ఈ బంధం ‘అల్లు’కొని తొమ్మిదేళ్లయింది..!
టాలీవుడ్‌కి సంబంధించి ప్రేమ వివాహం చేసుకున్న సెలబ్రిటీ జంటల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్నేహల జంట కూడా ఒకటి. కొన్ని సంవత్సరాల క్రితం ఒక పెళ్లి వేడుకలో తొలిసారి కలుసుకున్నారీ లవ్లీ కపుల్. అలా తమ మధ్య ఉన్న స్నేహబంధం ప్రేమగా మారి.. పెళ్లికి దారి తీసింది. 2011, మార్చి 6న బన్నీ-స్నేహ దంపతులు ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. వీరికి అయాన్, అర్హ అనే ఇద్దరు పిల్లలున్నారు. బన్నీకి తన కుటుంబమంటే ప్రాణం. తను వృత్తిగతంగా ఎంత బిజీగా ఉన్నా.. కుటుంబానికి తగిన సమయాన్ని కేటాయిస్తుంటాడు. పండగలు, పుట్టినరోజులు, ప్రత్యేక సందర్భాలను భార్యాపిల్లలతో కలిసి జరుపుకొంటుంటాడు. బన్నీ, స్నేహల వివాహం జరిగి నేటికి తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా తన భార్యకు పెళ్లిరోజు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో ఓ ప్రత్యేక పోస్టు పెట్టాడు మన స్టైలిష్ స్టార్.
Know More