ఇప్పుడు ‘XS’ సైజ్‌ని ఎంజాయ్ చేస్తున్నా!
మనం వేసుకునే దుస్తుల విషయంలోనే కాదు.. మన శరీరాకృతి గురించి కూడా నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకోవడం అప్పుడసప్పుడూ మనం వింటూనే ఉంటాం. ఇక సోషల్ మీడియా వచ్చిన దగ్గర్నుంచి ఆన్‌లైన్‌లోనూ ఇలాంటి విమర్శలకు తావే లేకుండా పోతోంది. సామాజిక మాధ్యమాల్లో ఏదైనా ఫొటో పోస్ట్ చేస్తే చాలు.. డ్రస్ బాలేదని ఒకరు, లావుగా ఉందని మరొకరు, ఛాయ తక్కువగా ఉందని ఇంకొకరు.. ఇలా మనల్ని ఇబ్బంది పెట్టే కామెంట్లు చాలానే వస్తుంటాయి. ఒకానొక సమయంలో ఇలాంటి విమర్శలు తనకూ తప్పలేదంటోంది బాలీవుడ్ అందాల భామ అవికా గోర్. ‘బాలికా వధూ’ (తెలుగులో ‘చిన్నారి పెళ్లికూతురు’) సీరియల్‌తో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించిన ఈ ముంబై భామ.. ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆపై ‘లక్ష్మీ రావే మా ఇంటికి’, ‘సినిమా చూపిస్త మావ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడ’.. వంటి సినిమాలతో మెప్పించిన ఈ అందాల రాశి.. గతేడాది ‘రాజు గారి గది - 3’తో మన ముందుకొచ్చింది. ఇలా కేవలం తన నటనతోనే కాదు.. సోషల్ మీడియా పోస్టులతోనూ తన ఫ్యాన్స్‌కు ఎప్పుడూ టచ్‌లోనే ఉంటుందీ ముద్దుగుమ్మ. ఈ క్రమంలో ఒకప్పుడు బొద్దుగుమ్మగా ఉన్న తాను స్లిమ్మీ బ్యూటీగా ఎలా మారింది? లావుగా ఉన్న సమయంలో తానెదుర్కొన్న విమర్శలు, తన వెయిట్ లాస్ సీక్రెట్స్.. వంటి విషయాలను సోషల్ మీడియా పోస్టుల ద్వారా, పలు ఇంటర్వ్యూల్లో భాగంగా పంచుకుంటూ నేటి తరం మహిళలందరిలో స్ఫూర్తి నింపిందీ బబ్లీ గర్ల్. అవే విషయాలను తన ‘ఫ్యాట్ టు ఫిట్’ స్టోరీలో భాగంగా మరోసారి మనతో పంచుకోవడానికి ఇలా మన ముందుకొచ్చిందీ లవ్లీ గర్ల్.
Know More