అమ్మలూ.. ఈ పుస్తకం ఎదిగే మీ కూతుళ్ల కోసమే..!
నెలసరి.. ఎంత చెప్పుకున్నా, ఎన్ని రకాలుగా చైతన్యం కలిగించాలనుకున్నా ఇంకా దీన్నో శాపంలానే భావిస్తున్నారంతా! ఇక యుక్త వయసులోకి అడుగుపెట్టే అమ్మాయిలు సైతం దీని గురించి తెలుసుకోవడానికి, సందేహాలు నివృత్తి చేసుకోవడానికి అమ్మల దగ్గరా సిగ్గుపడుతుంటారు. పైగా పిరియడ్స్ గురించి చుట్టూ అలుముకున్న మూసధోరణులు వారి మనసుల్లో ప్రతికూలమైన ఆలోచనల్ని రేకెత్తిస్తున్నాయి. ఎదిగే అమ్మాయిల్లో కలిగే ఇలాంటి ఆలోచనల్ని, భావోద్వేగాలను తొలగించి నెలసరి అనే సున్నితమైన అంశం గురించి వారికి సంపూర్ణ అవగాహన కల్పించడానికి నడుం బిగించింది బాలీవుడ్ అందాల తార టిస్కా చోప్రా. నటిగా, నిర్మాతగానే కాకుండా.. మంచి రచయిత్రిగానూ పేరు సంపాదించుకున్న ఈ అందాల అమ్మ.. నెలసరి చుట్టూ అలుముకున్న మూసధోరణుల్ని తొలగించి.. యుక్తవయసులోకి వచ్చే అమ్మాయిలను చైతన్య పరచడానికి ఓ పుస్తకం రాశారు. మరి, దీని గురించి టిస్కా ఏమంటున్నారో తెలుసుకుందాం రండి...
Know More