపడ్డాయి. ఈ కారణంగా పిల్లలు ఇల్లు దాటకుండా వారి చుట్టూ లక్ష్మణ రేఖ గీయడం.. అదే సమయంలో కొందరు తల్లిదండ్రులు ఇంటి నుండి పనిచేయాల్సి రావడం వల్ల తల్లిదండ్రులకు కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. అటు పిల్లలను సముదాయిస్తూ, ఆడిస్తూనే.. ఇటు ఆఫీస్ పని చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా రెండింటినీ బ్యాలన్స్ చేయాలంటే ఎంతో చాకచక్యత, ప్రణాళిక అవసరం. ఈ నేపథ్యంలో ఓవైపు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూనే.. మరోవైపు పిల్లల ఆలనా పాలన చూసుకోవాలంటే తల్లులు ఎలాంటి టిప్స్ పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Know More