వందేళ్లు దాటినా.. మానసిక స్థైర్యంతో కరోనాని జయించారు!
చైనాలోని వుహాన్‌లో వూపిరి పోసుకున్న కరోనా వైరస్ ఇప్పుడు భారతదేశంలో ఉగ్రరూపం చూపిస్తోంది. లాక్డౌన్ సడలింపులతో మరింతగా విజృంభిస్తున్న ఈ మహమ్మారి అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ప్రత్యేకించి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉండి, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే వృద్ధులు ఎక్కడ ఈ వైరస్ బారిన పడతామోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అయితే ఆరోగ్యకర జీవనశైలి, నిరంతర అప్రమత్తత, కొద్దిపాటి జాగ్రత్తలు అన్నిటికీ మించి మానసిక స్థైర్యం మెండుగా ఉంటే కరోనానే కాదు ఎలాంటి మహమ్మారినైనా జయిస్తామని కొందరు వృద్ధులు నిరూపిస్తున్నారు. వందేళ్ల వయసు మీద పడినప్పటికీ ప్రమాదకర వైరస్‌పై విజయం సాధిస్తూ అందరికీ బతుకుపై భరోసా కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఇటీవల కరోనా నుంచి కోలుకున్న కొందరు శతాధిక వృద్ధుల గురించి తెలుసుకుందాం రండి...
Know More