అలియా, అనన్య...అప్నా టైం ఆగయా!
భారతీయ సినిమా పరిశ్రమలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. బాలీవుడ్‌కు చెందిన దిగ్గజ నటీనటులు, దర్శక నిర్మాతల సమక్షంలో విజేతలు అవార్డులు అందుకున్నారు. 65వ ఫిలింఫేర్ ప్రదానోత్సవ వేడుకలను అస్సోంలోని గువహటిలో శనివారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇక కార్యక్రమంలో భాగంగా రణ్వీర్ సింగ్, కార్తిక్ ఆర్యన్, మాధురీ దీక్షిత్ తమ డ్యాన్సులతో అతిథులను అలరించగా, మరికొందరు ముద్దుగుమ్మలు రెడ్ కార్పెట్‌పై తళుక్కుమన్నారు. మరి ఈ ఏడాదికిగాను ఫిలింఫేర్ అవార్డులు అందుకున్న సినిమాలు, తారలు, ఇతర సాంకేతిక నిపుణులెవరో చూద్దాం రండి.
Know More