సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

గొడవ పడ్డాం.. ఎంత ట్రై చేసినా మాట్లాడడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

మెనోపాజ్‌ తర్వాత బ్లీడింగా? అయితే ఇవి కారణం కావచ్చు!

మెనోపాజ్‌ అంటేనే మహిళల్లో నెలసరి ఆగిపోయే దశ. సాధారణ పరిస్థితుల్లో వరుసగా ఏడాది పాటు నెలసరి రాకపోతే.. వారు మెనోపాజ్‌ దశలోకి అడుగుపెట్టారని అర్థం. అయితే ఈ సమయంలోనూ కొంతమందికి అప్పుడప్పుడూ రక్తస్రావం కనిపిస్తుంటుంది. మరి, నెలసరి ఆగిపోయినా బ్లీడింగ్ అవుతోందంటే అది కచ్చితంగా ఏదో ఒక ప్రమాదకరమైన వ్యాధి/సమస్యకు సూచిక అంటున్నారు నిపుణులు. అందుకే దీన్ని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుల్ని సంప్రదిస్తే అసలు సమస్యేంటో తెలుసుకొని ఆదిలోనే దానికి చెక్‌ పెట్టేయచ్చని చెబుతున్నారు.. లేదంటే దాని వల్ల ఇతర అనారోగ్యాలకూ దారితీసే ప్రమాదముందంటున్నారు. మరి, ఇంతకీ మెనోపాజ్‌ తర్వాత వెజైనల్‌ బ్లీడింగ్‌ ఎందుకవుతుంది? ఈ క్రమంలో ఇంకా ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఇంతకీ దీనికి చికిత్స ఉందా?, లేదా? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!

Know More

women icon @teamvasundhara

విపరీతంగా బ్లీడింగ్ అవుతోంది.. పరిష్కారమేంటి?

హలో డాక్టర్‌. నా వయసు 22. ఎత్తు 5’3’’. బరువు 55 కిలోలు. నాకు పీసీఓఎస్‌ ఉంది. డాక్టర్‌ మూడు నెలల కోర్సు ఇచ్చారు. ఈ కోర్సు పూర్తయిన తర్వాత రెండు నెలలు పిరియడ్స్‌ బాగానే వచ్చాయి. ఆ తర్వాత ఒక నెల పిరియడ్స్‌ రాలేదు. తర్వాతి నెలలో వచ్చినా బ్లీడింగ్‌ అవ్వలేదు. ఆపై నెలలో పిరియడ్స్‌ రెండు రోజుల ముందే వచ్చాయి.. పది రోజుల పాటు బ్లీడింగ్‌ అయింది. కానీ ఇప్పుడు ఐదు రోజుల ముందే నెలసరి వచ్చింది.. బ్లీడింగ్‌ ఎక్కువగా ఉంది.. ఇలా పిరియడ్స్‌ విషయంలో రెగ్యులారిటీ అంటూ లేదు. బ్లీడింగ్‌ కూడా విపరీతంగా అవుతోంది.. నా సమస్యకు పరిష్కారమేంటి? - ఓ సోదరి

Know More

women icon @teamvasundhara

నా ఇర్రెగ్యులర్ పిరియడ్స్‌కి ఆ మాత్రే కారణమా?

నమస్తే డాక్టర్. నా వయసు 39. ఈమధ్య తిరుమల వెళ్లాల్సి రావడం, మా ఇంటి గృహ ప్రవేశం వంటి సందర్భాల్లో నెలసరి రాకుండా ఉండేందుకు మూడు Primolut-N మాత్రలు వేసుకున్నా. అవి ఆపేశాక ఒకసారి పిరియడ్స్ మామూలుగానే వచ్చినా, ఆ తర్వాత నుంచీ రెగ్యులర్‌గా రావడం లేదు. నాకు సాధారణంగా 28 రోజులకే నెలసరి వస్తుంటుంది. ఈ క్రమంలో గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్లాను. Sysron-N 5mg ట్యాబ్లెట్స్ మూడు రోజులకు రాసిచ్చారు. మొదటి ట్యాబ్లెట్ వేసుకున్న మూడు గంటలకు కొద్దిగా బ్లీడింగ్ అయింది. డాక్టర్‌కి ఫోన్ చేసి అడిగితే ట్యాబ్లెట్ ఆపేయమన్నారు. ఆ తర్వాత ఒక రోజు గడిచినా బ్లీడింగ్ కాకపోయేసరికి మళ్లీ డాక్టర్‌కి ఫోన్ చేస్తే మిగతా ట్యాబ్లెట్స్ వేసుకోమన్నారు. కోర్సు పూర్తయినా ఒక రోజు గడిచినా బ్లీడింగ్ మాత్రం కావట్లేదు. నేను పిరియడ్ రాకుండా ట్యాబ్లెట్స్ వాడడం ఇదే తొలిసారి. ప్రతినెలా నాకు పిరియడ్స్ రెగ్యులర్‌గా వస్తాయి. ఇప్పుడే ఎందుకిలా జరుగుతుందో అర్థం కావట్లేదు. మళ్లీ నాకు పిరియడ్స్ రెగ్యులర్ అవ్వాలంటే ఏం చేయాలో సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

women icon @teamvasundhara

అక్కడ అమ్మాయి పెద్దమనిషైతే అరటిచెట్టుతో పెళ్లి చేస్తారట!

ఓవైపు బిడియం, మరోవైపు సిగ్గు, ఇంకోవైపు ఆనందం.. ఇలా ఆడపిల్లలు బాల్యాన్ని వదిలి యవ్వనంలోకి అడుగుపెట్టే ఆ క్షణంలో వారి మనసులో కలిగే భావాలెన్నో! మరి ఈ దశలో వారి మనసులో కలిగే భయాల్ని, అపోహల్ని పోగొట్టి, వారికి ఎన్నో మధురానుభూతుల్ని అందించడానికి తొలి నెలసరి వేడుకను పెద్ద పండగలా జరుపుకోవడం మన దగ్గర ఆనవాయితీగా వస్తోంది. అంతేకాదు.. వివిధ పిండి పదార్థాలు, పండ్లు-ఫలహారాలతో వారి ఒడి నింపి వారిలో ఆరోగ్య స్పృహ పెంచుతారు కూడా! కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశంలోని వివిధ ప్రాంతాల్లోనూ అమ్మాయిలకు నెలసరి ప్రారంభమైన ఆ ఘట్టాన్ని విభిన్న సంప్రదాయాలు-ఆచారాలతో పెద్ద వేడుకలా నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలో దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో 'ఫస్ట్ పిరియడ్ ట్రెడిషన్స్' ఎలా ఉంటాయో తెలుసుకుందాం రండి...

Know More

women icon @teamvasundhara

నెలసరి సమస్యలు తగ్గాలంటే ఐరన్ తీసుకోవాల్సిందే!

నెలసరి సమయంలో బ్లీడింగ్‌ ఎక్కువగా అవడం వల్ల రక్తహీనత తలెత్తడం మనకు తెలిసిందే. అందుకే ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఇనుము అధికంగా లభించే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. అది సరే కానీ.. మరి రక్తహీనత ఉన్నప్పుడు కూడా నెలసరి సమయంలో మన శరీరంలో నుంచి ఎక్కువ మొత్తంలో రక్తం బయటికి వెళ్లిపోతుంటుంది.. అలా ఎందుకు జరుగుతుంది? అనే సందేహం మనలో చాలామందికి వచ్చే ఉంటుంది. నెలసరికి, రక్తహీనతకు మధ్య ఉన్న అవినాభావ సంబంధమే అందుకు కారణమంటున్నారు నిపుణులు. మరి, ఇంతకీ ఏంటా సంబంధం? ఐరన్‌ లోపం తలెత్తకుండా, తద్వారా పిరియడ్‌ సమస్యలు రాకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? వంటి విషయాల గురించి తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

మీ సమస్యను బట్టి మీ ఇద్దరి మధ్య మానసికంగా అనుబంధం దృఢపడినట్లు అనిపించడం లేదు. మీరిద్దరూ ఒకరికొకరు అలవాటు పడే క్రమంలోనే తగాదాలు, గొడవలు వస్తున్నాయి. ప్రస్తుతం మీ ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేవని స్పష్టంగా చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ఇరు కుటుంబ సభ్యులతో మీ విషయం గురించి చర్చించారా? అతను ప్రతి విషయాన్ని తన తండ్రి దగ్గరకు తీసుకెళ్తుంటే అది మీకు నచ్చట్లేదన్న విషయాన్ని అతనికి అర్థమయ్యే విధంగా చెప్పారా? ఎనిమిది నెలల సాన్నిహిత్యంలో కేవలం పోట్లాడుకున్న సందర్భాలే ఉన్నాయా? ఆనందంగా గడిపిన క్షణాలు కూడా ఉన్నాయా? వంటి విషయాలన్నింటినీ మీరు ఓసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.

పెళ్లి చేసుకునే విషయంలో ఎలాగైతే తొందరపాటు పనికిరాదో.. విడిపోయే విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
ఈ క్రమంలో- మీ నాన్న గారు ఫోన్ చేస్తే మీ మామగారు తర్వాత మాట్లాడదామన్నారని చెప్పారు. మీ భర్త కూడా మీతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్లతో మాట్లాడడానికి మళ్లీ ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పటికీ స్పందన లేకపోతే మీ కుటుంబంలోని ఇతర పెద్దలతో కలిసి డైరెక్ట్ గా వాళ్ళింటికే వెళ్లి మాట్లాడి చూడండి. ఇందుకోసం మీ రెండు కుటుంబాల్లోనూ మీ సంక్షేమం కోరే మీ శ్రేయోభిలాషుల సహకారం తీసుకోవచ్చు.
ఈ విధంగా - మీ ఇరుపక్షాల పెద్దవాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకుని మీ సమస్యను సామరస్యంగా పరిష్కరించే పరిస్థితులను కల్పించగలుగుతారేమో చూడండి. అయితే అది ఎంతవరకు సఫలమవుతుందనేది రెండువైపుల నుంచి లభించే సహకారం పైనే ఆధారపడి ఉంటుంది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే - ఇతర మార్గాల ద్వారా ప్రయత్నించాల్సి వస్తుందేమో అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు.
0 Likes
Know More

Movie Masala