నా కాలు తొలగించే సన్నివేశం చూసి ఒకావిడ కళ్లు తిరిగి పడిపోయింది!
మనోధైర్యం మెండుగా ఉన్న నాట్య ‘మయూరి’ ఆమె. అందుకే 13 ఏళ్లకే ఒంటికాలితో తన జీవితాన్ని అంధకారం చేయాలనుకున్న విధిని సైతం ఎదిరించింది. కష్టాలు, కన్నీళ్లకు కుంగిపోకుండా దృఢ సంకల్పంతో ముందుకు సాగింది. నటిగా, నృత్య కళాకారిణిగా కళలకే తలమానికంలా నిలిచి అశేష అభిమానాన్ని సాధించింది. మొదటి సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్న ఆ అందాల తార మరెవరో కాదు ‘మయూరి’ సుధా చంద్రన్. సుమారు మూడున్నర దశాబ్దాలుగా నటన, నాట్య రంగంలో తనదైన ప్రతిభ చూపుతోన్న ఆమె ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తన సినీ కెరీర్, ఎదుర్కొన్న ఒడిదొడుకులు, ఆనంద క్షణాలు... ఇలా ఎన్నో అనుభూతులను అందరితో పంచుకున్నారు. మరి ఆ ఆసక్తికరమైన విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..
Know More