సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

కరోనా కథలు: తనకు దూరంగా ఉండడం నా వల్ల కావట్లేదు.. అయినా తప్పట్లేదు!

తల్లి ఒడి బుజ్జాయిలకు పూలపాన్పు వంటిది.. తల్లి ప్రేమ వారికి కొండంత అండ.. అందుకే చిన్నారులు మెలకువతో ఉన్నా, నిద్ర పోయినా.. అమ్మను అంటిపెట్టుకునే ఉంటారు. రాత్రుళ్లు మధ్యలో లేచినా అమ్మ పక్కన ఉంటే ఆదమరిచి మళ్లీ నిద్రలోకి జారుకుంటారు. అదే తన తల్లి పక్కన లేకపోతే గుక్కపట్టి ఏడుస్తుంటారు. ప్రస్తుతం తను పక్కన లేని తన కూతురి పరిస్థితీ ఇలాగే ఉందంటోంది ఓ మహిళ. కరోనా బారిన పడి ప్రస్తుతం చికిత్స తీసుకుంటూ స్వీయ నిర్బంధంలో ఉన్న ఆమె.. తన కూతురిని కిటికీలో నుంచి చూస్తూ మురిసిపోవాల్సి వస్తుందని చెబుతోంది. తనలాంటి పరిస్థితి మరే తల్లికీ రాకూడదంటూ బరువెక్కిన హృదయంతో తన కథను పంచుకోవడానికి ఇలా మన ముందుకొచ్చింది.

Know More

women icon @teamvasundhara

లాక్‌డౌన్‌లో మన మిల్కీ బ్యూటీ ఏం చేస్తోందో చూశారా?

మిల్కీ బ్యూటీ.. ఈ పేరు వినగానే మన కళ్ల ముందు కదలాడే పాలరాతి శిల్పం తమన్నా కాక ఇంకెవరు..! తన అందం, అభినయంతో టాలీవుడ్‌లోనే కాదు.. బాలీవుడ్‌లోనూ గుర్తింపు తెచ్చుకుంది తమ్మూ. పాత్రల ఎంపికలో పర్‌ఫెక్ట్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. ఫిట్‌నెస్‌ విషయంలోనూ ఏ మాత్రం వెనక్కి తగ్గదు. అందుకే ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైనా ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి పెడుతోందీ మిల్కీ బేబ్‌. అంతేకాదు.. తన ఆరోగ్యకరమైన లైఫ్‌స్టైల్‌, చేసే వ్యాయామాలు, పాత జ్ఞాపకాలు.. ఇలా బోలెడన్ని విషయాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా వేదికగా తన ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఈ నేపథ్యంలో తమన్నా పంచుకున్న క్వారంటైన్‌ డైరీస్‌లోని కొన్ని అంశాలపై మనమూ ఓ లుక్కేద్దాం రండి..

Know More

women icon @teamvasundhara

దూరంగా ఉంటే వారి మంచి కోరుకున్నట్లే!

కరోనా మహమ్మారిపై ప్రపంచ దేశాలు విస్తృతంగా పోరాటం చేస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతోన్న ఈ వైరస్ వ్యాప్తిని అదుపు చేసేందుకు వివిధ దేశాల ప్రభుత్వాలు తమ శక్తికి మించి కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలో కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వాలతో పాటు పలు ఆరోగ్య సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు సైతం ముందుకొస్తుండడం విశేషం. ఈ నేపథ్యంలో ప్రముఖ స్వచ్ఛంద సంస్థ యునిసెఫ్ (UNICEF) కూడా వివిధ వేదికల ద్వారా అవగాహన కార్యక్రమాలను చేపడుతోంది. అంతేకాదు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను సైతం వీటిలో భాగం చేస్తోంది. ఈ క్రమంలో మాజీ ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్‌ కూడా ఇటీవల యునిసెఫ్‌ ద్వారా ప్రజలకు తన సందేశాన్ని తెలియజేయడం విశేషం.

Know More

women icon @teamvasundhara

లాక్‌డౌన్‌: మనతో మనం గడపాల్సిన సమయమిదే..!

వెండితెరైనా.. నిజ జీవితమైనా.. అన్యోన్యమైన జంట అనే పదానికి నిలువెత్తు నిర్వచనం దీపిక-రణ్‌వీర్‌. సందర్భమేదైనా, వేదికేదైనా ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమను వ్యక్తం చేసుకోవడానికి ఏమాత్రం వెనకాడరీ క్యూట్‌ కపుల్‌. ఇలా తమ ప్రణయ బంధంతో నేటి తరం దంపతులకు రిలేషన్‌షిప్‌ పాఠాలు నేర్పుతుంటారు దీప్‌వీర్‌. అయితే ఇద్దరూ వారి వారి సినిమాలతో నిత్యం తీరిక లేకుండా గడిపే ఈ జంటకు అనుకోకుండా లాక్‌డౌన్‌ సెలవులు దొరకడంతో తమ అనుబంధాన్ని మరింతగా దృఢం చేసుకుంటున్నారు దీపిక-రణ్‌వీర్‌లు. ఈ క్రమంలో వారు చేసిన యాక్టివిటీస్‌ వీడియోలు, ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ అభిమానులకు తమ అనురాగ దాంపత్యం గురించి చెప్పకనే చెబుతున్నారీ లవ్లీ కపుల్‌. అయితే తాజాగా ఓ వీడియో ఇంటర్వ్యూలో దీపిక మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌లో రణ్‌వీర్‌తో గడుపుతోన్న మధురానుభూతులను, స్వీయ నిర్బంధ కాలంలో ఎదురయ్యే మానసిక ఆందోళనల గురించి చెప్పుకొచ్చింది. మరి, ఆ విశేషాలేంటో తన మాటల్లోనే విందాం రండి..

Know More

women icon @teamvasundhara

ఇంట్లోనే ఉండండి.. నాతో కలిసి కేక్‌ చేయండి!

మల్టీ ట్యాలెంటెడ్‌ కిడ్‌.. ఈ పదానికి ప్రిన్స్‌ మహేష్‌బాబు గారాల పట్టి సితార చక్కగా సరిపోతుంది. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇంట్లోనే గడుపుతోన్న ఈ చిన్నారి.. ఈ ఖాళీ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటోంది. సితార, తన బెస్ట్‌ ఫ్రెండ్‌ ఆద్య (దర్శకుడు వంశీ పైడిపల్లి)తో కలిసి ‘A&S’ పేరుతో ఓ యూట్యూబ్‌ ఛానల్‌ను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. పిల్లలు ఇష్టపడే విషయాలతో పాటు పండగలు, ప్రత్యేక సందర్భాలపై వీడియోలు రూపొందించి తమ యూట్యూబ్‌ ఛానల్‌లో పోస్ట్‌ చేస్తుంటారీ సెలబ్రిటీ కిడ్స్‌. అయితే ప్రస్తుతం కరోనాపై పోరులో భాగంగా అందరూ స్వీయ నిర్బంధం పాటిస్తోన్న ఈ సమయంలో ఓ రుచికరమైన, ఆరోగ్యకరమైన కేక్‌ను మనకోసం తయారుచేసి చూపించింది సీతా పాప. అంతేకాదు.. ‘ఇంట్లోనే ఉండండి.. నాతో కలిసి వంట చేయండి..’ అంటూ సితార ఎంతో ఈజీగా తయారుచేసిన ఆ కేక్‌ రెసిపీ ఏంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

నిత్యం బిజీబిజీగా గడిపే మనకు ఇదొక చెక్‌ పాయింట్‌!

లాక్‌డౌన్‌.. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని బహుశా ఎవరూ కలలో కూడా అనుకుని ఉండరు. కానీ కరోనా కారణంగా మనం అటువంటి రోజుల్ని చూడాల్సి వస్తోంది. ఈ క్రమంలో సెలబ్రిటీలు తమ ఇళ్లలో ఉంటూనే అభిమానులకు తమ విలువైన సందేశాలను అందిస్తూ.. స్వీయ నిర్భంధం సమయంలో వారెలా గడుపుతున్నారో అందరితో పంచుకుంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌ బ్యూటీ మంచు లక్ష్మీ ప్రసన్న కూడా ఇదే పనిలో ఉంది. ఇంట్లో తాను స్వీయ నిర్బంధం పాటిస్తూనే తన అభిమానులకు కరోనా జాగ్రత్తలు చెబుతోంది లక్ష్మి. అంతేనా.. అమ్మలందరికీ పేరెంటింగ్‌ పాఠాలు కూడా చెబుతోందీ బ్యూటిఫుల్‌ మామ్‌. ప్రస్తుతం కరోనా కారణంగా ఇంట్లో ఉంటోన్న చిచ్చర పిడుగుల్ని అదుపు చేయడానికి కొన్ని టిప్స్‌ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిందీ అందాల అమ్మ. మరి, ఈ మంచు బ్యూటీ చెప్పిన ఆ విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

లాక్‌డౌన్‌ సమయాన్ని ఇలా సద్వినియోగం చేసుకోండి..!

కరోనా.. కరోనా.. ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఎవరి నోటి వెంట విన్నా ఈ వైరస్‌కు సంబంధించిన వార్తలే. లాక్‌డౌన్‌ నేపథ్యంలో అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. మొన్నటిదాకా ఇంట్లో నిమిషం కూడా గడపడానికి సమయం లేకుండా బిజీ బిజీగా గడిపిన వారెంతో మంది ప్రస్తుతం అడుగు బయట పెట్టలేని పరిస్థితుల్లోకి వెళ్లారు. ఒకవేళ ధైర్యం చేసి బయటికొద్దామని ప్రయత్నించినా.. పోలీసులు తమ లాఠీలకు పని చెబుతున్నారు. ఇక ఇంట్లో ఉన్న వాళ్ల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమయాన్ని ఎలా గడపాలో తెలియక తెగ సతమతమవుతున్నారు. మరి ప్రస్తుతం లాక్‌డౌన్‌లో భాగంగా ఇంట్లో ఖాళీగా గడుపుతోన్న ఈ సమయాన్ని మనకు, మన భవిష్యత్తుకు ఉపయోగపడేలా సద్వినియోగం చేసుకోవడానికి బోలెడన్ని మార్గాలున్నాయి. మరి, అవేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

అంబులెన్స్‌ సైరన్‌ వింటూనే నిద్రపోతున్నా.. నిద్రలేస్తున్నా..!

చైనాలో పురుడు పోసుకున్న కరోనా ఇటలీ పాలిట పెనుశాపంగా మారింది. ప్రపంచంలో అత్యంత మెరుగైన వైద్య సదుపాయాలున్న ఆ దేశంలో ప్రస్తుతం కొవిడ్‌-19 కరాళ నృత్యం చేస్తోంది. దీని కారణంగా ఆ దేశంలో ఇప్పటికే సుమారు 12 వేల మంది మృత్యువాత పడ్డారు. కరోనా దాటికి అక్కడ రోజుకు వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలొదులుతుండగా, వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఆ దేశ ఆర్థిక పరిస్థితి కూడా ఆధ్వాన్నంగా మారడంతో సామాన్య ప్రజలు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని కాలం వెల్లదీస్తున్నారు. ఈ నేపథ్యంలో నెల రోజుల క్రితం ఇటలీకి వెళ్లిన ప్రముఖ భారతీయ గాయని శ్వేతా పండిట్‌ కూడా అలాంటి గడ్డు పరిస్థితినే ఎదుర్కొంటోంది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ఆ దేశం నుంచి స్వదేశానికి తిరిగొచ్చే అవకాశం గత కొన్ని రోజుల క్రితం వరకు ఉన్నప్పటికీ తన వల్ల ఇక్కడి వారు ఇబ్బంది పడకూడదన్న సదుద్దేశంతో అక్కడే ఆగిపోయింది శ్వేత. దీంతో ప్రస్తుతం అక్కడే స్వీయ నిర్బంధంలో ఉంటోన్న ఆమె అక్కడి భయానక పరిస్థితులను, తన సెల్ఫ్‌ క్వారంటైన్‌ అనుభవాలను సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసుకుంది.

Know More

women icon @teamvasundhara

ఇంత ఘోరమైన చావు నాకెందుకిస్తున్నావ్‌ దేవుడా.. అనిపించింది!!

కంటికి కనిపించకుండా ప్రపంచాన్నంతా కలవరపెట్టిస్తోంది కరోనా. చిన్నా, పెద్దా, ధనిక, పేద అన్న తేడాల్లేకుండా అందరినీ కబలిస్తోంది. అగ్రరాజ్యమైన అమెరికా, అత్యాధునిక వైద్య సదుపాయాలుండే ఇటలీ, ధనిక దేశాలైన స్పెయిన్‌, జర్మనీ లాంటి దేశాలకు కూడా చుక్కలు చూపిస్తోంది. ఇక బ్రిటన్‌లోనూ కరోనా జూలు విదిల్చుతోంది. ఏకంగా ఆ దేశ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఈ మహమ్మారి బారిన పడ్డారంటేనే అక్కడ పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఆ దేశ ఆరోగ్య మంత్రి మ్యాట్‌ హాన్‌కాక్‌, బ్రిటన్‌ యువరాజు చార్లెస్‌లకు కూడా ఈ వైరస్‌ సోకింది. అయితే సామాజిక దూరం పాటిస్తూ స్వీయ నిర్బంధంలో ఉంటే ఈ ఉపద్రవం నుంచి సులభంగా బయటపడవచ్చని ఇప్పటికే చాలామంది కొవిడ్‌ బాధితులు తమ స్వీయానుభవంతో నిరూపించారు. తాజాగా తాను కూడా ఈ జాబితాలో ఉన్నానంటోంది బ్రిటన్‌కు చెందిన తోబి అకింగ్‌బాడే. కరోనా బారిన పడి ఇటీవలే కోలుకున్న ఈ 28 ఏళ్ల జర్నలిస్టు తన అనుభవాలను సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసుకుంది. ఇందులో భాగంగా కరోనా లక్షణాలు, ఐసోలేషన్‌లో పడిన బాధలు, వాటిని అధిగమించిన తీరును ట్విట్టర్‌ వేదికగా సవివరంగా అందరితో పంచుకుంది.

