సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

మేం చేసిన ఈ వంటకాలు మీరూ ట్రై చేస్తారా?

ఎప్పుడూ షూటింగ్స్‌ అంటూ బిజీబిజీగా గడిపే మన సినీ తారలకు లాక్‌డౌన్‌ పుణ్యమా అని బోలెడంత ఖాళీ సమయం దొరికింది. ఈ క్రమంలో సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు టచ్‌లో ఉంటూనే.. తమ కోసం, తమ కుటుంబం కోసం సమయం కేటాయిస్తున్నారు చాలామంది ముద్దుగుమ్మలు. ఈ క్రమంలో కొందరు కొత్త నైపుణ్యాలను అలవర్చుకుంటుంటే.. మరికొందరు తమ పాకశాస్త్ర నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు. అందులో భాగంగా వివిధ వంటకాలు చేస్తూ.. సోషల్‌ మీడియా వేదికగా వాటిని తమ అభిమానులతో కూడా పంచుకుంటున్నారు. మరి, ఈ క్వారంటైన్‌ సమయంలో ఎవరెవరు ఏయే వంటకం చేశారో చూసేద్దామా?

Know More

women icon @teamvasundhara

సొగసు చూడతరమా..!

నవంబర్‌ 3న ‘ఫిలింఫేర్‌ గ్లామర్‌ అండ్‌ స్టైల్‌ అవార్డుల’ వేడుక ముంబైలో కన్నుల పండువగా జరిగింది. ఈ వేడుకకు పలువురు బాలీవుడ్‌ తారలు హాజరయ్యారు. ఫ్యాషనబుల్‌ దుస్తులతో కళ్లు చెదిరే అందాలతో బీ-టౌన్‌ నటీమణులు రెడ్‌ కార్పెట్‌పై తళుక్కుమన్నారు. ఏడాదంతా ఫ్యాషన్‌, స్టైల్‌ విభాగాల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటీనటులకు అవార్డులను అందజేసింది ఫిలింఫేర్‌. ఈ వేడుకలో అనుష్కా శర్మ, అలియా భట్‌, అనన్యా పాండే, కియారా అడ్వాణీ, మలైకా అరోరా, కృతి సనన్‌, దియా మీర్జా.. తదితరులు సందడి చేశారు. మరి ఫ్యాషన్‌, స్టైల్‌ విభాగాల్లో విజేతలుగా నిలిచిన నటీనటులెవరో మీరే చూడండి.

Know More

women icon @teamvasundhara

ఈ ప్రకటనతో గూగుల్‌ ట్రెండ్స్‌లో టాప్‌లో ఉన్న తారక్‌ తార..!

తన సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన దర్శకధీరుడు.. ‘రాజమౌళి’. ఇప్పటివరకు ఆయన తీసిన సినిమాల్లో ఏ ఒక్కటీ కూడా ఫ్లాప్‌ కాలేదంటే.. సినిమాను చెక్కడంలో ఈ జక్కన్న ఎంతటి ఘనుడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా రాజమౌళి రూపొందించిన ‘బాహుబలి’ సిరీస్‌ సృష్టించిన సంచలనాలు, అందుకున్న గౌరవాలు అన్నీ.. ఇన్నీ.. కావు. ఈ సినిమాలు భారత చలన చిత్ర నిర్మాణ విలువలను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ‘బాహుబలి’ సక్సెస్‌ తర్వాత ఆయన రూపొందించే తదుపరి చిత్రం ఎలా ఉండబోతోందోనని తెలుగుతో పాటు.. జాతీయ, అంతర్జాతీయ సినీ అభిమానులు సైతం ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తోన్న చిత్రమే ‘RRR’. మాస్‌ హీరోలుగా వెలుగొందుతోన్న రామ్‌ చరణ్‌, జూ.ఎన్టీఆర్‌లు ఇందులో లీడ్‌రోల్స్‌ పోషిస్తోన్న సంగతి విదితమే. ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించేందుకు కొంతమంది అంతర్జాతీయ నటీనటులను సైతం రంగంలోకి దింపుతున్నాడు జక్కన్న. వీళ్లకు సంబంధించిన ఫస్ట్‌లుక్స్‌ని తాజాగా సోషల్‌ మీడియాలో విడుదల చేశారు. వీరిలో తారక్‌ సరసన హీరోయిన్‌గా కనిపించనున్న హాలీవుడ్‌ భామ ‘ఒలీవియా మోరీస్‌’ ఫస్ట్‌లుక్‌ కూడా ఉండడం విశేషం. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Know More

women icon @teamvasundhara
psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala