సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

ఈ సెలబ్రిటీలందరూ కరోనాను జయించిన వారే!

కనికరం లేకుండా విరుచుకుపడుతోన్న కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. పేద-ధనిక, ఆడ-మగ, చిన్నా-పెద్దా... ఈ తేడాలేవీ చూడకుండా అందరినీ బలి తీసుకుంటోంది. ఈ క్రమంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే... సామాన్యులే కాదు... పలువురు సెలబ్రిటీలు కూడా ఈ వైరస్‌ బారిన పడుతున్నారు. అయితే ఇంకా మందు లేని ఈ మహమ్మారిని చాలామంది మనోధైర్యంతో జయిస్తున్నారు. సరైన సమయంలో వైద్యం తీసుకుని వైరస్‌పై విజయం సాధిస్తున్నారు. తాజాగా కరోనా బారిన పడ్డ తమన్నా కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయింది. ఈ క్రమంలో కరోనా నుంచి కోలుకుని ఆ అనుభవాలను అందరితో షేర్ చేసుకున్న కొందరి ప్రముఖుల గురించి తెలుసుకుందాం రండి...

Know More

women icon @teamvasundhara

వారి ‘హార్ట్‌ వర్క్‌’ కోసమే ఈ ఆర్ట్‌ వర్క్!

కరోనా సృష్టించిన ఈ కల్లోల పరిస్థితుల్లో కనీసం కంఫర్ట్‌ జోన్లో ఉండి మన పనులు మనం చేసుకునే వెసులుబాటైనా మనకుంది.. అదే వైద్యులు, వైద్య సిబ్బంది, నిత్యావసర వస్తువులు సరఫరా చేసే వాళ్లు, ఇతర అత్యవసర సేవల్లో భాగమయ్యే వారు వైరస్‌ ముప్పు పొంచి ఉందని తెలిసినా కచ్చితంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లాల్సిందే! అలాంటి కరోనా యోధుల సేవలు చిరస్మరణీయంగా నిలుస్తాయని చెప్పడంలో సందేహం లేదు. అయితే మన క్షేమాన్ని కాంక్షిస్తూ మనకు సకల సదుపాయాలు సమకూర్చుతోన్న అలాంటి వారియర్స్ కోసం మన వంతుగా సహాయసహకారాలు అందించాల్సిన బాధ్యత మనపై ఉందని చెబుతోంది మాజీ ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్‌. కేవలం చెప్పడమే కాదు.. కరోనా యోధులకు అండగా నిలబడేందుకు తాను కూడా ఓ స్వచ్ఛంద సంస్థతో చేతులు కలిపానని ఓ చిన్న వీడియో ద్వారా పంచుకుందీ మాజీ మిస్‌ వరల్డ్‌. మరి, కరోనాపై పోరులో ముందుండి పోరాడుతోన్న యోధులకు ఈ ముద్దుగుమ్మ చేస్తోన్న సాయమేంటి? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!

Know More

women icon @teamvasundhara

అందుకే వీళ్ళిద్దరూ మోదీ మన్ననలందుకున్నారు!

కరోనా.. కంటికి కనిపించదు కానీ చెట్టంత మనిషిని ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తోంది. ఈ వైరస్‌ ధాటికి ప్రపంచ దేశాలన్నీ విలవిల్లాడుతున్నాయి. అలాంటిది ఈ మహమ్మారి బారిన పడిన బాధితులను కాపాడేందుకు వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది ప్రత్యక్షంగా వైరస్‌తో పోరాడుతున్నారు.. మరోవైపు క్షేత్రస్థాయుల్లో కరోనాపై ప్రజల్లో అవగాహన పెంచుతూ కొవిడ్‌ వారియర్లుగా పేరు తెచ్చుకుంటోన్న వారు ఎందరో! అలాంటి ఇద్దరు మహిళా సర్పంచ్‌ల సేవల్ని గుర్తించిన ప్రధాని మోదీ తాజాగా నిర్వహించిన ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో వారిని ప్రశంసల్లో ముంచెత్తారు. వారి గురించి, వారు చేసిన సేవల గురించి అందరికీ తెలియజేసి దేశమంతా వారిని కొనియాడేలా చేశారు. మరి, ఇంతకీ ఎవరా మహిళా సర్పంచ్‌లు? కరోనా నివారణ చర్యల్లో భాగంగా వారేం చేశారు? రండి.. తెలుసుకుందాం..!

