ఈ అలవాట్లే పొట్ట చుట్టూ కొవ్వును కరిగిస్తాయట!
మనకు నచ్చిన ఆహారం తీసుకోవడం, మొబైల్ మాయలో పడిపోయి ఏ అర్ధరాత్రికో పడుకోవడం, వ్యాయామం చేయడానికి బద్ధకించడం.. మన జీవనశైలిలో వచ్చే ఈ మార్పులే పొట్ట చుట్టూ కొవ్వు (బెల్లీ ఫ్యాట్) పేరుకుపోవడానికి కారణమవుతున్నాయంటున్నారు నిపుణులు. నిజానికి మనలో చాలామంది దీన్ని నిర్లక్ష్యం చేస్తారు కానీ.. ఇది మన శరీరంలో ఇన్సులిన్‌ను నిరోధించి మధుమేహం ముప్పును పెంచుతుంది. అంతేకాదు.. గుండె సంబంధిత సమస్యలకూ దారితీస్తుందట! అందుకే ఈ సమస్య తలెత్తకుండా చూసుకోవడం లేదంటే ఆ కొవ్వును త్వరగా కరిగించుకోవడం మంచిదని చెబుతున్నారు నిపుణులు. అయితే ఇందుకు పెద్దగా కష్టపడక్కర్లేదని, మన రోజువారీ అలవాట్లతోనే బెల్లీ ఫ్యాట్‌ను సులభంగా కరిగించుకోవచ్చని సలహా ఇస్తున్నారు. మరి, ఇంతకీ ఆ అలవాట్లేంటో తెలుసుకుందాం రండి..
Know More