సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

ఈ పొడితో ఇమ్యూనిటీ పెంచుకోండి!

దేశంలో కరోనా నెమ్మదిగా విస్తరిస్తోంది. ఈ మహమ్మారిని ఆపడానికి ప్రభుత్వం సర్వశక్తులూ ఒడ్డుతోంది.. ఇక సెలబ్రిటీలు సోషల్‌ మీడియా వేదికగా కరోనాపై అందరిలో అవగాహన కల్పిస్తున్నారు. అయితే ఎవరెన్ని చెప్పినా వ్యక్తిగత పరిశుభ్రత లేనిదే కరోనాను కట్టడి చేయలేమన్నది అక్షర సత్యం. ఈ క్రమంలోనే కొందరు సామాన్యుల దగ్గర్నుంచి సెలబ్రిటీల వరకు స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. ఇలా తాము సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉంటూ తమ ఫ్యాన్స్‌కు ఆదర్శంగా నిలవడమే కాదు.. ఆ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు తమ హాబీలకు సమయం కేటాయిస్తే.. మరికొందరేమో కరోనా రాకుండా జాగ్రత్తలు పాటించండంటూ సోషల్‌ మీడియా వేదికగా అవగాహన కల్పిస్తున్నారు. బాలీవుడ్‌ పవర్‌ఫుల్‌ కపుల్‌గా పేరుగాంచిన బిపాసా-కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌ కూడా స్వీయ నిర్బంధంలో ఉంటూ అటు తమ బంధాన్ని రెట్టింపు చేసుకుంటూనే.. ఇటు ఫ్యాన్స్‌కూ కరోనాను ఎదుర్కొనే పాఠాలు నేర్పుతున్నారు. ఈ మహమ్మారిని ఎదుర్కోవాలంటే రోగనిరోధక శక్తి చాలా అవసరమని, అందుకోసం ఈ రెసిపీ చక్కగా ఉపయోగపడుతుందని దాన్ని తయారుచేసి మరీ వివరించింది బిప్స్‌. మరి ఆ రెసిపీ ఎలా చేయాలో మనమూ నేర్చేసుకుందామా?

Know More

women icon @teamvasundhara

నా మనసెంత పెద్దదో మీరే చూడండి!

తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న కేరళ కుట్టి అనుపమా పరమేశ్వరన్‌. అటు తెలుగులోనే కాకుండా వరుస తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటుందీ లవ్లీ బ్యూటీ. సోషల్‌ మీడియాలో యమ చురుగ్గా ఉండే ఈ ‘ప్రేమమ్‌’ బ్యూటీ తన లేటెస్ట్‌ ఫొటోలతో పాటు అప్పుడప్పుడూ క్రేజీ పోస్టులు పెడుతూ అభిమానులను అలరిస్తుంటుంది. ఈ క్రమంలో తాజాగా అను.. తన సోదరుడు అక్షయ్‌ పరమేశ్వరన్‌ పుట్టినరోజు సందర్భంగా ఒక ఫొటోని షేర్‌ చేసి బర్త్‌డే విషెస్‌ తెలిపింది. తన సోదరుడి వెనుక నిల్చొని ఆటపట్టిస్తున్నట్లుగా ఉన్న ఓ క్యూట్‌ పిక్‌ని ఇన్‌స్టాలో పంచుకుంటూ..‘హ్యాపీ బర్త్‌డే మంకీ (అక్షయ్‌ పరమేశ్వరన్‌).. నువ్విప్పుడు పెద్దవాడివయ్యావని నాకు తెలుసు.. కానీ నువ్వు కనే కలల్లో కూడా నన్ను ప్రేమించడం ఆపుతావనే ఆలోచన నీకు రానివ్వను..’ అంటూ తమ్ముడిపై తనకున్న ప్రేమను వ్యక్తం చేసిందీ అందాల అక్క.

Know More

women icon @teamvasundhara

సెలబ్రిటీల ‘కరోనా’ పాఠాలు!

స్కూళ్లు, కాలేజీలు, సినిమా థియేటర్లు మూతపడ్డాయి.. కొన్ని ప్రదేశాల్లో అయితే ఏకంగా 144 సెక్షన్‌ విధించారు. ఇదంతా ‘కరోనా’ (కొవిడ్‌-19) సృష్టిస్తోన్న కల్లోలంలో భాగమే. బహుశా మానవజాతి చరిత్రలో ఒక వైరస్‌ ఇలా ప్రపంచాన్ని భయపెడుతుండడం ఇదే తొలిసారి కావొచ్చు. ఈ వైరస్‌ను అడ్డుకోవడానికి ప్రపంచమంతా ఒక్క తాటిపైకి వచ్చింది. ఈ క్రమంలోనే కరోనాను ఎలా అడ్డుకోవాలి? ఈ వైరస్‌ బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయాలపై ప్రభుత్వాలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇందులో భాగంగానే సెలబ్రిటీలు కూడా తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. ప్రజల్లో కరోనాపై అవగాహన కల్పించేందుకు కొన్ని సలహాలు, సూచనలు చేస్తున్నారు. సినిమాల్లో తారలు చెప్పే డైలాగ్‌లకు చప్పట్లు కొడుతూ.. ఈలలు వేసే మనం.. వారు చెబుతోన్న ఈ సూచనలు కూడా పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకుంటే బాగుంటుంది కదూ! ఇంతకీ కరోనాపై అవగాహన కల్పిస్తోన్న ఆ సెలబ్రిటీలు ఎవరు..? వారేం చెబుతున్నారో చూద్దామా?

Know More

women icon @teamvasundhara

కరోనా కాటు వేయకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి!

కరోనా.. కరోనా.. ప్రస్తుతం ఎవరి నోట విన్నా ఇదే మాట! రోజురోజుకీ కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. మన చుట్టూ ఉన్న వాళ్లు కనీసం తుమ్మినా, దగ్గినా అది కరోనా వల్లనేమో అనే ఆలోచనే ముందుగా మన మనసులోకొస్తోంది. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మన దేశంలో కూడా రోజురోజుకీ పెరుగుతుండడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ ఈ వైరస్‌ పట్ల అవగాహన తెచ్చేందుకు ప్రభుత్వాలు వివిధ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో పలు స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రముఖ సెలబ్రిటీలు సైతం కరోనా వైరస్‌ పట్ల ప్రజల్లో అవగాహన పెంచేందుకు సామాజిక మాధ్యమాలను వేదికలుగా చేసుకుంటున్నారు. వివిధ పోస్టులు, వీడియోలను షేర్‌ చేస్తూ ‘కరోనాకు భయపడద్దు.. వ్యక్తిగత పరిశుభ్రత పాటించండం’టూ స్ఫూర్తి నింపుతున్నారు. ఈ లిస్టులో తాజాగా గ్లోబల్‌ స్టార్‌ ప్రియంక చోప్రా, అందాల భామలు బిపాసా బసు, కృతి కర్బంద కూడా చేరిపోయారు. కరోనాపై అవగాహన కల్పించే నేపథ్యంలో తమదైన రీతిలో వీడియోలు రూపొందించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ప్రస్తుతం ఆ వీడియోలు కాస్తా వైరల్‌గా మారాయి.కరోనా.. కరోనా.. ప్రస్తుతం ఎవరి నోట విన్నా ఇదే మాట! రోజురోజుకీ కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. మన చుట్టూ ఉన్న వాళ్లు కనీసం తుమ్మినా, దగ్గినా అది కరోనా వల్లనేమో అనే ఆలోచనే ముందుగా మన మనసులోకొస్తోంది. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మన దేశంలో కూడా రోజురోజుకీ పెరుగుతుండడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ ఈ వైరస్‌ పట్ల అవగాహన తెచ్చేందుకు ప్రభుత్వాలు వివిధ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో పలు స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రముఖ సెలబ్రిటీలు సైతం కరోనా వైరస్‌ పట్ల ప్రజల్లో అవగాహన పెంచేందుకు సామాజిక మాధ్యమాలను వేదికలుగా చేసుకుంటున్నారు. వివిధ పోస్టులు, వీడియోలను షేర్‌ చేస్తూ ‘కరోనాకు భయపడద్దు.. వ్యక్తిగత పరిశుభ్రత పాటించండం’టూ స్ఫూర్తి నింపుతున్నారు. ఈ లిస్టులో తాజాగా గ్లోబల్‌ స్టార్‌ ప్రియంక చోప్రా, అందాల భామలు బిపాసా బసు, కృతి కర్బంద కూడా చేరిపోయారు. కరోనాపై అవగాహన కల్పించే నేపథ్యంలో తమదైన రీతిలో వీడియోలు రూపొందించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ప్రస్తుతం ఆ వీడియోలు కాస్తా వైరల్‌గా మారాయి.

Know More

women icon @teamvasundhara

నువ్వు నా పక్కనుంటే.. నన్ను నేను ఎక్కువ ఇష్టపడతాను..!

‘వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ..’ అన్న డైలాగును మన తెలుగు ప్రేక్షకులు ఇంకా గుర్తుపెట్టుకున్నారంటే.. తెరపై ఆ సన్నివేశాన్ని అంత బాగా పండించిన జెనీలియా గొప్పతనమే..! బాలీవుడ్‌ నటుడు రితేశ్‌ దేశ్‌ముఖ్‌ను ప్రేమించి పెళ్లాడిన ఈ భామ.. పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్‌ ఇచ్చి పూర్తి సమయాన్ని కుటుంబానికే కేటాయించింది. జెనీలియా సినిమాలకు దూరంగా ఉన్నా సోషల్‌ మీడియాలో మాత్రం చురుగ్గా ఉంటుంది. ఈ క్రమంలో, జెనీలియా-రితేశ్‌ల మొదటి సినిమా ‘తుఝే మేరీ కసమ్‌’ విడుదలై ఈ జనవరి 3కి సరిగ్గా 17ఏళ్లయింది. ఈ సందర్భంగా ఆ సినిమా టైటిల్‌ సాంగ్‌కు తాము సరదాగా డ్యాన్స్‌ చేస్తోన్న వీడియోలను జెనీలియా తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ‘మా ఇద్దరి మొదటి సినిమా పంచిన ఆనందాన్ని పదిహేడేళ్ల తర్వాత మళ్లీ ఆస్వాదిస్తున్నాం’ అంటూ తన సంతోషాన్ని వ్యక్తపరచింది జెన్నీ.

Know More

women icon @teamvasundhara

నెగెటివిటీని వదిలేయండి.. అందరి పట్ల ప్రేమగా మెలగండి!

ప్రతి ఒక్కరూ కొత్తేడాదికి కోటి ఆశలతో ఆహ్వానం పలుకుతారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు మిన్నంటిన ఈ వేళ సామాన్యుల దగ్గర్నుంచి సెలబ్రిటీల దాకా అందరూ న్యూ ఇయర్‌ జోష్‌లో మునిగితేలుతున్నారు. ఈ క్రమంలో అందరూ తమ కొత్త సంవత్సర వేడుకల్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకోవడం పరిపాటే. ఇందుకు సెలబ్రిటీలూ అతీతం కాదు. కొత్త ఏడాదికి స్వాగతం పలకడానికి వివిధ ప్రాంతాలకు, దేశాలకు చెక్కేసిన కొందరు సెలబ్రిటీలు తమదైన రీతిలో న్యూ ఇయర్‌కు స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలోనే కొందరు సినీ ప్రముఖులు ఫ్యాన్స్‌కు కొత్త ఏడాది శుభాకాంక్షలు చెబుతూ.. వారి సెలబ్రేషన్స్‌ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు.

Know More

women icon @teamvasundhara

నిన్న ‘సామజవరగమన’ అన్నారు.. నేడు ‘రాములో రాములా..’అంటున్నారు!

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తదుపరి చిత్రం ‘అల వైకుంఠపురంలో’లోని పాటలు సినీ సంగీత ప్రియుల్ని ఎంతగా అలరిస్తున్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ చిత్రంలోని మొదటి పాట ‘సామజవరగమన’ ప్రస్తుతం ప్రతి ఒక్కరి నోటిలో నానడమే కాదు.. అనతికాలంలోనే యూట్యూబ్‌లో 100 మిలియన్‌ వ్యూస్‌ సంపాదించుకుంది. ఈ క్రమంలో ఇదే సినిమాలోని మరో అద్భుతమైన మాస్‌ పాట ‘రాములో..రాములా..’కి కూడా తాజాగా యూట్యూబ్‌లో 100 మిలియన్‌ వ్యూస్‌ రావడం విశేషం.. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2020, జనవరి 12న విడుదల కాబోతుంది.

Know More

women icon @teamvasundhara

‚ ¦ÇŸµ¿u-ÅŒÂ¹× ƒ¢Âà ®ÏŸ¿l´¢’à ©äÊÕ..!

åX@Áxªá \œÄC X¾Üª½h-ªá¢-Ÿ¿¢˜ä ÍéÕ.. ¹×{Õ¢¦ ®¾¦µ¼Õu© ÊÕ¢* ¦¢Ÿµ¿Õ-«Û© «ª½Â¹Ø Æ¢Åà ¬ÁÙ¦µ¼-„ê½h ‡X¾Ûpœ¿Õ Æ¢C-²Äh«Û? Æ¢{Ö Æœ¿-’¹œ¿¢ ®¾£¾Ç•¢. ƒ©Ç¢-šËN «ÕÊê Âß¿Õ.. 宩-“G-šÌ-©Â¹× Â¹ØœÄ ‡Ÿ¿Õ-ª½-«Û-ÅÃ-§ŒÕ{. ƒŸä N†¾-§ŒÖEo „ç©x-œË-²òh¢D œ¿®Ôˆ ¦ÖušÌ G¤Ä²Ä ¦®¾Õ. ¹ª½ºý ®Ï¢’û “’î«-ªýÅî ‚„çÕ N„ã¾Ç¢ •JT \œÄC X¾Üª½h-ªá¢C. ƒšÌ-«©ä N„ã¾Ç „ÃJ¥-Âî-ÅŒq-„ÃEo ͌¹ˆšË {ÖªýÅî 宩-“¦äšü Í䮾Õ-¹עD •¢{. ¹×{Õ¢¦ ®¾¦µ¼Õu©Õ, ¦¢Ÿµ¿Õ-«Û©Õ XÏ©x© ’¹ÕJ¢* Æœ¿Õ-’¹Õ-ŌկÃo.. ƒX¾pšðx ŸÄE ’¹ÕJ¢* ‚©ð-*¢-ÍÃ-©-ÊÕ-Âî-«-˜äx-Ÿ¿¢-šð¢D ®¾Õ¢Ÿ¿J.. 'XÏ©x-©ÊÕ Â¹Ê-œÄ-EÂË Åí¢Ÿ¿êª¢ ©äŸ¿Õ. ŸÄE-¹¢˜ä «á¢Ÿ¿Õ „äÕNÕ-Ÿ¿lª½¢ ¹L®Ï ƒ¢Âî¾h ®¾«Õ-§ŒÖEo ’¹œ¿-¤Ä-©-ÊÕ-¹ע-{Õ¯Ão¢. ‡¢Ÿ¿Õ-¹¢˜ä ŠÂ¹-²ÄJ XÏ©x©Õ X¾ÛœËÅä „çáÅŒh¢ ®¾«Õ-§ŒÕ-«Õ¢Åà „Ã@Áxê êšÇ-ªá¢-ÍÃLq «®¾Õh¢C. ‚ ÅŒªÃyÅŒ „äÕNÕ-Ÿ¿lª½¢ Š¢{-J’à ’¹œËæX O©Õ¢-œ¿Ÿ¿Õ. Æ¢Ÿ¿Õê ƒX¾Ûpœä O©ãj-ʢŌ ‡Â¹×ˆ« ®¾«Õ-§ŒÖEo ’¹œ¿-¤Ä-©-ÊÕ-¹ע-{Õ¯Ão¢. ƪáÅä ¦¢Ÿµ¿Õ-«Û©Õ, ¹×{Õ¢¦ ®¾¦µ¼Õu©Õ «Ö“ÅŒ¢ „äÕ¢ ‡¢ÅŒ ÅŒyª½’à ¬ÁÙ¦µ¼-„ê½h Æ¢C-²Äh«Ö? ÆE „ä* ֮͌¾Õh-¯Ãoª½Õ. «áÈu¢’à «Ö Æ«ÕtÂË «ÕÊ-«-ªÃ©Õ ÂÄÃ-©E ÂîJ¹. O©ãj-ʢŌ ÅŒyª½’à «ÕÊ-«-ªÃ-LE ƒ«y-«ÕE Íç¦Õ-Ōբ-{Õ¢C..Ñ Æ¢{Ö ÅŒÊ «ÕÊ-®¾Õ-©ðE «Ö{ ¦§ŒÕ-{-åX-šËd¢-ŸÄ„çÕ. 2015©ð Nœ¿Õ-Ÿ¿-©ãjÊ '‡©ð¯þÑ *“ÅŒ¢ ÅŒªÃyÅŒ «Õêª ƒÅŒª½ ®ÏE-«Ö©Õ ŠX¾Ûp-Âî-©äŸ¿Õ G¤Ä²Ä. DE ’¹ÕJ¢* Íç¦ÕÅŒÖ ƒX¾p-šË-«-ª½Â¹Ø ‡¯îo ¹Ÿ±¿©Õ N¯Ão.. ÅŒÊ «ÕÊ-®¾ÕÂ¹× £¾ÇÅŒÕh-Â¹×¯ä “®ÏˆX¾Ûd ŠÂ¹ˆšË Â¹ØœÄ ªÃ©ä-Ÿ¿E, «æ®h ®ÏE«Ö Í䧌Õ-œÄ-EÂË ‡X¾Ûpœ¿Ö ®ÏŸ¿l´¢-’Ã¯ä …¯Ão-ÊE Íç¦Õ-Åî¢D ¦ã¢’ÃM ¦ÖušÌ.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala