ఆలోపు మహిళలంటే ఏంటో మగాళ్లకు తెలియాలి!
‘అన్నింటా ఆమె’ అంటూ మహిళలు అన్ని రంగాల్లోనూ ఉన్నత అవకాశాలు అందుకుంటున్నారు. మగవాళ్లకేం తీసిపోని విధంగా..ఇంకా చెప్పాలంటే వారికి మించి విజయాలు సాధిస్తున్నారు. ఇలా అతివల కీర్తి ఆకాశాన్ని అంటుతున్నా..వారిపై అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. ప్రభుత్వాలు కొత్త చట్టాలు తీసుకొచ్చినా.. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రేప్‌కు గురయ్యే బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ‘ఏటేటా మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నాయి’ అంటూ ‘నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో’ చెబుతున్న గణాంకాలే ఇందుకు నిదర్శనం. ఇక ‘దిశ’ లాంటి హత్యాచార ఘటనలు జరిగినప్పుడు అందరూ గళమెత్తి అన్యాయాన్ని ఎదిరించడం, ఆ తర్వాత మూడురోజులకు మర్చిపోవడం ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయింది. అయితే ఈ అకృత్యాలు, ఆగడాలకు అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో చాలామంది తమదైన శైలిలో అవగాహనా కార్యక్రమాలు, క్యాంపెయిన్లు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అత్యాచారాలకు వ్యతిరేకంగా ప్రముఖ బెంగాలీ మోడల్, బాలీవుడ్ నటి బిదితా బాగ్ తీసుకున్న ఫొటోషూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.
Know More