Know More

women icon @teamvasundhara

పిరియడ్స్‌లో.. ఇటు బ్లీడింగ్‌, అటు పీపీఈ కిట్లు.. మా బాధ వర్ణనాతీతం!

గత కొన్ని నెలలుగా కంటికి కనిపించని శత్రువుతో అలుపెరగని యుద్ధం చేస్తున్నారు వైద్యులు, నర్సులు. కొవిడ్‌ రోగులకు సేవలందించే క్రమంలో శారీరకంగా, మానసికంగా వారు ఎంతో ఒత్తిడికి గురవుతున్నారు. ఇక దీనికి తోడు నిరంతరాయంగా వారు ధరించే పీపీఈ కిట్లు వారికి ఊపిరాడకుండా చేస్తున్నాయి. మరి ఇలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్య మహిళా వైద్య సిబ్బందిని మరో సమస్య వేధిస్తోంది. అదే నెలసరి. దానికి వేళాపాళా ఉండదు.. సమయం, సందర్భంతో పనిలేదు. కొవిడ్‌ రోగులకు సేవలందించే మహిళా వైద్య సిబ్బందైనా, సాధారణ మహిళలైనా.. ఎప్పుడైనా, ఎక్కడున్నా నెలనెలా ఈ అనుభవం ఎదుర్కోవాల్సిందే!

Know More

women icon @teamvasundhara

హృదయమున్న ప్రతిచోటా అమ్మ ఉంటుంది...!

కంటికి కనిపించకుండా, కనికరం లేకుండా ప్రపంచమంతా కోరలు చాస్తోంది కరోనా వైరస్‌. ఓవైపు కోట్లాదిమంది ప్రజలు స్వీయ నిర్బంధం పాటిస్తూ మహమ్మారిపై సమరం చేస్తుంటే, ఇదే క్రమంలో వైద్య సిబ్బంది ముందుండి వైరస్‌పై పోరాటం సాగిస్తున్నారు. కరోనా బాధితులను కాపాడేందుకు వైద్యులు, నర్సులు కంటి మీద కునుకు లేకుండా శ్రమిస్తున్నారు. విధి నిర్వహణలో నెలల తరబడి కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ, వారి ప్రాణాలను పణంగా పెట్టి మరీ వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ సెర్చింజన్‌ దిగ్గజం గూగుల్‌.. డూడుల్‌తో వారి సేవలకు కృతజ్ఞతలు చెప్పింది. ఇక మరోవైపు లాక్‌డౌన్‌ కాలంలో గృహిణిగా, ఉద్యోగినిగా రెండు పనుల్ని సమన్వయం చేసుకుంటూ సమర్థంగా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న ‘వర్కింగ్‌ మదర్స్‌’కు తన తాజా డూడుల్‌ను అంకితం చేసింది ప్రముఖ డెయిరీ బ్రాండ్‌ ‘అమూల్‌’.

Know More

women icon @teamvasundhara

అందుకే వీళ్లు నిజమైన ‘కరోనా యోధులు’ !

కరోనా విజృంభణను అదుపు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తున్నాయి. కానీ, ఎక్కువ జనాభా, జనసాంద్రత కలిగిన మన దేశంలో ప్రజలను కరోనా నుంచి కాపాడగలిగే సూత్రం ‘లాక్‌డౌన్‌’ ఒక్కటే..! అయితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అత్యవసర విభాగాలకు చెందిన ఎంతోమంది ఉద్యోగులు పగలు, రాత్రి అనే తేడాల్లేకుండా పని చేస్తుంటే.. వారితో పాటు ప్రజలకు సేవలందించేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు మరికొందరు. ఈ క్రమంలో ఇలాంటి వాళ్ల గురించి, సమాజానికి వారు చేస్తోన్న సేవా కార్యక్రమాల గురించి సోషల్‌ మీడియా వేదికగా ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తోంది NITI (National Institution for Transforming India) Aayog సంస్థ. మరి, ఆ విశేషాలేంటో మనమూ తెలుసుకుందామా..!

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala