సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

ఆమె భర్తనైనందుకు గర్వపడుతున్నా!

మన పిల్లలు ఏదైనా గొప్ప పనిచేస్తే అమ్మగా గర్వపడతాం.. భర్త విజయంలో వెన్నంటే ఉంటూ భార్యగా గర్వపడతాం. అలాంటిది భార్య సాధించిన విజయాన్ని గొప్పగా చెప్పుకొని మురిసిపోయే భర్తలెంతమంది ఉంటారు..? మహా అయితే అలాంటి వారిని వేళ్ల మీద లెక్కపెట్టచ్చు. ఆ కొద్దిమందిలో తానూ ఒకరని అంటున్నారు భారత మాజీ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు గౌరమాంగి సింగ్‌. ఈ కరోనా ప్రతికూల పరిస్థితుల్లో ముందుండి సేవలందిస్తోన్న తన భార్యను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందని, తాను ఇండియన్‌ జెర్సీ ధరించి.. గొంతెత్తి జాతీయ గీతం పాడుతున్నప్పుడు ఎంతలా పులకరించిపోయానో.. ఇప్పుడూ అదే ఫీలింగ్‌ కలుగుతోందంటున్నాడీ ఫుట్‌బాలర్‌. మరి, ఇంతకీ ఈ స్టార్‌ ప్లేయర్‌ భార్య ఎవరు? ఏం చేస్తుంటారు? తన భర్త గర్వించేలా ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఆమె అందిస్తోన్న సేవలేంటి? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే!

Know More

women icon @teamvasundhara

నా కూతురి నుంచి దూరంగా ఉండేందుకు అదే మంచి మార్గమనిపించింది!

కొన్ని నెలల క్రితం కరోనా విజృంభణ తీవ్రంగా ఉండడంతో వైద్య సేవలు అందించలేక విదేశీయులను తమ సొంత దేశాలకు వెళ్లిపొమ్మంటూ ఇటలీ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అదే సమయంలో అంతర్జాతీయ విమాన సేవలు సైతం నిలిపి వేశారు. దీంతో ఇటలీలో ఉంటోన్న భారతీయులు దిక్కుతోచని స్థితిలో సతమతమయ్యారు. మరికొన్ని రోజులు అక్కడే ఉంటే తాము కూడా కరోనాకు బలవుతామనే భయంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కాలాన్ని గడిపారు. ఈ క్రమంలో ఇటలీలో చిక్కుకుపోయిన 263 మంది భారతీయులను మన దేశానికి సురక్షితంగా తీసుకొచ్చేందుకు ఓ భారీ బోయింగ్‌ 777 విమానాన్ని సిద్ధం చేసింది ఎయిర్‌ ఇండియా సంస్థ. ఈ విమానానికి సారథ్యం వహించింది ఓ మహిళ. తనే కెప్టెన్ స్వాతి రావల్‌. కరోనా హాట్‌స్పాట్‌గా ఉన్న ఇటలీ లాంటి దేశం నుంచి మన వాళ్లను క్షేమంగా స్వదేశానికి చేర్చి.. రెస్క్యూ ఫ్లైట్‌కు సారథ్యం వహించిన తొలి మహిళా సివిలియన్‌ పైలట్‌గా చరిత్ర సృష్టించిందీ వీరనారి. అప్పటి తన ప్రయాణానికి సంబంధించిన కొన్ని సంఘటనలను ఇటీవల మళ్లీ గుర్తుకు తెచ్చుకుంది స్వాతి. ఈక్రమంలో తన అనుభవాలను షేర్‌ చేసుకుంది. మరి వాటిని ఆమె మాటల్లోనే విందాం రండి..

Know More

women icon @teamvasundhara

ఈ సూపర్‌ మామ్స్‌కి సెల్యూట్‌!

కొన్ని దశాబ్దాల క్రితం వరకు వంటింటికి మాత్రమే పరిమితమైన మహిళలు నేడు అన్ని రంగాల్లో అడుగుపెడుతున్నారు. పురుషులతో సమానంగా అవకాశాలిస్తే రాకెట్లలో రివ్వున ఎగిరి ఆకాశాన్ని కూడా అందుకోగలమని రుజువు చేస్తున్నారు. అంతేనా.. ఇటు ఇంటి బాధ్యతలతో పాటు అటు వృత్తి బాధ్యతలను కూడా సమర్థంగా నిర్వర్తించగలమని నిరూపిస్తున్నారు. అయితే ఈ లాక్‌డౌన్‌ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘వందే భారత్‌’ మిషన్‌లో కూడా ఇద్దరు అమ్మలు భాగస్వాములయ్యారు. ఈ మేరకు ‘మాతృ దినోత్సవం’ సందర్భంగా ప్రముఖ ఎయిర్‌లైన్స్‌ సంస్థ ‘ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌’ ఈ సూపర్‌ మామ్స్‌ సేవలపై ప్రశంసల జల్లు కురిపించింది.

Know More

women icon @teamvasundhara

స్వాతి.. నీ ధైర్యం ఎందరికో స్ఫూర్తి..!

ఒకవైపు కరోనా విజృంభణ తీవ్రంగా ఉండడంతో వైద్య సేవలు అందించలేక విదేశీయులను తమ సొంత దేశాలకు వెళ్లిపొమ్మంటూ ఇటలీ ప్రభుత్వం ఆదేశం.. మరోవైపు అంతర్జాతీయ విమాన సేవలు నిలిపివేత. దీంతో ఇటలీలో ఉంటోన్న భారతీయులు దిక్కుతోచని స్థితిలో సతమతమవుతున్నారు. మరికొన్ని రోజులు అక్కడే ఉంటే తాము కూడా కరోనాకు బలవుతామనే భయంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కాలాన్ని గడుపుతున్నారు. ఈ క్రమంలో ఇటలీలో చిక్కుకుపోయిన 263 మంది భారతీయులను మన దేశానికి సురక్షితంగా తీసుకొచ్చేందుకు ఓ భారీ బోయింగ్‌ 777 విమానాన్ని సిద్ధం చేసింది ఎయిర్‌ ఇండియా సంస్థ. అయితే ఈ విమానానికి సారథ్యం వహించింది ఓ మహిళ. తనే కెప్టెన్ స్వాతి రావల్‌. ప్రస్తుతం కరోనా వ్యాప్తిలో అగ్రస్థానంలో ఉన్న ఇటలీ లాంటి దేశం నుంచి మన వాళ్లను క్షేమంగా స్వదేశానికి చేర్చి.. రెస్క్యూ ఫ్లైట్‌కు సారథ్యం వహించిన తొలి మహిళా సివిలియన్‌ పైలట్‌గా చరిత్ర సృష్టించిందీ వీరనారి.

Know More

women icon @teamvasundhara

Æ«Õt ‚Ê¢Ÿ¿¢ Â¢...!

²ÄŸµÄ-ª½-º¢’à …Ÿîu-’¹-®¾Õn-©Â¹× ÅŒ«Õ NŸµ¿Õ© ÊÕ¢œË Nª½-NÕ¢Íä *«-J-ªîV ‡¢Åî “X¾Åäu-¹-„çÕi¢C. ‚ ªîV ‡¯îo ¦µÇ„î-Ÿäy-’é Êœ¿Õ«Õ ÅŒ«Õ …Ÿîu’¹ ¦ÇŸµ¿u-ÅŒ©Â¹× ®¾y®Ïh Íç¦ÕŌբšÇª½Õ. \ ²Änªá „ÃJéÂj¯Ã ‚ ªîV ‚Ê¢Ÿ¿¢ ¹¢˜ä Â¹ØœÄ ¦ÇŸµ¿ ‡Â¹×ˆ-«’à …¢œ¿œ¿¢ ®¾£¾Ç•¢. ƪáÅä Æ¢Ÿ¿ÕÂ¹× GµÊo¢’Ã ÅŒÊ ÅŒLx J˜ãj-éªt¢šü ªîVÊÕ ÅŒÊ-Âí¹ BXÏ èÇcX¾Â¹¢’à «ÖªÃa-©-ÊÕ-¹עC Æ“PÅŒ *¯þÍŒ¢Â¹ªý. Æ¢Ÿ¿Õ-Â¢ ÅŒÊ ÅŒLx *«-J-²ÄJ’à ‡ªáªý £¾Çôå®d®ý’à ¦ÇŸµ¿u-ÅŒ©Õ Eª½yJh®¾ÕhÊo N«Ö¯ÃEÂË Åïä åXj©˜ãj ²Äª½Ÿµ¿u¢ «£ÏÇ¢-*¢C. N«ÖÊ¢ ©Çu¢œþ Æ«-œÄ-EÂË X¾C ENÕ-³Ä© «á¢Ÿ¿Õ Ưö-¯þq-„çÕ¢šü ®Ï®¾d„þÕ ŸÄyªÃ ÅŒÊ ÅŒLx J˜ãj-éªt¢šü N†¾-§ŒÖEo “X¾§ŒÖ-ºË-¹×-©Â¹× “X¾Â¹-šË¢*¢C. ÆC NÊo„ç¢{¯ä Æ¢Ÿ¿ª½Ö ÍŒX¾p{Õx Â휿ÕÅŒÖ ‚„çÕ ÅŒLxÂË ¬ÁÙ¦µÇ-Ââ¹~©Õ ÅçL-§ŒÕ-èä-¬Çª½Õ. ¨ ®¾¢Ÿ¿-ª½s´¢’à N«Ö-Ê¢-©ðE ®¾£¾Çô-ŸîuT B®ÏÊ OœË§çÖÊÕ šËy{dªý ŸÄyªÃ X¾¢ÍŒÕ-Âí¢{Ö ÅŒÊ ‚Ê¢-ŸÄEo «u¹h¢ Íä®Ï¢C Æ“PÅŒ. ‚ ¤ò®ýdÂ¹× ®¾p¢C®¾Öh ‡¢Åî«Õ¢C ‚„çÕ ÅŒLxÂË ¬ÁÙ¦µÇ-Ââ-¹~©Õ Åç©ÕX¾ÛÅŒÖ, ÅŒÊ ‚©ð-ÍŒÊÊÕ „çÕÍŒÕa-Âí¢{Õ¯Ãoª½Õ.

Know More

women icon @teamvasundhara

X¾{Õd-Ÿ¿©ä ‚ÂÃ-¬Á-X¾Û-{¢ÍŒÕ©Â¹× ÍäJa¢C..!

‹ X¾©ãx-{ÖJ XÏ©x.. ‚ÂÃ-¬Á-X¾Û-{¢-ÍŒÕLo ÅÃÂÃ-©E *Êo-Ōʢ ÊÕ¢* ¹©©Õ ¹¢C.. æXC¢šË XÏ©x«Û FÂ¹× Æ¢ÅŒ åXŸ¿l ¹©©Ç? Æ¢{Ö ÍŒÕ{Öd …Êo-„ê½Õ ‡’¹-ÅÃR Íä®Ï¯Ã.. X¾šËd¢-ÍŒÕ-Âî-¹עœÄ ¹%†Ï Íä®Ï¢C.. ©Â¹~u¢ „çjX¾Û ¯ç«Õt-C’à Ɯ¿Õ-’¹Õ-©ä-®Ï¢C.. ŠÂ¹ˆ «á¹ˆ Â¹ØœÄ ƒ¢Tx†ý ªÃE ²Änªá ÊÕ¢* ƒ¢Tx-†ý©ð ÆÊ-ª½_-@Á¢’à «ÖšÇxœä ²ÄnªáÂË ‡C-T¢C. Æ¢Åä-Âß¿Õ.. X¾Ÿçl-E-NÕ-Ÿä@ÁÙx E¢œ¿-¹ע-œÄ¯ä ÅŒÊ ©Â¹~u-„çÕiÊ ‡ªáªý £¾Çôå®d®ý …Ÿîu-’ÃEo Â¹ØœÄ ®¾¢¤Ä-C¢-*¢C.. ÆD ‡ªáªý ƒ¢œË§ŒÖ «¢šË “X¾A-³Äe-ÅŒt¹„çÕiÊ ®¾¢®¾n©ð.. Eª½Õ-æXŸ¿ ¹×{Õ¢¦¢ ÊÕ¢* «*aÊ ‚„çÕ.. ê«©¢ ƒ¢{-Kt-œË-§ŒÕšü ƪ½|-ÅŒÅî ¨ ²ÄnªáÂË Í䪽Õ-Âî-’¹-L-T¢-Ÿ¿¢˜ä ÆC X¾ÜJh’à ‚„çÕ X¾{Õd-Ÿ¿©, ‚ÅŒt-N-¬Çy®¾¢ «©äx..! X¾{Õd-Ÿ¿©ä …¢˜ä ‡¢ÅŒšË ©Â~Ãu-¯çjo¯Ã ²ÄCµ¢-ÍŒ-«-ÍŒaÊo EèÇEo Eª½Ö-XÏ-®¾ÕhÊo ‚ §Œá«A „çÖEÂà £¾ÇJ-’¹-NL.. «Õ£¾É-ªÃ-†¾ZÂ¹× Íç¢CÊ ¨ Æ«Ötªá å£jÇŸ¿-ªÃ-¦Ç-Ÿþ©ð P¹~º B®¾Õ-ÂíE „çá{d-„çá-Ÿ¿šË ƒ¢{-ª½Öyu-©ð¯ä ‡¢XÏéÂj ‡ªáªý ƒ¢œË§ŒÖ ®¾¢®¾n©ð …Ÿîu’¹¢ ²ÄCµ¢-*¢C. ¨ ®¾¢Ÿ¿-ª½s´¢’à '«®¾Õ¢-Ÿµ¿-ª½.-¯ç-šüÑÅî “X¾Åäu-¹¢’Ã ÅŒÊ Â¹Ÿ±¿ÊÕ X¾¢ÍŒÕ-¹עC..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala