హవ్వ... 92 ఏళ్ల ఆస్కార్ చరిత్రలో ‘ఆమె’ ఒక్కరేనా ?
మనకున్న రెండు కళ్లల్లో ఒక కన్ను మూసుకొని మరో కంటితో ప్రపంచాన్ని చూస్తే ఎలా ఉంటుంది ? కష్టం... అలా చూస్తే ఎంతటి అందమైనా మనసుకింపుగా ఉండదు... కదూ ! మరి సృష్టిలో ఒక భాగమైన స్త్రీ, పురుషుల్లో ఎవరో ఒక్కరే మనకు అన్ని విషయాలను చెబుతుంటే... నాణానికి రెండో వైపు ఎవరు చెబుతారు ? మరో కోణంలో ప్రపంచాన్ని ఎలా చూస్తాం ? అమ్మ, నాన్నల్లో ఎప్పుడూ ఏ ఒక్కరి మాటే మనం వినగలమా ? ప్రస్తుతం ఇవే ప్రశ్నలు సంధిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు. అందుకు కారణం... ఇటీవల 92వ ఆస్కార్ ఉత్తమ దర్శకుల నామినేషన్లలో ఏ ఒక్క మహిళా దర్శకురాలి పేరు లేకపోవడమే ! ఆ ఏముంది ? మహిళా దర్శకులెవరూ ఉత్తమ ప్రతిభ కనబరిచి ఉండరులే ! అంటారా ? అయితే మీరు తప్పుగా ఆలోచిస్తున్నట్లే ! ఎప్పుడూ లేనంతగా ఈసారి రికార్డు స్థాయిలో మహిళా దర్శకులు చిత్రాలను తెరకెక్కించారు. వాటిలో సూపర్ హిట్స్, బ్లాక్‌బస్టర్స్ కూడా ఉన్నాయి. మరెందుకు మహిళా దర్శకులకు ఆస్కార్ నామినేషన్ దక్కలేదు ? ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడూ లేనంతగా సినీ అభిమానులు ఈసారి ఎందుకు ఆస్కార్ నామినేషన్లపై అసంతృప్తితో ఉన్నారు ? తెలుసుకుందాం రండి !
Know More