ఒక్క వీడియోతో ఓవర్‌నైట్ స్టార్ అయింది!
క్యాన్సర్.. ఎన్నో ఏళ్లుగా మనిషిని పీడిస్తోన్న వ్యాధుల్లో ఒకటి. వూపిరితిత్తులు, మెదడు, గొంతు, ఎముకలు, కాలేయం, రక్తం, చర్మం.. మొదలైన శరీర భాగాల కణజాలాలు దెబ్బతిని వివిధ రకాల క్యాన్సర్లు పుట్టుకొస్తున్నాయి. ఈ రోగానికి సంబంధించి వైద్య సేవల్లో ఆధునికత కనిపిస్తున్నప్పటికీ సరైన మందు కనుగొనకపోవడంతో చాలామంది దీని బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఈ మహమ్మారి బారిన పడినప్పటికీ.. తమ మనోధైర్యంతో దాన్ని జయించిన సెలబ్రిటీలు చాలామందే ఉన్నారు. కీమోథెరపీ వంటి చికిత్సా పద్ధతుల ద్వారా, ఆహారపుటలవాట్లలో మార్పులు చేసుకొని చాలామంది ఆ వ్యాధిని తరిమికొడుతున్నారు. ఈ నేపథ్యంలో వారి అనుభవాలను అందరితో షేర్ చేసుకుంటూ తమలాంటి బాధితులకు జీవితంపై భరోసా ఇస్తున్నారు. ఈ క్రమంలో బ్రిటన్‌కు చెందిన క్యాతీ హెలెంద్ అనే ఓ క్యాన్సర్ బాధితురాలు తన కీమోథెరపీ చికిత్సకు సంబంధించిన అనుభవాలను సోషల్ మీడియా వేదికగా పంచుకొని రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిపోయింది.
Know More