సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

గొడవ పడ్డాం.. ఎంత ట్రై చేసినా మాట్లాడడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

పీసీఓఎస్‌ ఉంటే ఈ సౌందర్య సమస్యలు తప్పవా?!

అందంగా ఉండాలనేది మహిళల ఆరాటం. కానీ ఎంత కాపాడుకున్నా సౌందర్యం విషయంలో ఏదో ఒక సమస్య వచ్చి పడుతూనే ఉంటుంది. ఇందుకు పలు అనారోగ్యాలు కూడా కారణమవుతుంటాయి. పీసీఓఎస్‌ కూడా వీటిలో ఒకటి. ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరు దీంతో బాధపడుతున్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. అంతేకాదు.. దీని కారణంగా నెలసరి సమస్యలు, సంతానలేమితో పాటు మొటిమలు, అవాంఛిత రోమాలు, జుట్టు రాలిపోవడం.. ఇలా అందం పరంగానూ ప్రతికూల ప్రభావం చూపుతోందీ సమస్య. మరి, అసలు పీసీఓఎస్‌ వస్తే సౌందర్య సమస్యలెందుకొస్తాయి? వీటిని దూరం చేసుకోలేమా? తిరిగి అందాన్ని పెంపొందించుకోలేమా? అంటే అది సాధ్యమే అంటున్నారు సౌందర్య నిపుణులు. అదెలాగో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

నెల తప్పినా ప్రెగ్నెన్సీ పరీక్షలో నెగెటివ్ వస్తోందా?

సృజనకు మామూలుగా నెలసరి సరైన సమయానికే వస్తుంటుంది. అయితే ఈసారి నెల దాటినా ఇంకా పిరియడ్‌ రాకపోయేసరికి గర్భం దాల్చానేమో అని టెస్ట్‌ చేసుకుంది.. కానీ ఫలితం మాత్రం నెగెటివ్‌గా వచ్చేసరికి నిరాశపడిపోయిందామె. మృదుల కూడా అంతే! ఈసారి ప్రెగ్నెన్సీ కన్‌ఫర్మ్‌ అవుతుందన్న నమ్మకంతో ఉంది. దీనికి తోడు వికారం, రొమ్ముల్లో నొప్పి కూడా మొదలైంది. ఇవి కచ్చితంగా ప్రెగ్నెన్సీకి సూచనలే అని భావించిన ఆమె ఆనందంతో ఇంట్లోనే పరీక్ష చేసుకుంది. ఫలితం నెగెటివ్‌ రావడంతో తన ఆనందమంతా ఆవిరైంది. ఇలాంటి అనుభవాలు మనలో చాలామందికి ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యే ఉంటాయి. పిరియడ్‌ మిస్సవడం, వికారంగా అనిపించడం, రొమ్ముల్లో నొప్పితో కూడిన అసౌకర్యం.. వంటివి గర్భధారణకు ముందస్తు సూచనలుగా చెబుతున్నారు నిపుణులు. దీంతో ఇవి కనిపించిన వెంటనే ఇంట్లోనే ప్రెగ్నెన్సీ పరీక్ష చేసుకుంటుంటారు చాలామంది. అయితే ఇందులో కొంతమందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినా, ఇంకొంతమందికి మాత్రం గర్భధారణ జరిగినా ఫలితం నెగెటివ్‌గా వస్తుంటుంది. అందుకు ఇతరత్రా అంశాలతో పాటు పరీక్ష చేసుకునే క్రమంలో మనకు తెలియకుండా మనం చేసే కొన్ని పొరపాట్లు కూడా కారణం కావచ్చంటున్నారు వైద్యులు. మరి, అవేంటో తెలుసుకొని సరిదిద్దుకుందాం రండి..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

మీ సమస్యను బట్టి మీ ఇద్దరి మధ్య మానసికంగా అనుబంధం దృఢపడినట్లు అనిపించడం లేదు. మీరిద్దరూ ఒకరికొకరు అలవాటు పడే క్రమంలోనే తగాదాలు, గొడవలు వస్తున్నాయి. ప్రస్తుతం మీ ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేవని స్పష్టంగా చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ఇరు కుటుంబ సభ్యులతో మీ విషయం గురించి చర్చించారా? అతను ప్రతి విషయాన్ని తన తండ్రి దగ్గరకు తీసుకెళ్తుంటే అది మీకు నచ్చట్లేదన్న విషయాన్ని అతనికి అర్థమయ్యే విధంగా చెప్పారా? ఎనిమిది నెలల సాన్నిహిత్యంలో కేవలం పోట్లాడుకున్న సందర్భాలే ఉన్నాయా? ఆనందంగా గడిపిన క్షణాలు కూడా ఉన్నాయా? వంటి విషయాలన్నింటినీ మీరు ఓసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.

పెళ్లి చేసుకునే విషయంలో ఎలాగైతే తొందరపాటు పనికిరాదో.. విడిపోయే విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
ఈ క్రమంలో- మీ నాన్న గారు ఫోన్ చేస్తే మీ మామగారు తర్వాత మాట్లాడదామన్నారని చెప్పారు. మీ భర్త కూడా మీతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్లతో మాట్లాడడానికి మళ్లీ ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పటికీ స్పందన లేకపోతే మీ కుటుంబంలోని ఇతర పెద్దలతో కలిసి డైరెక్ట్ గా వాళ్ళింటికే వెళ్లి మాట్లాడి చూడండి. ఇందుకోసం మీ రెండు కుటుంబాల్లోనూ మీ సంక్షేమం కోరే మీ శ్రేయోభిలాషుల సహకారం తీసుకోవచ్చు.
ఈ విధంగా - మీ ఇరుపక్షాల పెద్దవాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకుని మీ సమస్యను సామరస్యంగా పరిష్కరించే పరిస్థితులను కల్పించగలుగుతారేమో చూడండి. అయితే అది ఎంతవరకు సఫలమవుతుందనేది రెండువైపుల నుంచి లభించే సహకారం పైనే ఆధారపడి ఉంటుంది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే - ఇతర మార్గాల ద్వారా ప్రయత్నించాల్సి వస్తుందేమో అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు.
0 Likes
Know More

Movie Masala