సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

ఈ సెలబ్రిటీలందరూ కరోనాను జయించిన వారే!

కనికరం లేకుండా విరుచుకుపడుతోన్న కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. పేద-ధనిక, ఆడ-మగ, చిన్నా-పెద్దా... ఈ తేడాలేవీ చూడకుండా అందరినీ బలి తీసుకుంటోంది. ఈ క్రమంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే... సామాన్యులే కాదు... పలువురు సెలబ్రిటీలు కూడా ఈ వైరస్‌ బారిన పడుతున్నారు. అయితే ఇంకా మందు లేని ఈ మహమ్మారిని చాలామంది మనోధైర్యంతో జయిస్తున్నారు. సరైన సమయంలో వైద్యం తీసుకుని వైరస్‌పై విజయం సాధిస్తున్నారు. తాజాగా కరోనా బారిన పడ్డ తమన్నా కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయింది. ఈ క్రమంలో కరోనా నుంచి కోలుకుని ఆ అనుభవాలను అందరితో షేర్ చేసుకున్న కొందరి ప్రముఖుల గురించి తెలుసుకుందాం రండి...

Know More

women icon @teamvasundhara

మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను!

అమ్మ మనకు పాలిచ్చి పెంచితే నాన్న లాలించి నడక నేర్పిస్తాడు. తన చిటికెన వేలితో చిన్న చిన్న అడుగులు వేయించి ఆకాశమంత ఎత్తు ఎదిగేలా చేస్తాడు. అందుకే చాలామంది కూతుళ్లు తాము ‘డాడీస్ గర్ల్స్‌’ అంటూ గర్వంగా చెప్పుకొంటుంటారు. ఇందుకు సెలబ్రిటీలు కూడా అతీతులేమీ కాదు. ఈ క్రమంలో తన తండ్రి అంటే ఎంత ప్రేమో మరోసారి గుర్తు చేసుకుంది అందాల సుందరి ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌. తన తండ్రి మరణానంతరం ఆయన జయంతిని ఏటా అనాథ పిల్లలతో కలిసి జరుపుకుంటోందీ ముద్దుగుమ్మ. ఈ సంవత్సరం కూడా అతే పంథాను అనుసరించి అనాథ పిల్లలతో సరదాగా గడిపింది.

Know More

women icon @teamvasundhara

ÆŸí¹ X¶¾Fo «â„çÕ¢šü..!

†¾àšË¢’ûq •ª½Õ-’¹Õ-ÅŒÕ-Êo-X¾Ûpœ¿Õ ÂíEo ÅŒ«Ö³Ä ®¾¢X¶¾Õ-{-Ê©Õ Íî{Õ-Íä-®¾Õ-Âî-«œ¿¢ ®¾£¾Ç-•„äÕ. ƪáÅä '\ C©ü å£jÇ «á†Ïˆ©üÑ *“B-¹-ª½º ®¾«Õ-§ŒÕ¢©ð •J-TÊ ŠÂ¹ ®¾ª½ŸÄ ®¾¢X¶¾Õ-{Ê ’¹ÕJ¢* FL-¹@Áx ®¾Õ¢Ÿ¿J ‰¬Áy-ªÃu-ªÃ-§ýÕ-¦-ÍŒa¯þ ƒšÌ-«©ä ‹ ®¾¢Ÿ¿-ª½s´¢©ð ÍçX¾Ûp-Âí-*a¢C. '†¾àšË¢’û •ª½Õ-’¹Õ-ÅŒÕÊo ®¾«Õ-§ŒÕ¢©ð ‚ªÃŸµ¿u ¯ÃÅî¯ä 定üq©ð …¢œäC. ŠÂ¹-²ÄJ ÆÍŒa¢ ÆGµ-æ†Âú Ÿµ¿J¢Íä Âî{Õ ©Ç¢šË šÇXýÅî, ’¹œ¿f¢Åî Ÿ¿Öª½¢ ÊÕ¢* ÊœË* «²òhÊo ª½ºý-H-ªýÊÕ ÍŒÖ®Ï ‚ªÃŸµ¿u „Ã@Áx ¯ÃÊo ÆÊÕ-ÂíE ®¾¢¦-ª½-X¾-œË-¤ò-ªá¢C. ƢŌ-šËÅî ‚’¹-¹עœÄ X¾ª½Õ-’¹Õ-X¾-ª½Õ-’¹ÕÊ „çRx ª½ºý-H-ªýÊÕ „Ã@Áx ¯ÃÊo ÆGµ-æ†Âú ¦ÍŒa¯þ ÆÊÕ-ÂíE “æX«Õ’à ÂõT-L¢-ÍŒÕ-Âí¢CÑ Æ¢{Ö •J-TÊ X¶¾Fo «â„çÕ¢-šüÊÕ X¾¢ÍŒÕ-Âí¢C. '\ C©ü å£jÇ «á†Ïˆ©üÑ ®ÏE-«Ö©ð ª½ºý-Hªý, ‰†ý «ÕŸµ¿u éÂNÕ®ÔZ ¦Ç’à ¹ן¿-ª½-œ¿¢Åî ƒX¾p-šËê ®ÏE«Ö OÕŸ¿ ¦µÇK-²Än-ªá©ð Ƣ͌-¯Ã©Õ …¯Ãoªá. Æ©Çê’ šÌ•-ªý-©ð¯ä ‰†ý ÅŒÊ Æ¢Ÿ¿-ÍŒ¢-ŸÄ-©Åî ‚Â¹-{Õd-¹ע{Ö ®ÏE-«ÖåXj «ÕJ¢ÅŒ ‚®¾ÂËh êªéÂ-Åäh©Ç Íä²òh¢C. ¨ ®ÏE«Ö D¤Ä-«R ÂÃÊÕ-¹’à “æX¹~-¹ש «á¢Ÿ¿ÕÂ¹× ªÃÊÕ¢C.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala