పెళ్లికి ముందు మీరూ ఈ పొరపాట్లు చేస్తున్నారా?!
పెళ్లంటే చాలు అమ్మాయిలు పడే ఆరాటం అంతా ఇంతా కాదు.. తమ వివాహానికి ఎంచుకునే దుస్తుల దగ్గర్నుంచి యాక్సెసరీస్ దాకా ప్రతిదీ అందరికంటే భిన్నంగా, సరికొత్తగా ఉండాలని అనుకోవడం సహజం. ఇక అందం విషయంలో అయితే ఏమాత్రం రాజీపడే సమస్యే లేదంటున్నారు ఈ తరం అమ్మాయిలు! ఈ క్రమంలోనే పెళ్లికి ముందు బోలెడంత డబ్బు ఖర్చు పెట్టి ఫేషియల్స్, మానిక్యూర్, పెడిక్యూర్.. వంటి సౌందర్య చికిత్సలు చేయించుకుంటున్నారు. ఇక కొంతమందైతే పెళ్లిలో మరింత అందంగా కనిపించాలన్న ఉద్దేశంతో రెండు మూడు రోజుల ముందు నుంచే కొత్త కొత్త బ్యూటీ ఉత్పత్తుల్ని వాడడం, స్టైలిష్ హెయిర్కట్స్ చేయించుకోవడం లేదంటే ఉన్న జుట్టుతోనే ఏవేవో హెయిర్ స్టైల్స్ ప్రయత్నించడం.. వంటివి చేస్తుంటారు. అయితే వివాహానికి ముందు ఇలా సరికొత్త ప్రయోగాలు చేయడం వల్ల అవి వికటించి పలు సౌందర్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. కాబట్టి బ్రైడల్ లుక్ విషయంలో ముందు నుంచే ప్రణాళిక వేసుకోవడం మంచిందంటున్నారు. మరి, ఇంతకీ పెళ్లిలో అందంగా మెరిసిపోవాలన్న ఉద్దేశంతో చాలామంది అమ్మాయిలు చేసే ఆ పొరపాట్లేంటి? వాటిని ఎలా సరిదిద్దుకోవాలి? రండి.. తెలుసుకుందాం..!
Know More