సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

గొడవ పడ్డాం.. ఎంత ట్రై చేసినా మాట్లాడడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

మన ‘ఛోటీ బహూ’ బిగ్‌బాస్‌ విన్నరైంది!

బిగ్‌బాస్‌.. ఈ టీవీ కార్యక్రమానికి ఉన్న పాపులారిటీ, ప్రత్యేకతే వేరు! వివిధ భాషల్లో ప్రసారమవుతోన్న ఈ షోకు విపరీతమైన జనాదరణ ఉంది. ఏటా ఓ సీజన్‌తో మన ముందుకొస్తోన్న ఈ టీవీ షో.. ఏ భాషలో ప్రసారమైనప్పటికీ అందరి కళ్లూ విజేత ఎవరవుతారన్న ఆతృతతోనే ఎదురుచూస్తుంటాయి. అలా ఈసారి హిందీ బిగ్‌బాస్‌-14 విజేతగా నిలిచింది టీవీ నటి రుబీనా దిలాయిక్‌. ప్రపంచంతో సంబంధం లేకుండా 143 రోజుల పాటు బిగ్‌బాస్ హౌస్లో గడిపిన ఆమె.. తన పెర్ఫార్మెన్స్‌తో ఇతర కంటెస్టెంట్స్కి గట్టి పోటీ ఇచ్చింది. అందుకే ఈ సీజన్‌ విజేతగా నిలిచి ట్రోఫీతో పాటు రూ. 36 లక్షల నగదు బహుమతిని సొంతం చేసుకుంది. మరి, షో ఆద్యంతం తన క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో, పోటీతత్వంతో అలరించిన రుబీనా గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

అనుమానం వచ్చిన వెంటనే టెస్ట్ చేయించుకున్నా.. ఇప్పుడు బాగానే ఉన్నా!

బయటికెళ్తే కరోనా వస్తుందన్న భయం.. ఇంట్లోనే ఉంటే ఓ రకమైన మానసిక ఒత్తిడి.. ప్రస్తుతం చాలామంది ఇదే పరిస్థితిలో ఉన్నారు. ఒకవేళ కరోనా వచ్చినా దాన్నుంచి కోలుకుంటామో, లేదోనన్న టెన్షన్‌తో అనుక్షణం భయపడిపోతున్నారు. కానీ కొంతమంది మాత్రం వారి కొవిడ్‌ అనుభవాలను పంచుకుంటూ నలుగురిలో ధైర్యం నింపుతున్నారు. అలాంటి వారిలో పలువురు నటీమణులు కూడా ఉన్నారు. బాలీవుడ్‌ బుల్లితెర బ్యూటీ శ్వేతా తివారీ కూడా తాజాగా ఈ లిస్ట్‌లో చేరిపోయింది. ఇటీవలే తనకు కొవిడ్‌ నిర్ధారణ అయిందని, అయితే ప్రస్తుతం ఇంట్లోనే స్వీయ ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నానంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ. అంతేకాదు.. ఈ క్రమంలో తాను పాటిస్తోన్న పలు జాగ్రత్తల్ని కూడా పంచుకుంటూ తన ఫ్యాన్స్‌లో స్ఫూర్తి నింపుతోందీ అందాల తార.

Know More

women icon @teamvasundhara

ఈ ‘బిగ్‌బాస్‌’ బ్యూటీ పున్ను ఫ్యాషన్స్‌ చూశారా?

పదిహేడేళ్ల ప్రాయంలోనే వెండితెరపై అడుగుపెట్టింది తెలుగందం పునర్నవి భూపాలం. ‘ఉయ్యాల జంపాల’ చిత్రంలో హీరోయిన్‌ ఫ్రెండ్‌గా తన చలాకీ నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందీ కుర్రది. ఆపై ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’, ‘పిట్ట గోడ’.. వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నా.. ‘బిగ్‌ బాస్‌ - 3’తో ‘యాటిట్యూడ్‌ పున్ను’గా పేరు తెచ్చుకుందీ ముద్దుగుమ్మ. అయితే బిగ్‌బాస్‌ టైటిల్‌ గెలవకపోయినా తన బ్యూటిఫుల్‌ లుక్స్‌తో కుర్రకారు మతిపోగొట్టింది. ప్రస్తుతం ‘సైకిల్‌’, ‘ఒక చిన్న విరామం’ వంటి సినిమాలతో మన ముందుకు రానున్న పున్ను.. సోషల్‌ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలోనే తన సినిమా కబుర్లతో పాటు తాను ధరించిన లేటెస్ట్‌ ఫ్యాషన్స్‌కి సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు పోస్ట్‌ చేస్తుంటుందీ బిగ్‌ బాస్‌ బ్యూటీ. ఇలా తనదైన ఫ్యాషన్‌ సెన్స్‌తో నేటితరం అమ్మాయిలకు ఫ్యాషన్‌ ఐకాన్‌గా నిలుస్తోన్న పున్ను వార్డ్‌రోబ్‌లో ఎలాంటి డిఫరెంట్‌ ఫ్యాషన్‌ స్టైల్స్‌ ఉన్నాయో ఈ వారం ప్రత్యేకంగా తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

నా ఆవేదనను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా!

సెలయేరు లాంటి మాటల పరవళ్లతో సందడికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారి, తెలుగువారి మనసులో సుస్థిర స్థానం సంపాదించుకుంది స్టార్‌ యాంకర్‌ శ్రీముఖి. యాంకరింగ్‌లో తనదైన స్టైల్‌, పంచ్‌లు, మేనరిజమ్స్‌తో అందరినీ ఇట్టే ఆకట్టుకునే ఈ అందాల తార..బిగ్‌బాస్‌ -3 రియాల్టీ షో తో మరింత క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఈనేపథ్యంలో బుల్లితెర ‘రాములమ్మ’ను కలవాలని, మాట్లాడాలని ఆమెతో ఫొటో దిగాలని చాలామంది అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. కొందరైతే ఏకంగా ఆమె ఇంటివద్దే గంటల తరబడి వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కొంతమంది అభిమానులు ఆమె ఇంటికి వచ్చి ఫొటో దిగాలని అడగడంతో కాస్త అసహనానాకి గురైంది శ్రీముఖి. అయితే ఈ ఘటన జరిగిన వెంటనే ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ వేదికగా తన ఆవేదన వ్యక్తం చేసింది. తన తనకు ప్రైవసీ ఉంటుందని, అర్థం చేసుకోవాలని, తన మనసులోని మాటలను అభిమానులతో షేర్‌ చేసుకుందీ లవ్లీ యాంకర్‌.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

మీ సమస్యను బట్టి మీ ఇద్దరి మధ్య మానసికంగా అనుబంధం దృఢపడినట్లు అనిపించడం లేదు. మీరిద్దరూ ఒకరికొకరు అలవాటు పడే క్రమంలోనే తగాదాలు, గొడవలు వస్తున్నాయి. ప్రస్తుతం మీ ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేవని స్పష్టంగా చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ఇరు కుటుంబ సభ్యులతో మీ విషయం గురించి చర్చించారా? అతను ప్రతి విషయాన్ని తన తండ్రి దగ్గరకు తీసుకెళ్తుంటే అది మీకు నచ్చట్లేదన్న విషయాన్ని అతనికి అర్థమయ్యే విధంగా చెప్పారా? ఎనిమిది నెలల సాన్నిహిత్యంలో కేవలం పోట్లాడుకున్న సందర్భాలే ఉన్నాయా? ఆనందంగా గడిపిన క్షణాలు కూడా ఉన్నాయా? వంటి విషయాలన్నింటినీ మీరు ఓసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.

పెళ్లి చేసుకునే విషయంలో ఎలాగైతే తొందరపాటు పనికిరాదో.. విడిపోయే విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
ఈ క్రమంలో- మీ నాన్న గారు ఫోన్ చేస్తే మీ మామగారు తర్వాత మాట్లాడదామన్నారని చెప్పారు. మీ భర్త కూడా మీతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్లతో మాట్లాడడానికి మళ్లీ ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పటికీ స్పందన లేకపోతే మీ కుటుంబంలోని ఇతర పెద్దలతో కలిసి డైరెక్ట్ గా వాళ్ళింటికే వెళ్లి మాట్లాడి చూడండి. ఇందుకోసం మీ రెండు కుటుంబాల్లోనూ మీ సంక్షేమం కోరే మీ శ్రేయోభిలాషుల సహకారం తీసుకోవచ్చు.
ఈ విధంగా - మీ ఇరుపక్షాల పెద్దవాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకుని మీ సమస్యను సామరస్యంగా పరిష్కరించే పరిస్థితులను కల్పించగలుగుతారేమో చూడండి. అయితే అది ఎంతవరకు సఫలమవుతుందనేది రెండువైపుల నుంచి లభించే సహకారం పైనే ఆధారపడి ఉంటుంది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే - ఇతర మార్గాల ద్వారా ప్రయత్నించాల్సి వస్తుందేమో అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు.
0 Likes
Know More

Movie Masala