దృష్టి లోపం ఉన్నా గట్టిగా అనుకుంది... సాధించింది!
ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్... దేశంలో అత్యున్నతంగా భావించే ఈ సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలు సంపాదించాలని యువత ఉవ్విళ్లూరుతుంటారు. పుస్తకాలతో కుస్తీ పడుతూ ఏళ్లకు ఏళ్లు కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకుంటుంటారు. ఎంతో కష్టసాధ్యమైన ఈ పరీక్షలను ఎదుర్కోలేక కొంతమంది మధ్యలోనే వెనకడుగు వేస్తే..మరికొందరు పట్టువదలని విక్రమార్కులలాగా ప్రయత్నిస్తూనే ఉంటారు. తెలివితేటలు, పట్టుదల, కరోఠ శ్రమను ఆయుధాలుగా చేసుకుని ప్రతిష్ఠాత్మక పరీక్షల్లో మెరుగైన ర్యాంకుని సాధించడానికి కృషి చేస్తుంటారు. ఈ క్రమంలో ఏటా యూపీఎస్సీ ఆధ్వర్యలో నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షా ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఎప్పటిలాగే ఈసారి కూడా పలువురు అమ్మాయిలు ప్రతిభ చాటారు. అవరోధాలు ఎదురైనా మెరుగైన ర్యాంకులు సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో- కంటి చూపు సరిగా లేకపోయినా తల్లిదండ్రులు, స్నేహితుల సహకారంతో సివిల్స్ ఫలితాల్లో 286 వ ర్యాంక్ సాధించింది మదురైకి చెందిన పురాణా సుంతారీ.
Know More