సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

అదే నా ఎనర్జీకి కారణం!

శ్రీముఖి.. బుల్లితెరపై తన మాటల పరవళ్లతో సందడి చేస్తోన్న ఈ స్టార్‌ యాంకర్‌ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. యాంకరింగ్‌లో తనదైన స్టైల్‌, మేనరిజమ్స్‌తో ఇట్టే ఆకట్టుకునే ఈ అందాల తార.. బిగ్‌బాస్‌ రియాల్టీ షోతో ఎనలేని స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. అభిమానులతో ముద్దుగా ‘బుల్లితెర రాములమ్మ’ అని పిలిపించుకునే ఈ ముద్దుగుమ్మ సోషల్‌ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు తన లేటెస్ట్‌ ఫొటోలను షేర్‌ చేసే శ్రీ.. తీరిక దొరికినప్పుడల్లా అభిమానులతో ముచ్చటిస్తుంటుంది. ఈక్రమంలో తాజాగా మరోసారి తన ఫ్యాన్స్‌తో సరదాగా మాట్లాడిందీ ముద్దుగుమ్మ. అభిమానులు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు చెప్పి ఆకట్టుకుంది. మరి, ఈ చక్కనమ్మను అభిమానులు అడిగిన ప్రశ్నలేంటో, వాటికి ఈ స్టార్‌ యాంకర్‌ ఇచ్చిన సమాధానాలేంటో మీరే చూడండి.

Know More

women icon @teamvasundhara

మా ఇద్దరి మధ్య ఉన్నది అదే..!

అప్పటి వరకూ వారిద్దరూ కేవలం కొంతమందికి మాత్రమే తెలుసు. ఒకరు వెండితెరపై సందడి చేస్తే, మరొకరు తెర వెనుక తనదైన శైలిలో పాటలు పాడుతూ యువతను హుషారెక్కించారు. ‘బిగ్‌బాస్‌’ ముందు వరకూ ఒకరి గురించి మరొకరికి పరిచయమే లేదు. అలాంటి వాళ్లు కలిసి ఒకే ఇంట్లో కొన్ని రోజులు ఉన్నారు. కేవలం ఉండటమే కాదు.. ఇటు బుల్లితెర ప్రేక్షకులకు అటు నెటిజన్లకు కావాల్సినంత వినోదాన్ని పంచారు. వాళ్లే గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌.. నటి పునర్నవి భూపాలం. తమ కెమిస్ట్రీతో ‘బిగ్‌బాస్‌3’లో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. అంతేకాదు, అగ్ర కథానాయకులు చిరంజీవి, నాగార్జునలతో శభాష్‌ అనిపించారు. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి తమ సినీ కెరీర్‌, ఎదుర్కొన్న ఒడుదొడుకులు, ఆనందపడ్డ క్షణాలు ఇలా ఎన్నో అనుభూతులను పంచుకున్నారు.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala