నేను ఎంచుకున్న.. నన్ను ఎంచుకున్న జీవితానికి థ్యాంక్స్!
ఎలాంటి సినీ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చి.. పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటి సమంత. గ్లామర్, లేడీ ఓరియంటెడ్, హోమ్లీ, థ్రిల్లర్, ప్రయోగాత్మక, సందేశాత్మక, సెంటిమెంట్.. ఇలా ఏ జోనర్‌కు చెందిన పాత్రైనా సరే అందులో పరకాయ ప్రవేశం చేయడం సామ్‌కు వెన్నతో పెట్టిన విద్య. ట్యాలెంట్, శ్రమించేతత్వం, సరైన కెరీర్ ప్లానింగ్ ఉంటే హీరోయిన్లు వివాహం తర్వాత కూడా తమ ఫామ్‌ను కొనసాగించొచ్చని చెప్పడానికి సమంతే ఓ ఉదాహరణ. అయితే కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు టచ్‌లో ఉండడం సామ్ ప్రత్యేకత. ఏప్రిల్ 28 సమంత పుట్టినరోజు. ఈ సందర్భంగా తను ఇన్‌స్టాలో షేర్ చేసిన కొన్ని ఆసక్తికర పోస్టులు మీకోసం..!
Know More