గుండె రాయి చేసుకున్నా.. క్యాన్సర్‌ను జయించా!
క్యాన్సర్.. మందు లేని ఈ మహమ్మారి ఎన్నో ఏళ్లుగా మానవజాతిని పట్టి పీడిస్తోంది. ఆడ, మగ, చిన్నా, పెద్దా అన్న తేడాల్లేకుండా అందరినీ భయపెడుతోంది. అయితే దీనిపై ముందు నుంచీ అవగాహన పెంచుకోవడం, తొలిదశలోనే గుర్తించడం, క్యాన్సర్ అంటూ భయపడిపోకుండా సరైన చికిత్సలు తీసుకుని ధైర్యంగా ముందుకు సాగితే దీని నుంచి బయటపడవచ్చు. ఎందరో సెలబ్రిటీలు తమ అనుభవాల ద్వారా ఈ మాటలను అక్షర సత్యం చేశారు. అలాంటివారిలో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనాలీ జగ్తాప్ ఒకరు. రెండేళ్ల క్రితం ప్రమాదకర గర్భాశయ క్యాన్సర్ బారిన పడిన ఆమె మానసిక స్థైర్యంతో ఆ మహమ్మారిని అధిగమించింది. చికిత్స సమయంలో ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా తన క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన అనుభవాలు షేర్ చేసుకున్న ఆమె ఆ తర్వాత కూడా తనకు వీలైనప్పుడల్లా క్యాన్సర్ బాధితుల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తోంది. ఈక్రమంలో ‘ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం’ సందర్భంగా క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన అనుభవాలను అందరితో పంచుకుంది మనాలీ.
Know More