Know More

women icon @teamvasundhara

ఆధ్యాత్మిక చింతనతోనే ‘మత్తు’ వదిలించుకున్నా!

ఈ కరోనా సమయంలో మన సెలబ్రిటీలందరూ స్వీయ నిర్బంధం పాటిస్తూ వారికి సంబంధించిన విషయాలను తమ అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూ వారిలో స్ఫూర్తి నింపడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనాలీలోని తన ఇంట్లో స్వీయ నిర్బంధంలో ఉన్న బాలీవుడ్‌ బ్యూటీ కంగన.. ప్రస్తుతం భక్తిభావంలో మునిగి తేలుతోంది. ఉత్తరాదిన ఎక్కువగా జరుపుకునే చైత్ర నవరాత్రిని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటోన్న కంగన.. తన గురించి మనందరికీ తెలియని బోలెడన్ని విషయాలను వీడియోల రూపంలో పంచుకుంటోంది. ఈ క్రమంలో కంగన తాజాగా పెట్టిన ఓ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరలైంది. పదిహేనేళ్ల వయసులో తాను చేసిన ఓ పని గురించి ఈ వీడియోలో చెప్పడమే అందుకు కారణం. మరి, ఇంతకీ కంగన ఏమందో తెలుసుకుందామా..

Know More

women icon @teamvasundhara

ఈ ‘క్వారంటైన్‌’ డైట్‌ ప్లాన్‌ మనమూ ఫాలో అయిపోదామా?

గత నెల రోజుల నుంచి మన దేశాన్ని పట్టి పీడిస్తున్న భూతం కరోనా వైరస్‌. దీంతో అప్పటివరకు ఎంతో ఆనందంగా, అందరి మధ్య సాగిన మన జీవితం సామాజిక దూరం, సెల్ఫ్‌ క్వారంటైన్‌, సెల్ఫ్‌ ఐసోలేషన్‌, వ్యక్తిగత పరిశుభ్రత.. అంటూ అనుక్షణం వీటి చుట్టూనే తిరుగుతుంది. ఇక కరోనా దెబ్బకు స్కూల్స్‌ దగ్గర్నుంచి ఐటీ కంపెనీల దాకా అన్నీ ఇప్పటికే మూతపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఆప్షన్‌ ఇవ్వగా.. కొన్ని కంపెనీలు మాత్రం ఈ లాక్‌డౌన్‌ కాలంలో తమ ఉద్యోగులు పని చేయాల్సిన అవసరం లేదంటూ తమ కార్యాలయాలకు సెలవులు ప్రకటించాయి.

Know More

women icon @teamvasundhara

ఇంట్లోనే ఉన్నా వర్కవుట్‌ మానద్దు!

కరోనా ప్రకంపనలు ప్రపంచాన్ని కలవర పెడుతున్నాయి. ఇప్పటికే భారతదేశంలో 15 రాష్ట్రాల్లో కోరలు చాస్తూ శరవేగంగా విస్తరిస్తోంది కరోనా. అందుకే దేశంలోని విద్యాసంస్థల దగ్గర్నుంచి జిమ్స్‌, బార్స్‌, సినిమా థియేటర్స్‌.. ఇలా అన్నీ మూతపడ్డాయి. దీని వల్ల దాదాపుగా జనజీవనం స్తంభించిపోయింది. అయినా సెలబ్రిటీలు మాత్రం ఇన్‌స్టా వేదికగా తమ ఫ్యాన్స్‌కి అనునిత్యం టచ్‌లోనే ఉంటూ కరోనా జాగ్రత్తల గురించి పోస్టుల ద్వారా తెలియజేస్తున్నారు.. ఈ మహమ్మారిని నిర్లక్ష్యం చేయడం తగదంటూ అభిమానులను అప్రమత్తం చేస్తున్నారు. అయితే ఇలా జిమ్‌లు మూత పడ్డంత మాత్రాన, సెలవులు దొరికాయన్న నెపంతో వర్కవుట్‌కు మాత్రం సెలవులిచ్చేయద్దంటున్నారు కొందరు ముద్దుగుమ్మలు. అందుకే స్వీయ నిర్బంధంలో ఉన్నప్పటికీ ఇంట్లోనే చక్కగా వర్కవుట్‌ చేస్తూ అటు ఆరోగ్యాన్ని, ఇటు ఫిట్‌నెస్‌ను పెంచుకోవాలంటూ సూచిస్తున్నారు. మరి, ఇంట్లోనే వర్కవుట్‌ చేస్తూ అందరికీ ఫిట్‌నెస్‌ పాఠాలు నేర్పుతోన్న ఆ ముద్దుగుమ్మలెవరు? వారి ఫిట్‌నెస్‌ లెసన్స్‌ ఏంటో తెలుసుకుందాం రండి..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala